• facebook
  • whatsapp
  • telegram

భాష - వివిధ భావనలు

మాదిరి ప్ర‌శ్న‌లు 

1. యోహిహో వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు?
జ: నోరి

 

2. భాషా శాస్త్రవేత్తలు ఎన్ని ప్రపంచ భాషలు ఉన్నాయని పేర్కొన్నారు?
జ: 2796

 

3. పూపూ వాదానికి మరో పేరు?
జ: టట్ టట్ వాదం

 

4. 'భాష' అనే పదం ఏ ధాతువు నుంచి ఉత్పన్నమైంది?
జ: భాష్

 

5. నటరాజ 'ఢమరుక' శబ్దం నుంచి ఆవిర్భవించిన మహేశ్వర సూత్రాల సంఖ్య?
జ: పద్నాలుగు

 

6. ధ్వనికీ, భావానికీ అనురూపమైన సంబంధం ఉంటుందని, ప్రకృతి అంతా లయాత్మకమని, ప్రతి పదార్థం ప్రకంపనలను కలిగి ఉంటుందని, ఆ ప్రకంపనలకు అనుగుణంగానే వ్యక్తి నోట శబ్దాలు వెలువడతాయని చెప్పే భాషోత్పత్తి వాదం ఏది?
జ: డింగ్ డాంగ్ వాదం

 

7. విశ్వాసంపై ఆధారపడిన భాషోత్పత్తి వాదం-
జ: దైవదత్త వాదం

 

8. హిబ్రూను 'దేవతల భాష'గా భావించినవారు-
జ: క్రైస్తవులు

 

9. మానవుడు శ్రమిస్తున్నప్పుడు ఉచ్ఛ్వాస, నిశ్వాసాల వల్ల నాదతంత్రులు కంపించి భాష ఏర్పడుతుంది - ఏ వాదాన్ని సూచిస్తుంది?
జ: యోహిహో వాదం

 

10. నోమ్ ఛామ్‌స్కీ ప్రతిపాదించిన వాదమేది?
జ: స్వతస్సిద్ధ వాదం

 

11. భాషోత్పత్తి వాదాల్లో సమంజసమైందిగా చెప్పేది?
జ: ధాతు వాదం    

 

12. 'బౌవౌ వాదం' అని పరిహాసపూర్వకంగా పిలిచింది?
జ: మాక్స్‌ముల్లర్

 

13. పరిమిత సాధనాలను అపరిమితంగా వాడుక చేసేది-
జ: భాష

 

14. గుసగుస, కటకట, జిగ్ జాగ్ మొదలైన పదాలు ఎలా ఏర్పడ్డాయో తెలిపే వాదం?
జ: డింగ్ డాంగ్ వాదం

 

15. పడవలు నడిపే వాళ్లు చేసే ధ్వనిని బట్టి భాష ఏర్పడింది అనే వాదం-
జ: యోహిహో వాదం

 

16. ''ప్రకృతి ప్రత్యయ పద నిరూపణే భాష" అని పేర్కొన్నది
జ:  వ్యాకరణకారులు

 

17. ''Pool, tut tut'' వాదమని శాస్త్రవేత్తలు ఏ వాదాన్ని తిరస్కరించారు?
జ: సాంకేత వాదం

 

18. 'తిను' అనే ధాతువు నుంచి తినుట, తినుము అనే పదాలు వాడుకలోకి వచ్చాయని తెలిపే వాదం-
జ:  ధాతువాదం

 

19. భాష శరీరం లాంటిదైతే ప్రాణం లాంటిది?
జ:  భావం

 

20. 'అరబ్బీ'ని దేవభాషగా పేర్కొన్నది-
జ: మహ్మదీయులు

 

21. భాషకు మూలం కొన్ని ధాతువులే అని ప్రతిపాదించింది-
జ:  యాస్కాచార్యుడు

 

22. ''అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమైన సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాన్ని, ఆలోచనలను, వాంఛలను తెలియజేసేదే భాష" అని పేర్కొన్నదెవరు?
జ:  సఫీర్

 

23. ఆనందం, దుఃఖం, ఆశ్చర్యం లాంటి భావోద్వేగాల వ్యక్తీకరణ కోసం చేసే ప్రయత్నం నుంచి శబ్దాలు పుట్టాయని తెలిపే వాదం-
జ:  వివక్షాప్రేరణ వాదం

 

24. Man is man because of his speech- అని భాష ప్రాధాన్యాన్ని పేర్కొన్నది?
జ: షేక్‌స్పియర్

 

25. తత్వశాస్త్రంలోని 'అనుభవ వాదం' నేపథ్యంగా ఏ వాదాన్ని ప్రతిపాదించారు?
జ:  సంపాదన వాదం

 

26. 'ధాతువు' అంటే-
జ:  క్రియ

 

27. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష- అని నిర్వచించింది?
జ:  హాకెట్

 

28. మానవ సమాజ పరిణామాల క్రమంలో భాషల్లో వచ్చిన మార్పులను అధ్యయనం చేసే శాస్త్రం?
జ:  భాషా శాస్త్రం

 

29. మనస్తత్వ శాస్త్రంలోని ప్రవృత్తివాదం దేన్ని బలపరుస్తుంది?
జ:  సంపాదన వాదం

 

30. భాషాస్వరూపం ఎన్ని రకాలు?
జ:  6

 

31. మానవ భాషా లక్షణాలు ఎన్ని?
జ:  7

 

32. మానవుడు భూత భవిష్యత్తుల గురించి, వర్తమానం గురించి మాట్లాడగలగడం ఏ మానవ భాషా లక్షణం?
జ:  ప్రేరణ దూరత

 

33. భాష ఒకరి నుంచి వేరొకరికి ప్రసరించడం ఏ మానవ భాషా లక్షణం-
జ:  సాంస్కృతిక ప్రసరణం

Posted Date : 21-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌