మాదిరి ప్రశ్నలు
1. ఒకసారి విన్నదాని కంటే చూసింది ఎక్కువ రోజులు-
జ: జ్ఞాపకం ఉంటుంది
2. చిన్నారులైన బాలబాలికలకు-
జ: నిశిత పరిశీలనాశక్తి ఉంటుంది
3. సామాన్య శాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయుడు-
జ: ప్రయోగాలు చూపిస్తూ బోధించాలి
4. కఠినమైన పాఠ్యాంశాలను బోధించడానికి ఉపాధ్యాయులు-
జ: బోధనోపకరణాలను ఉపయోగించాలి
5. ఆంగ్లమాధ్యమ పాఠశాల ఆవరణలో తరగతి గదుల్లో విద్యార్థులు-
జ: ఆంగ్లంలోనే మాట్లాడేలా చూడాలి
6. ఆంగ్లమాధ్యమ పాఠశాలల్లో చేరే విద్యార్థుల్లో అధికుల సామాజిక స్థాయి-
జ: ఉన్నత, మధ్య తరగతులు
7. ఆంగ్లమాధ్యమ పాఠశాలల్లో చదివే పిల్లలు తమ తల్లిదండ్రులను ఏమని పిలుస్తారు?
జ: మమ్మీ- డాడీ అని పిలుస్తున్నారు
8. ఈ రోజుల్లో కనిపిస్తున్న ప్రతివారినీ అంకుల్- ఆంటీ అని పిలిచే సంస్కృతి-
జ: భారతీయ సంస్కృతిని కనుమరుగుచేస్తోంది
9. ఆంగ్లం బాగా రావాలంటే
జ: ఏ మాధ్యమంలో చదివినా ఆ భాషపై ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తే సరిపోతుంది
10. పరభాషలెన్ని నేర్పినా వాటిలో-
జ: సంపూర్ణ ప్రావీణ్యాన్ని సాధించలేం
11. ఒక భాష నేర్చుకుని దానిలో జ్ఞానాన్ని పొందాలంటే-
జ: ఆ భాషలో విరివిగా మాట్లాడాలి
12. పాఠశాలల్లో చేరే మొదటి తరం అభ్యాసకుల తల్లిదండ్రులు-
జ: నిరక్షరాస్యులు
13. సహజప్రజ్ఞ ఉన్న బాలబాలికలు ఎక్కువగా ఏతరం అభ్యాసకులు?
జ: మొదటితరం
14. తల్లిదండ్రుల చదువు, పరిసరాల ప్రభావం ఉన్న పిల్లల్లో-
జ: ఎక్కువగా రెండో, మూడోతరాల వారుంటారు
15. రెండో, మూడో తరం అభ్యాసకుల ప్రజ్ఞ ఏ విధమైంది?
జ: కృత్రిమమైంది
16. తరగతి గదిలోని విద్యార్థులను వారి ప్రజ్ఞాస్థాయి ఆధారంగా ఎలా బోధించాలి?
జ: విడదీసి బోధించకూడదు
17. మొదటితరం అభ్యాసకులు ఎక్కువగా-
జ: గ్రామీణ ప్రాంతాలవారే
18. పరీక్షా ఫలితాలకు - విద్యార్థుల జ్ఞానసంపదకు లంకె పెట్టడం-
జ: సమంజసం కాదు
19. విద్యార్థుల్లో నైతికతను పెంచాలంటే ఉపాధ్యాయులు-
జ: పురాణ ఇతిహాసాల సారాన్ని కథలుగా చెప్పాలి
20. పిల్లల చదువు సంధ్యలపై ప్రభావం చేసేది ఏది?
జ: పిల్లల కుటుంబ పరిసరాలు - పాఠశాల పరిసరాలు
21. ప్రజల మన్ననలను అత్యధికంగా పొందాలనుకునే వ్యక్తి-
జ: ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాలి