• facebook
  • whatsapp
  • telegram

 మూర్తిమత్వ వికాసం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. రోజా అనే బాలిక పాఠశాల విరామ సమయంలో తండ్రి ఇచ్చిన డబ్బులతో తనకు ఇష్టమైన చాక్లెట్, ఐస్‌ఫ్రూట్‌లలో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి వస్తే ఈ విద్యార్థిలో ఏర్పడే సంఘర్షణ ఏది?
జ‌: ఉపగమ - ఉపగమ సంఘర్షణ

 

2. వ్యక్తిలో ప్రేరణాత్మక మరుపుగా గుర్తించే రక్షక తంత్రం
జ‌: దమనం

 

3. ఫెటనిజం అనేది ఒక
జ‌: లైంగిక నేరం

 

4. రోషాక్ సిరా మరకల పరీక్ష కిందివాటిలో దేన్ని మదింపు చేయడానికి ఉపయోగపడుతుంది?
       ఎ) మూర్తిమత్వం        బి) ప్రజ్ఞ        సి) వైఖరులు        డి) సహజసామర్థ్యాలు
జ‌: ఎ(మూర్తిమత్వం)

 

5. పిల్లవాడికి కొన్ని బొమ్మలు ఇచ్చి ఆడుకోమని చెప్పి ఆ ఆట ద్వారా అతడి మూర్తిమత్వాన్ని అంచనావేస్తే అది ఎలాంటి పరీక్ష?
జ‌: స్థితి పరీక్ష

6. ఒక విద్యార్థి పరీక్షలో కాపీ కొట్టడానికి, వెళుతున్న రైలుపై రాళ్లు విసరడానికి, పక్క విద్యార్థి బ్యాగులోంచి పెన్సిళ్లు దొంగతనం చేయడానికి కారణభూతమైంది
జ‌: అచిత్తు

 

7. పై అధికారితో నిందనకు గురైన ఒక వ్యక్తి మరికొన్ని మంచి పనులు చేసి ఆ అధికారి మెప్పు పొందడానికి చేసే ప్రయత్నం
జ‌: పరిహారం

 

8. పిల్లలకు వివిధ వస్తువులను ఇచ్చి, వారు వాటితో ఆటలాడుతుండగా వారి ప్రవర్తనను అంచనా వేయడమనేది
జ‌: క్రీడా పద్ధతి

 

9. వికాస్‌కు మైదానానికి వెళ్లి ఆడుకోవాలని ఉన్నప్పటికీ దెబ్బలు తగిలించుకుంటాడని తల్లి వెళ్లనీయకపోవడం వల్ల అతడు కుంఠనానికి గురయ్యాడు. అతడికి కుంఠనాన్ని కలిగించిన కారకం ఎలాంటిది?
జ‌: మానసికమైంది

 

10. సంఘర్షణ అనేది
జ‌: మానసిక ఉద్వేగం

 

11. 'నల్లపిల్ల' అని అందరూ వెక్కిరించిన అమ్మాయి ఒక ప్రఖ్యాత వైద్యురాలిగా పేరు తెచ్చుకోవడం ఏ రక్షక తంత్రం?
జ‌: పరిహారం

 

12. ఒక విద్యార్థికి పిల్లిని పట్టుకోవాలని ఉంది. అది కరుస్తుందేమోనని భయంతో దగ్గరకు వెళ్లడానికి ఆలోచిస్తున్నాడు. ఇది ఏ రకమైన సంఘర్షణ?
జ‌: ఉపగమ - పరిహార

 

13. పరీక్ష సరిగా రాయలేకపోవడానికి కారణం అడగగా 'పరీక్షల వల్ల ఉపయోగం లేదు' అని కుర్రవాడు ఉపయోగించే తంత్రం
జ‌: హేతుకీకరణం

 

14. డీఎస్సీ కోచింగ్‌కు వెళ్లి చదువుకోవాలని ఉంది కానీ ఫీజు మాత్రం కట్టాలని లేదు. ఇలాంటి సందర్భంలో తను ఎదుర్కొంటున్న సంఘర్షణ?
జ‌: ఉపగమ - పరిహార

 

15. మానవుడిలో అన్ని గ్రంథులను నియంత్రించే గ్రంథిని ఏమని పిలుస్తారు?
జ‌: పీయూష గ్రంథి

 

16. 'స్ప్రేంజర్' ప్రకారం ''ఉద్యమ స్ఫూర్తితో, నాయకత్వ లక్షణాలతో సంఘసేవ చేస్తూ ఎల్లప్పుడూ ఏదీ ఆశించకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవచేసేవారు"
జ‌: సాంఘిక విలువలు ఉన్నవారు

 

17. దసరా పండగకు బంధువుల ఇంటికి వెళ్లిన వధూవరులు వారు చేసిన ఆహార పదార్థాలను తిని బాగాలేకపోయినా చాలా బాగా చేశారని చక్కగా ఉన్నాయని చెప్పడం
జ‌: ప్రతిచర్య నిర్మితి

 

18. ఐఏఎస్ కావాలనుకన్న ఉపాధ్యాయుడు తాను కాలేకపోయిన్పటికీ తన కొడుకు ఐఏఎస్ కావడంతో తానే సాధించినట్లు సంతృప్తి చెందడం అనేది ఏ రకమైన రక్షక తంత్రం?
జ‌: తదాత్మీకరణ

 

19. వరుణ్ అనే బాలుడిని అతడి తండ్రి ''ఎందుకు ఫస్ట్‌క్లాస్‌లో పాస్ కాలేదు" అని అడగగా ''మా తరగతిలో ఎవరూ ఫస్ట్‌క్లాస్‌లో పాస్ కాలేదు" అనడం ఏ రక్షక తంత్రం?
జ‌: దమనం

 

20. పదోతరగతి ఫెయిలైన అశ్విని అనే విద్యార్థిని ఇంటికి వచ్చి చిన్న పిల్లలా ఏడుస్తూ ప్రవర్తించడం అనేది ఏ రక్షక తంత్రంగా చెప్పవచ్చు?
జ‌: ప్రతిగమనం

 

21. సరిగా చదవని వ్యక్తి పరీక్ష రాయకుండా తప్పించుకోవడం
జ‌: ఉపసంహరణ

 

22. రెండుసార్లు డీఎస్సీ రాసి ఉపాధ్యాయుడు కాలేకపోయిన అతడిపై ప్రభావం చూపేది
జ‌: ఒత్తిడి

 

23. అవసరాలు, అవకాశాలకు మధ్య సమతూకం లోపించినప్పుడు వ్యక్తిలో ఏర్పడేది ఏది?
జ‌: విషమయోజనం

24. అన్యాయంగా సంపాదించిన వ్యక్తి తన సంపదను దాన ధర్మాలు చేయడంలో దాగి ఉన్న రక్షకతంత్రం
జ‌: ప్రాయశ్చిత్తం

 

25. కిందివాటిలో వికాస సూత్రం కానిది
       ఎ) వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది        బి) వికాసం నిరంతర ప్రక్రియ
       సి) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు                            డి) వికాసం సంచితమైంది
జ‌: ఎ(వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది)

 

26. 'వికాస కృత్యాల' భావనను మొదట ఎవరు ప్రవేశపెట్టారు?
జ‌: రాబర్ట్ హవిగ్‌హరస్ట్

 

27. ఏ గ్రంథి స్రావకం వ్యక్తి ఉద్వేగాలపై సూటిగా ప్రభావం చూపుతుంది?
జ‌: అధివృక్క గ్రంథి

 

28. ఉద్వేగ ఒత్తిడి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం చేసే కృత్యాన్ని ఏమంటారు?
జ‌: ఎమోషనల్ కెథార్సిస్

 

29. ఒక ప్రత్యేక వృత్తిలో వ్యక్తి సాధనను గురించి ప్రాగుక్తీకరించడానికి ఆ వ్యక్తిలోని వేటిని మనం ఎక్కువగా తెలుసుకోవాలి?
జ‌: సహజసామర్థ్యం

 

30. వ్యక్తి మూర్తిమత్వం ముఖ్యంగా అతడి ఏ స్వభావం వల్ల ప్రభావితమవుతుంది?
జ‌: అభిరుచులు

31. నూతన సమాచారం అనుభవాల పరిచయం వల్ల ప్రస్తుత జ్ఞాన నిర్మాణాల్లో జరిగే పరివర్తన
జ‌: స్కీమాట

 

32. కిందివాటిలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలను అధ్యయనం చేయడానికి దోహదపడే పద్ధతి
     ఎ) వ్యక్తి అధ్యయన పద్ధతి      బి) అంతఃపరీక్షణ పద్ధతి     

     సి) పరిపృచ్ఛ పద్ధతి      డి) ప్రయోగాత్మక పద్ధతి
జ‌: ఎ(వ్యక్తి అధ్యయన పద్ధతి)

 

33. ''ప్రిన్సిపుల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ" అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
జ‌: కర్ట్ కోఫ్‌కా

 

34. వ్యాకులత, కుంఠనాల నుంచి అహాన్ని రక్షించుకోవడానికి ఉపయోగించుకునే వ్యూహాన్ని ఏమని పిలుస్తారు?
జ‌: రక్షక తంత్రం

 

35. రాజు ఇంటి పని పూర్తిచేయకపోవడంతో ఉపాధ్యాయుడు ఇతర విద్యార్థుల ముందు అతడిని మందలించాడు. ఇంటికి వచ్చిన తర్వాత రాజు అకారణంగా తన చెల్లెలిపై అరిచాడు. ఇది
జ‌: విస్తాపనం

 

36. స్వప్న విశ్లేషణ (Interpretation of Dreams) గ్రంథకర్త ఎవరు?
జ‌: సిగ్మండ్ ఫ్రాయిడ్

 

37. వ్యక్తి ఉద్వేగాలపై అధికంగా ప్రభావం చూపే గ్రంథి ఏది?
జ‌: పీయూష గ్రంథి

38. వ్యక్తి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే గ్రంథి

జ‌: అవటు గ్రంథి
 

39. వ్యక్తి మూర్తిమత్వంలో దౌర్జన్యపూరిత కోర్కెలను రేపి, జంతువాంఛలను తీర్చుకోవడానికి పురికొల్పే అంశం
జ‌: అచిత్తు

 

40. వ్యక్తి ఇతరులకెప్పుడూ హాని తలపెట్టకుండా ఆదర్శతత్వాన్ని కలిగి ఉండాలనే మనసులోని భాగం?
జ‌: సూపర్ఇగో

 

41. 'Dictionary of Psychology' గ్రంథ రచయిత ఎవరు?
జ‌: జె.పి.చాప్లిన్

 

42. పర్సోనా అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది?
జ‌: లాటిన్

 

43. వ్యక్తులు సర్దుబాటు పొందలేని క్రమంలో సంఘర్షణకు గురవుతారని ఈ సంఘర్షణ క్రమాన్ని/ రకాలను వివరించిన శాస్త్రవేత్త ఎవరు?
జ‌: కర్ట్ లెవిన్

 

44. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవారుగా ఎవరిని గుర్తిస్తారు?
జ‌: ఉభయవర్తనులు

45. సరైన సర్దుబాటు కలిగిన వ్యక్తి లక్షణం కానిది
       ఎ) శారీరక, మానసిక ఆరోగ్యం కలిగి ఉండటం       బి) భావోద్వేగ సాంఘిక పరిపక్వత లేకపోవడం
       సి) చేస్తున్న పనిలో అభిరుచి ఉండటం                 డి) పరిసరాలతో మంచి సర్దుబాటు ఉండటం
జ‌: ఎ(శారీరక, మానసిక ఆరోగ్యం కలిగి ఉండటం)

 

46. ఒక రంగంలో రాణించలేని వ్యక్తి, మరో రంగంలో గుర్తింపు పొంది అహాన్ని సంతృప్తిపరుచుకోవడమనేది
జ‌: పరిహారం

 

47. 'మూర్తిమత్వం అంటే వ్యక్తి లక్షణాంశాల గుణాత్మక నమూనా' అని పేర్కొన్నవారు?
జ‌: జె.ఎఫ్.బ్రౌన్

 

48. కిందివారిలో ఎవరి మూర్తిమత్వం ఒకేరకంగా ఉంటుంది?
   ఎ) ఒకే తరగతిలో చదువుకునే పిల్లలు   బి) ఒకే కుటుంబ సభ్యులు    

   సి) ఏక అండ కవలలు     డి) ఏదీకాదు
జ‌: డి(ఏదీకాదు)

 

49. సామాన్య గాయిటర్ వ్యాధి ......... లోపం వల్ల కలుగుతుంది.
జ‌: అయోడిన్

 

50. సర్దుబాటు సమస్య అనేది
జ‌: అంతర్గతం, బహిర్గతం

51. కుంఠనం అనేది
జ‌: మానసిక ఉద్రిక్త పరిస్థితి

 

52. మానసిక ఆరోగ్యాన్ని నిర్వచించిన శాస్త్రవేత్త
జ‌: బెర్నార్డ్

 

53. మానసిక రుగ్మత చికిత్సలో మానవతా దృక్పథాన్ని ప్రవేశపెట్టినవారు
జ‌: ఫినల్

 

54. కిందివాటిలో అసత్యం
        ఎ) జైగాంటిజం - పీయూష గ్రంథి         బి) క్రెటినిజం - థైరాయిడ్ గ్రంథి
        సి) టిటాని - పార్శ్వ అవటు గ్రంథి         డి) మిక్సోడిమా - అడ్రినల్ గ్రంథి
జ‌: డి(మిక్సోడిమా - అడ్రినల్ గ్రంథి)

 

55. పరిపక్వం చెందిన వ్యక్తి బాధ్యతారహితంగా వాహనం నడపడం
జ‌: ప్రతిగమనం

 

56. ఫైట్ & ఫ్లైట్ అనే సామ్యత కనిపించే గ్రంథి
జ‌: పిట్యూటరీ గ్రంథి

 

57. పర్సోనా అంటే ఏమిటి?
జ‌: ముసుగు

58. కిందివారిలో చొరవచూపే గుణం ఉన్నవారు
        ఎ) అంతర్వర్తనులు         బి) బహిర్వర్తనులు         సి) ఉభయవర్తనులు         డి) ఎవరూకాదు
జ‌: ఎ(అంతర్వర్తనులు)

59. సమగ్ర మూర్తిమత్వం గలవారు రక్షక తంత్రాలను ఎలా ఉపయోగిస్తారు?
జ‌: పరిమితంగా

 

60. కిందివాటిలో వ్యక్తిని తప్పు చేయాలని ప్రోత్సహించేది?
        ఎ) ఇడ్         బి) ఈగో         సి) సూపర్ ఈగో         డి) అచేతనం
జ‌: ఎ(ఇడ్)

 

61. 'ఎడిపస్ కాంప్లెక్స్', 'ఎలక్ట్రాకాంప్లెక్స్‌'లు ఉన్న మనోలైంగిక వికాసదశ
జ‌: శిశ్న దశ

 

62. ఉద్దేశ పూర్వకంగా విస్మృతికి ఉపయోగించే రక్షకతంత్రం
జ‌: దమనం

 

63. 'ఆడలేక మద్దెల ఓడ' అనడం ఏ రకమైన రక్షకతంత్రం?
జ‌: ప్రక్షేపణం

 

64. 'ఫైట్ అండ్ ఫ్లైట్' హార్మోన్ అని దేన్ని పిలుస్తారు?
జ‌: అడ్రినలిన్

65. అంతఃస్రావిక గ్రంథులు స్రవించే రసాయన పదార్థాలను ......... అంటారు.
జ‌: హార్మోన్‌లు

 

66. మూర్తిమత్వం ఒక
        ఎ) స్వీయ చేతనత్వం         బి) ఆత్మకేంద్రీకృతం         

       సి) గమ్యనిర్దేశకం         డి) అన్నీ
జ‌: డి(అన్నీ)

 

67. 'సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం' అని నిర్వచించినవారు
జ‌: ఇ.ఫారిస్

 

68. నాడీ రుగ్మత అనేది ఒక
జ‌: మానసిక రుగ్మత

 

69. వ్యక్తి మూర్తిమత్వానికి సంబంధించిన జనన పూర్వపరిసరాన్ని ప్రభావితం చేసే అంశం కానిది
        ఎ) తల్లి ఆహార అలవాట్లు         బి) తల్లిదండ్రుల వైఖరి         సి) తల్లి ఆరోగ్యం         డి) పాఠశాల
జ‌: డి(పాఠశాల)

 

70. కౌమార దశలోని పిల్లల మూర్తిమత్వంపై ఎక్కువగా ప్రభావం చూపే అంశం
జ‌: సమవయస్కులు

 

71. థీమాటిక్ అప్పర్‌సెప్షన్ పరీక్ష ఒక
జ‌: మూర్తిమత్వ పరీక్ష

72. రాజుకు పరీక్ష ముందురోజు జ్వరం వచ్చింది. దీనికి కారణమైన గ్రంథి

జ‌: అధివృక్క గ్రంథి
 

73. అవసరాన్ని బట్టి సమాచారాన్ని పునఃస్మరణ చేయడం దేనిలోని అంశం?
జ‌: ఉపచేతనావస్థ

 

74. కిందివాటిలో ప్రాథమిక అవసరం
        ఎ) గాలి         బి) ప్రేమ         సి) సెక్స్         డి) డబ్బు
జ‌: ఎ(గాలి)

 

75. వ్యక్తిలో ఉత్సుకతని జనింపజేసేది
జ‌: అవసరం

 

76. రాత్రిపూట చదివేటప్పుడు కరెంటు పోవడమనేది ఏ చరం?
జ‌: స్వతంత్ర చరం

 

77. 'జ్ఞానేంద్రియాల ద్వారా సమాచార సేకరణ చేయడం' అనేది దేనికి చెందింది?
జ‌: ఉపచేతనావస్థ

 

78. పదోతరగతి విద్యార్థి వరల్డ్ కప్ క్రికెట్ చూడాలని ఆశపడుతున్నాడు. కానీ పరీక్షలు దగ్గరలో ఉన్నాయి అని భయపడుతున్నాడు. అతడిలో సంఘర్షణ
జ‌: ఉపగమ - పరిహార

79. తన లక్ష్యంలో రాజీపడకపోతే వ్యక్తి దేనికి లోనవుతాడు?
జ‌: సంఘర్షణ

 

80. కిందివాటిలో సరైన ప్రవచనం
        ఎ) కుంఠనం వల్ల సంఘర్షణ ఏర్పడుతుంది.           బి) వ్యాకులత వల్ల కుంఠనం ఏర్పడుతుంది.
        సి) ఒత్తిడి వల్ల సమయోజనం ఏర్పడుతుంది.         డి) సంఘర్షణ వల్ల కుంఠనం ఏర్పడుతుంది.
జ‌: డి(సంఘర్షణ వల్ల కుంఠనం ఏర్పడుతుంది.)

 

81. ఇతరులను ఇష్టపడటం లేదా ఇష్టపడకపోవడం అనేది
జ‌: వైఖరి

 

82. అనాథ బాలలను గురించి మదర్ థెరిసా వారి దగ్గరి నుంచి సమస్యలు తెలుసుకోవడం
జ‌: పరిశీలన పద్ధతి

 

83. ఏదో ఒక ఉద్దీపనకు ఒక వ్యక్తి ప్రతిస్పందిస్తున్నప్పుడు అతడు వ్యక్తం చేసే ప్రవర్తనను పరిశీలించడం ఏ పద్ధతి?
జ‌: ప్రయోగాత్మక పద్ధతి

84. విద్యార్థి తరగతి గదికి ప్రతిరోజు ఆలస్యంగా వస్తున్నాడు. ఈ ప్రవర్తన సమస్యను అధ్యయనం చేయడానికి ఉ4యోగించే పద్ధతి ఏది?
జ‌: పరిశీలనా పద్ధతి

85. రాహుల్ తన స్నేహితుడి వద్దకు వెళ్లినప్పుడు దారి తప్పిపోయాడు. ఈ సందర్భంలో తను ఎలాంటి భయాందోళనకు గురయ్యాడో వివరించే పద్ధతి ఏది?
జ‌: ప్రయోగ పద్ధతి

 

86. విశ్వనాథ్ ఆనంద్ నుంచి ప్రేరణతో రవి చెస్ ఆడి విజయం సాధించాడు. ఇందులో అతడికి అప్పుడప్పుడు కలిగే మానసిక అలసట అనేది?
జ‌: స్వతంత్ర చరం

 

87. రెండు ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఎన్నిక జరగాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ
జ‌: ఉపగమ - ఉపగమ

 

88. రక్షకతంత్రం అనే భావన, పదం మొదట ఉపయోగించింది
జ‌: సిగ్మండ్ ఫ్రాయిడ్

 

89. మూర్తిమత్వానికి సంబంధించి సమగ్ర నిర్వచనం ఇచ్చిన వ్యక్తి
జ‌: ఆల్‌పోర్ట్

 

90. కిందివాటిలో దేన్ని 'అంతరాత్మ'గా పిలుస్తారు?
        ఎ) అహం         బి) వాస్తవం         

        సి) అధ్యహం         డి) అచిత్తు
జ‌: సి(అధ్యహం)

91. కిందివాటిలో మూర్తిమత్వ లక్షణం కానిది
        ఎ) ఇది గతిశీలమైంది                         బి) ఇది కొన్ని లక్షణాల సముదాయం
        సి) దీన్ని అంచనా వేయవచ్చు            డి) అన్నీ
జ‌: బి(ఇది కొన్ని లక్షణాల సముదాయం)

 

92. ఇవాన్ పావ్‌లోవ్ తన ప్రయోగంలో కుక్కను క్రమపద్ధతిలో పరిశీలించడం ఏ పద్ధతిగా పేర్కొనవచ్చు?
జ‌: అసహజ పరిశీలన

 

93. కింది పేర్కొన్న ఏ అధ్యయన పద్ధతిలో అత్యంత విశ్వనీయత ఉంది?
        ఎ) అంతఃపరీక్షణా పద్ధతి         బి) పరిశీలనా పద్ధతి         

        సి) పరిపృచ్ఛా పద్ధతి         డి) ప్రయోగ పద్ధతి
జ‌: సి(పరిపృచ్ఛా పద్ధతి)

 

94. వైద్యశాస్త్రం నుంచి స్వీకరించి, 'క్లినికల్ మెథడ్' గా పిలుస్తున్న పద్ధతి ఏది?
జ‌: ప్రయోగ పద్ధతి

 

95. ప్రత్యేకావసరాలున్న పిల్లవాడి గురించి అధ్యయనం చేసి తెలుసుకోవాలని భావించిన ఉపాధ్యాయుడికి ఉపయోగపడే పద్ధతి
జ‌: పరిపృచ్ఛ పద్ధతి

 

97. పిల్లల సర్దుబాటు సమస్యలను పరిష్కరించడానికి పాఠశాలలో వేటిని స్థాపించాలి?
జ‌: కంప్యూటర్ ల్యాబ్స్

97. ఏ గ్రంథి ఎక్కువగా పనిచేస్తే ప్రభావశీలిగా, అత్యాశపరుడుగా ఉంటారు?
జ‌: థైరాయిడ్ గ్రంథి

 

98. కిందివాటిలో స్త్రీ బీజకోశాలు విడుదల చేసే హార్మోన్
        ఎ) ఈస్ట్రోజన్         బి) థైరాక్సిన్         సి) టెస్టోస్టిరాన్         డి) ఆండ్రోజన్
జ‌: ఎ(ఈస్ట్రోజన్)

 

99. మానసిక వైద్యశాలలో దారుణ పరిస్థితులను వర్ణిస్తూ 1908లో క్లిఫర్డ్ బీర్స్‌చే ప్రచురించబడిన గ్రంథం
జ‌: ఎ మైండ్ దట్ ఫౌండ్ ఇట్‌సెల్ఫ్

Posted Date : 16-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌