• facebook
  • whatsapp
  • telegram

అధ్యయన పద్ధతులు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. కాపీ కొడుతున్న విషయాన్ని సి.సి. కెమెరాలో పరిశీలించడం
జ: సహజ - అసంచరిత పరిశీలన

 

2. వ్యవసాయదారుడు తన పొలంలో పాములు, నెమలి, కుందేలును పరిశీలిస్తే... అతడి కొడుకు వీటిని జంతు ప్రదర్శనశాలలో చూశాడు. అయితే వ్యవసాయదారుడి కొడుకు చేసే పరిశీలన
జ: నియంత్రిత పరిశీలన

 

3. ఒక సంస్థ ఒక్కసారిగా నష్టాల్లో కూరుకుపోయింది. దీనికి కారణాలను లోతుగా అన్వేషించడం ఏ పద్ధతిలో సాధ్యమవుతుంది?
జ: వ్యక్తి అధ్యయన పద్ధతి

 

4. ఒకవేళ వ్యాయామ ఉపాధ్యాయుడు క్రికెట్‌లో విద్యార్థుల ప్రతిభను తెలుసుకోవడానికి జోక్యచరాలను అదుపులో ఉంచలేనని అనుకున్నప్పుడు ఏ సమూహాలకు సభ్యులను కేటాయిస్తాడు?
జ: యాదృచ్ఛిక సమూహ పద్ధతి

 

5. పిల్లల ఆహారపు అలవాట్లు వారి ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ఉపాధ్యాయుడు ఆసక్తి చూపాడు. ఈ అధ్యయనంలో పిల్లల ఆరోగ్యం
జ: పరతంత్ర చరం

6. ఆల్‌బర్ట్ అనే 11 నెలల శిశువుపై వాట్సన్ ప్రయోగం నిర్వహిస్తున్నప్పుడు అనుకోకుండా అతడికి తీవ్రమైన జ్వరం రావడంతో పరిశోధన మధ్యలోనే ఆగిపోయింది. అయితే అకస్మాత్తుగా జ్వరం రావడం ఏ చరం?
జ: మధ్యస్థ చరం

 

7. ఒక పరిశోధన విద్యార్థి బి.ఎడ్. కళాశాలలో విద్యార్థుల హాజరును పెంచాలనుకున్నాడు. దీని కోసం ఉచిత పుస్తకాలను, హాజరు శాతాన్ని ఆధారంగా చేసుకుని చక్కటి హాజరు శాతాన్ని పెంచాడు. ఈ పరిశోధనల్లో ఉచిత పుస్తకాలను ఏ చరంగా భావిస్తారు?
జ: స్వతంత్ర చరం

 

8. గాంధీజీ తన గురించి తాను రాసిన గ్రంథం 'మై ట్రూత్', హిట్లర్ తనకు తానుగా రాసిన 'మేన్ క్యాంఫ్ (మై స్ట్రగుల్)' లాంటి గ్రంథాల ఆధారంగా వారి మూర్తిమత్వాన్ని అంచనా వేయడం ఏ పద్ధతి?
జ: స్వీయ చరిత్ర

 

9. ఇటీవల ప్రముఖ నగరాల్లో ఉగ్రవాదులు దాడులు చేస్తారని ముందుగానే తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు సివిల్ దుస్తుల్లో అనుమానిత ప్రదేశాల్లో ప్రజల మధ్య సంచరిస్తూ వారిని పసిగట్టే ప్రయత్నం చేయడం?
జ: సంచరిత పరిశీలన

 

10. కొత్తగా విద్యా ప్రక్రియలో విద్యార్థుల హాజరును పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే ఈ చిన్న పరిశోధనలో దేన్ని పరతంత్ర చరంగా చెప్పవచ్చు?
జ: విద్యార్థుల హాజరు

 

11. ఉదయం మొత్తం పడుకుని రాత్రి మొత్తం చదువుకుందామని అనుకున్న అరుణ అనే అమ్మాయి చదువు ప్రారంభించిన కొంత సమయానికి అనుకోకుండా కరెంటు పోయి చదువు కొనసాగించలేకపోయింది. ఇందులో కరెంటు పోవడం ఏ రకమైన చరం?
జ: మధ్యస్థ చరం

 

12. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన ఒక ప్రముఖ ఛానల్ యాంకర్ అతడిని ఏమేం అడగాలో ముందుగానే కొంత సమయం తీసుకుని ప్రశ్నలను సోదాహరణంగా తయారుచేసుకుంది ఒక పద్ధతి ప్రకారం అడిగి సమాధానాలు రాబట్టింది. దీన్ని ఏ రకమైన ఇంటర్వ్యూగా భావించవచ్చు?
జ: సంరచిత ఇంటర్వ్యూ

 

13. సినిమా తీసే దర్శకుడు వర్షం కోసం కాలయాపన చేయకుండా కృత్రిమంగా వర్షాన్ని కురిపించి తన సినిమాలోని పాటలను చిత్రీకరించాడు. అయితే పరిశీలన పద్ధతి ప్రకారం దీన్ని దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు?
జ: నియంత్రిత పరిశీలన

 

14. గణిత ఉపాధ్యాయుడు కంప్యూటర్, బోధనోపకరణాలను ఉపయోగించి విద్యార్థుల్లో ఆసక్తిని పెంచాడు. అయితే ఈ చిన్న పరిశోధన మార్పులో పరతంత్ర చరంగా చెప్పవచ్చు?
జ: ఆసక్తి

 

15. డీఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న విద్యార్థికి పరీక్షకు రెండు రోజుల ముందు రోడ్డుపై అనుకోకుండా, ప్రమాదం జరిగి పరీక్ష రాయలేకపోయాడు. ప్రయోగపద్ధతిలో ఇలా హఠాత్తుగా జరిగే పరిణామాన్ని దేనిగా సూచిస్తారు?
జ: మధ్యస్థ చరం

 

16. పాఠశాలకు సక్రమంగా హాజరుకాకపోవడం, దొంగతనం చేయడం, దౌర్జన్య స్వభావం, అబద్దాలు చెప్పడం లాంటి పనులు చేసే సమస్యాత్మక ప్రవర్తన ఉన్న పిల్లల గురించి అధ్యయనం చేయడానికి కిందివాటిలో ఏ పద్ధతి శ్రేష్టం?
1) సమస్యా పరిష్కార పద్ధతి             2) వ్యక్తి అధ్యయన పద్ధతి
3) ప్రయోగ పద్ధతి                     4) అసంరచిత ఇంటర్వ్యూ పద్ధతి
జ: 2(వ్యక్తి అధ్యయన పద్ధతి)

 

17. ఇంటికి బంధువులు వచ్చినప్పుడు లేదా రోడ్డుపై బాల్యమిత్రులు కలిసినప్పుడు వారిని కుశల ప్రశ్నలు వేసి వారి బాగోగులను సమయానుకూలంగా అడిగి తెలుసుకోవడం ఏ పద్ధతి?
జ: అసంరచిత ఇంటర్వ్యూ పద్ధతి

 

18. కృత్యాధార పద్ధతి పిల్లల విద్యాసాధనపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి ఉపయోగపడే మనోవిజ్ఞానశాస్త్ర అధ్యయన పద్ధతి ఏది?
జ: ప్రయోగ పద్ధతి

 

19. విద్యార్థి విహార యాత్రకు వెళ్లి సముద్రంలోని చేపలను పరిశీలిస్తే ఇది ఏ రకమైన పరిశీలన?
జ: అనియంత్రిత పరిశీలన

 

20. చింపాంజీల సాంఘిక ప్రవర్తనను పరిశీలించాలనుకున్న కొహెలర్ వాటి సహజ పరిసరాలైన అడవుల్లోకి వెళ్లి వాటిని పరిశీలించడం
జ: సహజ పరిశీలన

21. బీఎడ్ చదివే విద్యార్థులు విహార యాత్రకు వెళ్లినప్పుడు సైకాలజీ ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలసిపోయి వారి సాంఘిక లక్షణాలు, ఉద్వేగాలను పరిశీలించడం
జ: సంచరిత పరిశీలన

22. 'విద్యార్థుల అభ్యసనంపై బహుమతుల ప్రభావం' అనే ప్రయోగంలో పరతంత్ర చరం
జ: అభ్యసనం

 

23. వ్యాయామ ఉపాధ్యాయుడు ఆటల్లో విద్యార్థుల ప్రతిభను తెలుసుకోవాలనుకున్నాడు. అయితే కొంతమంది విద్యార్థులు ప్రత్యేకంగా శిక్షణ పొందారని భావించి వారిని ఆ సమూహం నుంచి తీసివేసి ఆటను నిర్వహించడం ఏ పద్ధతి?
జ: నివారణ పద్ధతి

 

24. బీఎడ్ శిక్షణను పూర్తిచేసుకున్న ఒక వ్యక్తిని ప్రయివేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముందుగానే తాను అడగదలుచుకున్న విషయంపై కొన్ని ప్రశ్నలు రూపొందించుకుని వాటి మీద జవాబులు రాబట్టడం
జ: సంరచిత పరిపృచ్ఛ

 

25. ఒక తరగతిలోని విద్యార్థులను ఉపాధ్యాయుడు మూడు సమూహాలుగా విభజించాడు. అందులో మొదటి సమూహానికి ఇంటిపని చేసుకుని వస్తే బహుమతి ఇస్తానని ప్రకటించాడు. రెండో సమూహానికి ఇంటిపని చేసుకుని రాకపోతే దండన ఉంటుందని తెలిపాడు. మూడో సమూహానికి ఇంటిపని ఇచ్చాడు అయితే బహుమానం లేదా దండనం రెండింటిలో దేన్నీ ప్రకటించలేదు. వీటిలో నియంత్రిత సమూహం ఏది?
జ: మూడో సమూహం

 

26. ఒక తరగతి ఉపాధ్యాయుడు కొన్ని నిశ్చితాంశాలపై పదో తరగతి విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం అతడు ఉపయోగించాల్సిన సరైన పద్ధతి
1) పరిపృచ్ఛ     2) పరిశీలన      3) వ్యక్తి అధ్యయన పద్ధతి      4) వైఖరి మాపనం
జ: 4(వైఖరి మాపనం)

27. కిందివాటిలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలను అధ్యయనం చేయడానికి దోహదపడే పద్ధతి
    1) వ్యక్తి అధ్యయన పద్ధతి      2) అంతపరీక్షణ పద్ధతి     

    3) పరిపృచ్ఛ పద్ధతి     4) ప్రయోగాత్మక పద్ధతి
జ: 1(వ్యక్తి అధ్యయన పద్ధతి)

 

28. ఒక రైలు ప్రమాదం జరిగినప్పుడు అక్కడకు వచ్చిన రైల్వేమంత్రితో టీవీ విలేకరులు చేసే ఇంటర్వ్యూ
జ: అసంరచిత

 

29. ఒక పరిశీలకుడు పులి వేటాడే విధానాన్ని బైనాక్యులర్ కెమెరా సహాయంతో అడవిలో ఒక చెట్టుపై నుంచి పరిశీలిస్తూ రికార్డు చేస్తున్నాడు. ఇందులో ఇతడి పరిశీలన
జ: సహభాగేతర పరిశీలన

 

30. ప్రయోగ పద్ధతిలో ప్రయోక్త ఆధీనంలో ఉండని చరం ఏది?
జ: మధ్యస్థ చరం

 

31. విద్యా మనోవిజ్ఞానశాస్త్ర బోధనా పద్ధతుల్లో అత్యంత విశ్వసనీయమైంది ఏది
జ: ప్రయోగ పద్ధతి

 

32. ప్రయోగ పద్ధతిలో ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం ఏది?
జ: స్వతంత్ర చరం

 

33. అంతపరిశీలన అంటే ఏమిటి?
జ: తనను తాను పరిశీలించుకోవడం

34. ఒక వ్యక్తిలోని వివిధ ముఖ్యాంశాలను నిశితంగా, లోతుగా పరిశీలించి నమోదు చేసి, విశ్లేషించి వ్యాఖ్యానించడం
జ: వ్యక్తిచరిత్ర పద్ధతి

 

35. పసిపిల్లలు, జంతువులు, పక్షుల ప్రవర్తనాంశాలను అధ్యయనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి ఏది?
జ: అసంచరిత పరిశీలన

 

36. సెయింట్ అగస్టీన్ ప్రవేశపెట్టిన మనోవిజ్ఞానశాస్త్ర అధ్యయన పద్ధతి ఏది?
జ: అంతపరిశీలనా పద్ధతి

 

37. అనిర్దేశిత ఇంటర్వ్యూ పద్ధతి గురించి చెప్పిన శాస్త్రవేత్త ఎవరు?
జ: కార్ల్ రోజర్స్

 

38. బాలల వివిధ వికాసాలను అధ్యయనం చేయడానికి 'అబ్జర్వేషన్ డోమ్‌'ను ఏర్పాటు చేసినవారెవరు?
జ: గెస్సెల్

 

39. విద్యార్థులు సహజంగా ఆటస్థలంలో ఆడుకునేటప్పుడు వారి ప్రవర్తనను పరిశీలించడాన్ని ఏమంటారు?
జ: సహజ పరిశీలన

 

40. ఏ పరిశీలనలో పరిశీలించబడేవారికి తాము పరిశీలించబడుతున్నామని తెలియదు?
జ: సహజ పరిశీలన

 

41. వ్యక్తిని గురించి కూలంకషంగా పరిశీలన చేసి సమగ్రంగా అధ్యయం చేసే మనో విజ్ఞానశాస్త్ర అధ్యయన పద్ధతి
జ: వ్యక్తి అధ్యయన పద్ధతి

42. ఏదైనా ఒక దృగ్విషయాన్ని నియంత్రిత పరిస్థితుల్లో అధ్యయనం చేయడాన్ని ఏమంటారు?
జ: ప్రయోగం

 

43. కిందివాటిలో చిన్నపిల్లలు, మానసిక రోగులు, నిరక్షరాస్యులు, మూగవాళ్లు, పశుపక్ష్యాదుల ప్రవర్తనలను అధ్యయనం చేయలేని పద్ధతి?
    1) అంతపరిశీలన పద్ధతి     2) వ్యక్తి అధ్యయన పద్ధతి     

   3) పరిశీలనా పద్ధతి     4) ప్రయోగాత్మక పద్ధతి
జ: 1(అంతపరిశీలన పద్ధతి)

 

44. అధ్యయన ఫలితాలు వ్యక్తులపై ఆధారపడితే దాన్ని ..... అంటారు.
జ: ఆత్మాశ్రయత

 

45. కిందివాటిలో ఎక్కువ 'ఆత్మాశ్రయత' గల పద్ధతి ఏది?
     1) అంతపరీక్షణ పద్ధతి     2) పరిశీలనా పద్ధతి    

     3) ప్రయోగాత్మక పద్ధతి     4) వ్యక్తి అధ్యయన పద్ధతి
జ: 1(అంతపరీక్షణ పద్ధతి)

 

46. కిందివాటిలో 'లక్ష్యాత్మకత' గల పద్ధతి ఏది?
    1) అంతపరీక్షణ పద్ధతి     2) పరిశీలనా పద్ధతి     

   3) ప్రయోగాత్మక పద్ధతి     4) వ్యక్తి అధ్యయన పద్ధతి
జ: 3(ప్రయోగాత్మక పద్ధతి)

 

47. కిందివాటిలో తక్కువ ఆత్మాశ్రయత ఉన్న పద్ధతి ఏది?
    1) ఇంటర్వ్యూ     2) అంతపరీక్షణ     

    3) పరిశీలనా పద్ధతి     4) వ్యక్తి అధ్యయన పద్ధతి
జ: 4(వ్యక్తి అధ్యయన పద్ధతి)

48. అంతపరీక్షణ పద్ధతి ద్వారా మొదటిసారిగా 'మానసిక ప్రకార్యాలను' గుర్తించినవారు ఎవరు?
జ: సెయింట్ అగస్టీన్

 

49. ఊంట్ తన ప్రయోగశాలలో ఉపయోగించిన పద్ధతి ఏది?
జ: అంతపరీక్షణ

 

50. వ్యక్తి అధ్యయన పద్ధతికి మరో పేరు
జ: చికిత్సా పద్ధతి

 

51. గెస్సెల్ రూపొందించిన 'అబ్జర్వేషన్ డోమ్' అనేది
జ: అసంచరిత పరిశీలన

 

52. 'ఈగో ఇన్వాల్వ్‌మెంట్' ఎక్కువగా ఉన్న పద్ధతి ఏది?
   1) అంతపరీక్షణ పద్ధతి    2) పరిశీలనా పద్ధతి   

   3) వ్యక్తి అధ్యయన పద్ధతి   4) ప్రయోగ పద్ధతి
జ: పరిశీలనా పద్ధతి

 

53. ప్రయోజ్యుల అనుభవాల వివరణ అనేది
జ: పరతంత్ర చరం

 

54. చరం అంటే ఏమిటి?
జ: ప్రయోగంలోని మార్పు

 

55. థారన్‌డైక్ పిల్లిపై చేసిన అభ్యసన ప్రయోగాలను ఏ పరిశీలనకు ఉదాహరణగా చెప్పవచ్చు?
జ: అసహజ పరిశీలన
56. కిందివాటిలో కార్యకారణ సంబంధాన్ని ఏర్పరిచే పద్ధతి ఏది?
    1) అంతపరిశీలన     2) పరిశీలనా పద్ధతి     

    3) ప్రయోగ పద్ధతి     4) ఇంటర్వ్యూ
జ: 3(ప్రయోగ పద్ధతి)

57. కిందివారిలో నిర్దేశిక పరిపృచ్ఛను ప్రాచుర్యంలోకి తెచ్చినవారు ఎవరు?
    1) విలియంసన్     2) మెకాబె     

   3) కార్ల్ రోజర్స్     4) నోమ్ ఛోమ్‌స్కీ
జ: 1(విలియంసన్)

 

58. కింది ఏ సమూహంలో తక్కువ స్వేచ్ఛ, అధిక ఒత్తిడి ఉంటుంది?
    1) నియంత్రిత సమూహం     2) ప్రయోగ సమూహం     

    3) పై రెండూ     4) నిర్వచించలేం
జ: 2(ప్రయోగ సమూహం)

 

59. విద్యార్థి అసాధారణ ప్రవర్తనను నమోదు చేయడం
జ: అనెక్‌డోటల్ రికార్డు

 

60. ఏ సమూహంలో స్వేచ్ఛ అధికంగా ఉంటుంది?
   1) ప్రయోగ సమూహం    2) నియంత్రిత సమూహం    

   3) పై రెండూ   4) నిర్వచించలేం
జ: 2(నియంత్రిత సమూహం)

 

61. ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలసి ఆడుతూ, వారికి తెలియకుండా విషయాంశాలను సేకరించే పద్ధతి
జ: సంచరిత పరిశీలన

 

62. కిందివాటిలో అంతఃపరిశీలనా పద్ధతిలోని లోపం కానిది
    1) వ్యక్తి నిష్ఠత ఉంటుంది     2) చిన్నపిల్లలకు ఉపయోగపడేది     

    3) అధిక ఆర్థిక భారం     4) అన్నీ
జ: 3(అధిక ఆర్థిక భారం)

63. ఏ అధ్యయన పద్ధతికైనా అవసరమైన ప్రాథమిక పద్ధతి ఏది?
జ: పరిశీలనా పద్ధతి

 

64. తక్కువ సమయంలో అధిక సమాచారాన్ని సేకరించడానికి అనుకూలమైన పద్ధతి ఏది?
జ: సర్వే పద్ధతి

 

65. ప్రయోగాన్ని ప్రారంభించిన తర్వాత ప్రయోగంలో కనిపించే, ఊహించని ఫలితం ఏది?
జ: మధ్యస్థ చరం

 

66. ఒక రోగి వైద్యుడు వద్దకు వెళ్లి ''నా ఆరోగ్యం నిన్నటి కంటే ఈరోజు విషమించింది" అని చెబితే దీన్ని ఏ పద్ధతిగా పేర్కొంటారు?
జ: అంతపరిశీలనా పద్ధతి

 

67. అన్ని పద్ధతుల్లో కెల్లా అత్యంత విశ్వసనీయత కలిగిన పద్ధతి ఏది?
జ: ప్రయోగ పద్ధతి

 

68. 'గెస్సెల్' అబ్జర్వేషన్ డోమ్‌ను ఏ పరిశీలనలో ఉపయోగించాడు?
జ: సహభాగి పరిశీలన

 

69. ప్రయోగంలో పాల్గొన్న ప్రయోజ్యులు చెప్పే అనుభవాలు కిందివాటిలో వేటికి చెందినవి?
    1) మధ్యస్థ చరం     2) స్వతంత్ర చరం     

    3) జోక్య చరం     4) పరతంత్ర చరం
జ: 4(పరతంత్ర చరం)

70. కిందివాటిలో ఏ పద్ధతికి అత్యంత స్నేహపూరిత వాతావరణం అవసరం?
    1) పరిపృచ్ఛా పద్ధతి     2) అంతపరిశీలనా పద్ధతి     

    3) ప్రయోగ పద్ధతి     4) ఏదీకాదు
జ: 1(పరిపృచ్ఛా పద్ధతి)

 

71. ఒక వ్యక్తిలోని కచ్చితమైన, లోతైన విషయాలను అధ్యయనం చేయడానికి అనువైన పద్ధతి
జ: కేస్‌స్టడీ

 

72. కింది పద్ధతుల్లో తక్కువ వ్యక్తి నిష్ఠత గల పద్ధతి ఏది?
    1) పరిపృచ్ఛ     2) పరిశీలనా పద్ధతి     

    3) అంతఃపరిశీలన     4) వ్యక్తి అధ్యయన పద్ధతి
జ: 4(వ్యక్తి అధ్యయన పద్ధతి)

 

73. బాలుడు అక్వేరియంలోని చేపను పరిశీలించడం అనేది ఏ రకమైన అధ్యయనా పద్ధతి?
జ: కృత్రిమ పరిశీలన

 

74. ప్రయోగ పద్ధతిలో ప్రయోక్త ఆధీనంలో ఉండని చరం ఏది?
జ: జోక్య చరం

 

75. విద్యామనోవిజ్ఞానశాస్త్రంలో ఏ పద్ధతిని అత్యంత విశ్వసనీయ పద్ధతిగా పేర్కొంటారు?
జ: ప్రయోగ పద్ధతి

76. కింది అల్ప విశ్వసనీయత కలిగి ఉన్నదేది?
    1) సంఘటనా రచనా పద్ధతి     2) ప్రయోగ పద్ధతి     

   3) పరిపృచ్ఛ     4) అంతపరిశీలనా పద్ధతి
జ: 4(అంతఃపరిశీలనా పద్ధతి)

 

77. ప్రతిస్పందనా చరం అని దేన్ని పేర్కొంటారు?
జ: పరతంత్ర చరం

 

78. ఉద్దీపనా చరం అంటే...
జ: పరతంత్ర చరం

Posted Date : 16-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌