• facebook
  • whatsapp
  • telegram

మాతృభాషా బోధన - లక్ష్యాలు

బోధనా లక్ష్యాలను 'టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్‌'లో మొదటిసారిగా అమెరికన్ విద్యావేత్త బెంజిమన్ బ్లూమ్ విశ్లేషించారు.దీని ఆధారంగా ఎస్.సి.ఇ.ఆర్.టి 1973-74లో 'మ్యాన్యువల్ ఫర్ స్కూల్ లెవెల్ సెమినార్‌ను' ప్రచురించింది. దీంట్లో భాషా బోధనకు 10 లక్ష్యాలను గుర్తించారు. ఈ కరదీపికలో ఉద్దేశం, గమ్యం, లక్ష్యం, స్పష్టీకరణం అనే పదాలను నిర్వచించారు.
 

ఉద్దేశాలు:
పాఠ్య ప్రణాళికల రూపకల్పన, పాఠ్యాంశాల ఎంపిక కోసం ఉపకరించేవి ఉద్దేశాలు. ఇవి దీర్ఘకాలంలో సాధించేవి. వీటిని సామాన్య ఉద్దేశాలు, ప్రత్యేక ఉద్దేశాలు అని రెండు విధాలుగా విభజించారు.

 

గమ్యాలు:
విద్యా ప్రణాళిక రూపకల్పన కోసం ఉపకరించేవి గమ్యాలు. ఇవి సుదీర్ఘకాలంలో సాధించగలిగేవి. వీటినే ధ్యేయాలని కూడా అంటారు.

 

లక్ష్యాలు:
ఉద్దేశాలు,గమ్యాల నుంచి ఆవిర్భవించేవే లక్ష్యాలు.ఇవి తరగతి బోధనకు మార్గదర్శకత్వాన్నిస్తాయి. స్వల్పకాలంలో ఒక పాఠ్యాంశం చివర సాధించాల్సినవి లక్ష్యాలు. ఇవి సంవృత లక్ష్యాలు, వివృత లక్ష్యాలు అని రెండు రకాలు.

 

స్పష్టీకరణలు:
బోధనా లక్ష్యాల సూక్ష్మరూపాలకే స్పష్టీకరణలని పేరు. ఇవి బోధన లక్ష్యాలను ప్రవర్తనా రూపంలో వివరిస్తాయి.ఉపాధ్యాయుడు సమగ్రంగా బోధించడానికి కావాల్సినవి 'లక్ష్యాలు-స్పష్టీకరణలు'. మాతృభాష బోధన జరిపే ఉపాధ్యాయులు - జ్ఞానం, అవగాహన, అనుప్రయుక్త, రసానుభూతి, భాషాభిరుచి, సముచిత మనో వైఖరి, సృజనాత్మక శక్తి, సంస్కృతీ సంప్రదాయాలు, భాషాంతరీకరణ, నైపుణ్యాలు అనే పది లక్ష్యాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఈ పది లక్ష్యాలు జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక రంగాల్లో అంతర్భాగాలుగా ఉంటాయి.

Posted Date : 21-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌