• facebook
  • whatsapp
  • telegram

శిక్షణ - ఉపాధ్యాయ సాధికారత 

మాదిరి ప్ర‌శ్న‌లు

1. డైట్‌సెట్‌లో టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ విభాగంలో ప్రశ్నించడం వల్ల ప్రయోజనం ఏమిటి?
జ:  బోధనా, సహజ సామర్థ్యాలను అంచనా వేయవచ్చు

 

2. 'ఉపాధ్యాయ శిక్షణ' కార్యక్రమాలు అనేవి-
జ:  ఎలా బోధించాలి అనే విషయాన్ని అభ్యసించడానికి తోడ్పడతాయి

 

3. బోధనోపకరణాల ప్రాధాన్యమేమిటి?
జ:  అభ్యసనానికి ప్రేరణ, పునర్బలనాన్ని ఇస్తాయి

 

4. విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం రేడియో ద్వారా ప్రసారమవుతోన్న విద్యా కార్యక్రమం-
జ:  విందాం - నేర్చుకుందాం

 

5. ఉపాధ్యాయుడిగా కిందివాటిలో దేన్ని సమర్థిస్తారు? 
1) బోధనలో విద్యార్థి పాల్గొనడం
2) విద్యార్థి బాగా వినడం  
3) విద్యార్థి బాగా వింటూ చదవడం
4) విద్యార్థి చదవడానికి
జ:  బోధనలో విద్యార్థి పాల్గొనడం

 

6. ఉపాధ్యాయుడి సాధికారత పెంపొందించే ప్రక్రియ ఏది?
జ:  వృత్త్యంతర శిక్షణ

 

7. ఉపాధ్యాయ శిక్షణ అందించే 'డైట్‌'లను ఏ స్థాయిలో స్థాపించారు?
జ:  ఎలిమెంటరీ

 

8. విద్యార్థుల మానసిక స్థితి, స్వభావాన్ని ఉపాధ్యాయుడు ఎందుకు తెలుసుకోవాలి?
జ:  సామర్థ్యాధారిత బోధన కోసం 

 

9. ఉపాధ్యాయుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం-
జ:  అంకితభావం

 

10. ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి సరైన బోధన ఏది?
జ:  విద్యార్థి కేంద్రీకృతమైంది 

 

11. విద్యార్థి ప్రగతిని వివరించడంలో ఒత్తిడిని నివారించే విధానం-
జ:  గ్రేడింగ్ విధానం

 

12. ఉపాధ్యాయుడి ప్రవర్తనా తీరు విద్యార్థులను ఎందుకు ప్రభావితం చేస్తుంది?
జ:  అనుకరణ స్వభావం

 

13. బోధన సాఫల్యత వేటివల్ల సాధ్యం?
జ:  సమర్థుడైన ఉపాధ్యాయుడు

 

14. పాఠశాలలో డ్రాప్ అవుట్‌కు ప్రధాన కారణమేమిటి?
జ:  తోటి విద్యార్థులతోపాటు సామర్థ్యం పెంపొదించుకోలేకపోవడం 

 

15. బోధనలో సరైన ఎంపిక-
జ:  వైయక్తిక భేదాలకు అనువైన కృత్యం

 

16. బోధన ముఖ్య ఉద్దేశమేమిటి?
జ:  విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంపొందింపజేయడం

 

17. 'ఉపాధ్యాయుడు విద్యార్థికి మార్గదర్శకుడు'. ఉపాధ్యాయుడిగా నేను-
జ:  ఆదర్శవంతంగా ఉంటాను

 

18. తరగతిలో ఎవరికి ఉపాధ్యాయుడి అవసరం ఎక్కువగా ఉంటుంది?
జ:  విద్యలో వెనుకబడిన వారికి

 

19. తరగతి గదిలో అనుసరించదగిన బోధన-
జ:  అందరినీ గమనిస్తూ బోధించాలి

 

20. విద్యార్థి పాఠాలను బాగా అర్థం చేసుకోవడానికి సులువైన పద్ధతి ఏది?
జ:  ప్రత్యక్ష అనుభవాలు కల్పించడం

Posted Date : 08-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌