1. పునీత్ అనే బాలుడు 10వ తరగతి చదువుతూ టైప్ రైటింగ్ నైపుణ్యాన్ని నేర్చుకుంటున్నాడు. ఇది ఏ రకమైన అభ్యసనానికి ఉదాహరణ?
జ: చలన అభ్యసనం
2. ఎలాంటి శిక్షణ, అనుభవం లేకుండా ఒక వ్యక్తి ప్రవర్తనలో ఒక క్రమ పద్ధతిలో మార్పు జరిగితే వాటిని ఏ విధంగా పిలుస్తారు?
జ: పరిపక్వత వల్ల ఏర్పడే వికాసం
3. కిందివాటిలో అభ్యసన లక్షణం కానిది ఏది?
1) అభ్యసన ప్రక్రియ సార్వత్రికమైంది
2) అభ్యసనానికి సంచిత స్వభావం ఉంటుంది
3) పెరుగుదలలా అభ్యసనం కూడా ఒక దశ తర్వాత ఆగిపోతుంది
4) ప్రత్యక్ష, పరోక్ష అనుభవాల ఫలితమే అభ్యసనం
జ: అభ్యసనానికి సంచిత స్వభావం ఉంటుంది
4. కింది అంశాల్లో అభ్యసన కృత్యం ఏది?
1) శైశవదశ, బాల్యదశ పిల్లల్లో దంతాలు ప్రారంభమవడం
2) శిశువు తన కుటుంబ సభ్యుల మధ్య ఉన్న తన తల్లిని గుర్తించడం
3) యవ్వన దశలోకి రాగానే గౌణలైంగిక లక్షణాలు రావడం
4) పైవన్నీ
జ: శిశువు తన కుటుంబ సభ్యుల మధ్య ఉన్న తన తల్లిని గుర్తించడం
5. స్కూటర్‌ను నడుపుతున్న మోహిత్ సిగ్నల్ వద్ద ఎరుపు రంగు లైట్ పడగానే బండిని ఆపాడు. ఇది ఈ రకమైన అభ్యసనం?
జ: సంసర్గ అభ్యసనం
6. The Conditions of Learning గ్రంథకర్త ఎవరు?
జ: రాబర్ట్ గాగ్నే