• facebook
  • whatsapp
  • telegram

బోధన నైపుణ్యాలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. "The Technology of Teaching" గ్రంథకర్త ఎవరు?
జ: స్కిన్నర్

 

2. సూక్ష్మ బోధన అనేది?
జ: ఒక బోధనా మెలకువ

 

3. ఫ్రాన్సిస్ చేస్, జె.ఎల్. ట్రంప్ అనే విద్యావేత్తలు వ్యాప్తి చేసిన భావన ఏది?
జ: బృంద బోధన

 

4. 'పునర్బలనం' ఆవశ్యకతను చెప్పిన ఆధునిక బోధనా వ్యూహం ఏది?
జ: కార్యక్రమయుత బోధన

 

5. సూక్ష్మ బోధన లక్షణాల్లో ఇది ఒకటి ......
జ: బోధనా సంక్లిష్టతలను తగ్గించడం.

 

6. బృంద బోధన 1957 లో ఎక్కడ అమలైంది?
జ: లెగ్జింగ్ టోన్

 

7. తిరిగి భర్తీ, నియంత్రణ అనే అంశాలకు విశేష ప్రాధాన్యం ఇచ్చిన విద్యార్థి కేంద్రీకృత అభ్యసన పద్ధతి .......
జ: కార్యక్రమయుత బోధన

 

8. 'సూక్ష్మ బోధన'లో బోధన తర్వాత వచ్చే సోపానం?
జ: పునర్బలనం

 

9. మూల్యాంకనం వెంటవెంటనే చేయడానికి, లోపాలను సవరించడానికి ఏ బోధనలో అవకాశం ఉంది?
జ: సూక్ష్మ బోధన

 

10. కొంత మంది ఉపాధ్యాయులు సమష్టిగా ఒకే పాఠాన్ని బోధించే పద్ధతి ........
జ: బృంద బోధన

 

11. కార్యక్రమయుత బోధన అంటే ఏమిటి?
జ: పాఠ్యాంశాన్ని చిన్న చిన్న భాగాలుగా బోధించడం.

 

12. 'బోధన - పునః బోధన' అనే పదబంధాలు ఏ బోధనకు సంబంధించినవి?
జ: సూక్ష్మ బోధన

 

13. అధ్యయనాంశాలను చిన్న చిన్న కృత్యాలుగా ఆకృతీకరించిన శాస్త్రవేత్త ఎవరు?
జ: గిల్బర్ట్

 

14. ఒక నైపుణ్యాన్ని సాధించడానికి ఎన్నిసార్లు బోధించాలి?
జ: నాలుగు సార్లు

 

15. ఏ బోధనలో విద్యార్థులు విషయ ఖండికలు, చట్రాల ద్వారా విషయాన్ని, భావనలను, నిర్వచనాలను గ్రహించి తప్పులను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటారు?
జ: కార్యక్రమయుత బోధన

 

16. గరిష్ఠ స్థాయిలో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాన్ని ఏ బోధన ద్వారా పెంపొందించవచ్చు?
జ: బృంద బోధన

 

17. వ్యాకరణం, ఉపవాచకం, గద్యం, పద్యం మొదలైన భాషా ప్రక్రియలను బోధించే పద్ధతి ఏది?
జ: కార్యక్రమయుత బోధన

 

18. సూక్ష్మ బోధనలో బోధన సమయం ఎంత?
జ: 5 నిమిషాలు

 

19. ''ఇద్దరికంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఒక ప్రణాళిక ప్రకారంగా, పరస్పర సహకారంతో బోధనను, మూల్యాంకనాన్ని నిర్వహించే విధానమే బృంద బోధన" అని నిర్వచించింది ఎవరు?
జ: ఎం.బి. నాయక్

 

20. బోధనా యంత్రాన్ని రూపొందించింది ఎవరు?
జ: బి.ఎఫ్. స్కిన్నర్

 

21. 'సూక్ష్మ బోధన' అనే పారిభాషిక పదాన్ని ఏ సంవత్సరంలో ఉపయోగించారు?
జ: 1963

 

22. సహజమైన అభిరుచికి చక్కటి ప్రత్యామ్నాయంగా ఏ బోధనను పేర్కొంటారు?
జ: బృంద బోధన

 

23. శిక్షణా సంస్థలకు వరప్రసాదం అని చెప్పదగిన బోధన ఏది?
జ: సూక్ష్మ బోధన

 

24. వివిధ పూర్వసేవ, సేవాంతర్గత స్థాయి ఉపాధ్యాయుల వృత్తి వికాసానికి ఉపకరించే బోధన ఏది?
జ: సూక్ష్మ బోధన

 

25. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు తమ తమ నైపుణ్యాలను, అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని చేసే బోధన ఏది?
జ: బృంద బోధన

Posted Date : 21-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌