• facebook
  • whatsapp
  • telegram

పెరుగుదల - వికాసం - పరిపక్వత

మాదిరి ప్ర‌శ్న‌లు

1. ఒకే తరగతి గదిలోని పిల్లల్లో బుద్ధిహీనులు, సగటు ప్రజ్ఞ, ఉన్నత ప్రజ్ఞ ఉన్నవారందరూ ఉంటారు. ఇది ఏ వికాస సూత్రానికి సంబంధించింది?
జ: వికాసం వైయక్తిక భేదాలను చూపిస్తుంది.

2. 'శిరోపాదాభిముఖ వికాస సూత్రం' కిందివాటిలో దేన్ని తెలియజేస్తుంది?
1) వికాసం తల నుంచి ప్రారంభమై కింది శరీర భాగాలకు విస్తరిస్తుంది.
2) శిరస్సు, మిగిలిన శరీర భాగాలు విడదీయరానివి.
3) వికాసం దేహ మధ్యస్థ భాగంతో ప్రారంభమై, వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది.
4) శిరస్సు వికాసం సరిగా ఉంటే, మిగిలిన భాగాల అభివృద్ధి బాగా ఉంటుంది.
జ: 1(వికాసం తల నుంచి ప్రారంభమై కింది శరీర భాగాలకు విస్తరిస్తుంది.)

 

3. కింద పేర్కొన్న వికాస నియమాల్లో ఏది వికాసానికి సంబంధించింది కాదు?
1) వికాసం నిరంతరం జరిగే అవిచ్ఛిన్న భావన.
2) వికాసం ఒక క్రమానుగతంగా జరుగుతుంది.
3) వికాసం సంచితమైన ప్రక్రియ.
4) వికాసం అన్ని దశల్లోనూ, అందరిలోనూ ఒకే వేగంతో జరుగుతుంది.
జ: 4(వికాసం అన్ని దశల్లోనూ, అందరిలోనూ ఒకే వేగంతో జరుగుతుంది.)

4. కిందివాటిలో పెరుగుదలకు సంబంధించి సరికాని వాక్యమేది?
1) పెరుగుదలను కచ్చితంగా కొలవగలం.
2) పెరుగుదల మూర్తమైన ప్రక్రియ.
3) వికాసం కంటే పెరుగుదల విస్తృతమైన భావన.
4) పెరుగుదల భౌతికమైన మార్పు.
జ: 3(వికాసం కంటే పెరుగుదల విస్తృతమైన భావన.)

 

5. కిందివాటిలో అభివృద్ధి సూత్రాలకు సంబంధించి సరికానిది ఏది?
1) నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది.
2) దీన్ని గతిశీల ప్రక్రియగా చెప్పవచ్చు.
3) అభివృద్ధిని ప్రాగుక్తీకరించగలం.
4) ఇది విపర్యయాత్మక ప్రక్రియ.
జ: 4(ఇది విపర్యయాత్మక ప్రక్రియ.)

 

6. కిందివాటిలో కచ్చితంగా కొలవగలిగే అంశం ఏది?
1) శిశువులోని మూర్తిమత్వం
2) శిశువులోని వికాసం
3) శిశువులోని పెరుగుదల
4) పై అంశాలను అన్నింటినీ కచ్చితంగా కొలవగలం.
జ: 3(శిశువులోని పెరుగుదల)

7. నవజాత శిశువులో కనిపించే సాధారణ ఉత్తేజం వయసుతోపాటు క్రమంగా అభివృద్ధి చెంది ఆనందం, ఆహ్లాదం, అసూయగా మార్పు చెందడం ఏ వికాస సూత్రమవుతుంది?
జ: వికాసం సాధారణం నుంచి నిర్దిష్టానికి సాగుతుంది.

 

8. పరిపక్వతకు సంబంధించి కిందివాటిలో సరైన వాక్యమేది?
1) పరిపక్వత జైవిక ప్రక్రియకు సంబంధించింది.
2) పరిపక్వత కేవలం పరిసర సంబంధంతోనే జరుగుతుంది.
3) తల్లిగర్భంలో ఉన్నప్పుడే పరిపక్వత జరుగుతుంది.
4) పరిపక్వతను వివరించలేం.
జ: 1(పరిపక్వత జైవిక ప్రక్రియకు సంబంధించింది.)

 

9. పునీత్ అనే 3వ తరగతి విద్యార్థి కూడిక, తీసివేత, గుణకారం నేర్చుకుని, వాటి ద్వారా భాగహార సమస్యలను పూర్తిచేయడంలో ఇమిడి ఉన్న వికాస సూత్రమేది?
జ: వికాసం సంచితమైన ప్రక్రియ.

 

10. కిందివాటిలో గుణాత్మక ప్రక్రియ ఏది?
1) పెరుగుదల         2) వికాసం         3) పై రెండూ         4) ఏదీకాదు
జ: 2(వికాసం)

Posted Date : 08-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌