1. వేరుబుడిపెలు ఉండి, నత్రజని స్థాపన చేయగల మొక్క?
జ: చిక్కుడు
2. వర్షపు నీటిలోని నైట్రికామ్లంతో చర్యనొంది నైట్రేట్లను ఇచ్చే, భూమిలో ఉండే ఆక్సైడ్లు ఏవి?
జ: క్షార ఆక్సైడ్లు
3. ద్రవరాజంలో HNO3, HCl ల నిష్పత్తి ఎంత?
జ: 1:3
4. కిందివాటిలో అమ్మోనాల్ మిశ్రమాన్ని గుర్తించండి.
ఎ) NHNO3 + TNT బి) NH4NO3 + Al సి) NH4NO3 + CO2 డి) NH4NO3 + S
జ: NH4NO3 + Al
5. S8 గొలుసులుండే సల్ఫర్ రూపాంతరం ఏది?
జ: ప్లాస్టిక్
6. కార్బన్ డై సల్ఫైడ్లో కరగని సల్ఫర్ రూపాంతరం ఏది?
జ: ప్లాస్టిక్
7. గన్ పౌడర్ వేటి మిశ్రమం?
జ: సల్ఫర్, బొగ్గు పొడి, పొటాషియం నైట్రేట్
8. హైడ్రోజన్ సల్ఫైడ్ వాసన ఏమిటి?
జ: కుళ్లిన కోడిగుడ్ల వాసన
9. 'జిప్సం' సాంకేతిక నామం ఏమిటి?
జ: CaSO4