• facebook
  • whatsapp
  • telegram

మాతృభాషా బోధన - లక్ష్యాలు - స్పష్టీకరణలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. చేతిరాత, భాషణం, ప్రయోగశాల కృత్యాలు, సాంకేతిక విద్య - అనేవి ఏ రంగానికి ఉదాహరణలు?
జ: మానసిక చలన రంగం

 

2. విద్యావ్యవస్థ సాధించాల్సిన అంతిమ ధ్యేయాలేవి?
జ: గమ్యాలు

 

3. భావావేశ రంగానికి చెందిన ప్రవర్తన లక్ష్యాలను పేర్కొన్నదెవరు?
జ: క్రాత్‌హోల్

 

4. రాము అనే విద్యార్థి పాఠశాల తోటను తన మాటల్లో అద్భుతంగా వర్ణించాడు - అయితే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం?
జ: అవగాహన

 

5. కిందివాటిలో 'భాషాభిరుచి' లక్ష్యానికి స్పష్టీకరణ కానిది?
1) విస్తార గ్రంథ పఠనం చేస్తారు.        2) కవి సమ్మేళనాల్లో పాల్గొంటారు.
3) పాత్రౌచితిని తెలుసుకుంటారు.        4) ఉత్తమ పద్యాలను ధారణ చేసి పఠిస్తారు.
జ: 2 (కవి సమ్మేళనాల్లో పాల్గొంటారు.)

 

6. హృదయగతమైన లక్ష్యం?
1) రసానుభూతి         2) జ్ఞానం       3) అవగాహన       4) విశ్లేషణ
జ: 1 (రసానుభూతి)

7. 'అతని నుతింప శక్యమె జయంతుని తమ్ముడు సోయగమ్మునన్...' అనే పద్యంలోని అలంకార విశిష్టతను విద్యార్థి గ్రహిస్తే, ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏమిటి?
జ: రసానుభూతి

 

8. కావ్యాలు, నాటకాలు జ్ఞాన లక్ష్యంలో ఏ విభాగానికి చెందుతాయి?
జ: సాహిత్య జ్ఞానం

 

9. Taxonamy of Educational Objectives గ్రంథ రచయిత ఎవరు?
జ: బెంజిమన్ బ్లూమ్

 

10. తెలుగులో భాషా బోధనకు ప్రతిపాదించిన లక్ష్యాలు?
జ: 10

 

11. 'భరతమాత మందస్మిత కాంతి అందరినీ ఆకట్టుకుంటుంది' - అనే వాక్యంలోని 'మందస్మిత కాంతి' అనే పదానికి అర్థం 'నవ్వు వెలుగు' అని విద్యార్థి చెప్పగలిగితే, ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం?
జ: అవగాహన

 

12. భావావేశ రంగంలో అత్యున్నత లక్ష్యం?
జ: లక్షణీకరణం

 

13. విద్యార్థి అంతర్గత బాహ్య లక్షణాల ఆధారంగా తీర్పు చెప్పే జ్ఞానాత్మక రంగ లక్ష్యం?
జ: మూల్యాంకనం

 

14. గాంధీజీ సత్యహరిశ్చంద్ర నాటకం చూసి సత్యం, ధర్మం, న్యాయాన్ని తెలుసుకున్నాడు - ఇది భావావేశ రంగంలో ఏ దశ?
జ: గ్రహించడం

 

15. తెలుగు భాషా బోధనకు సంబంధించిన బోధనా లక్ష్యాలను ప్రచురించిన 'మాన్యువల్ ఫర్ స్కూల్ లెవెల్ సెమినార్'ను SCERT ఎప్పుడు ప్రచురించింది?
జ: 1973 - 74

 

16. పాఠశాల కార్యక్రమాల ద్వారా సాధించగలిగేవి?
జ: ఉద్దేశాలు

 

17. 'దానశీలము' పాఠ్యాంశాన్ని చదివిన విద్యార్థి అందులోని ''కారే రాజుల్... రాజ్యముల్ గలుగవే'' అనే పద్యాన్ని ధారణ చేసి పఠించాడు. అయితే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం?
జ: భాషాభిరుచి

 

18. కిందివాటిలో 'సముచిత మనోవైఖరులు' లక్ష్యానికి స్పష్టీకరణ?
1) స్వతంత్ర రచనలు చేస్తారు.          
2) సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
3) సాహితీవేత్తల పట్ల గౌరవ భావం కలిగి ఉంటారు.
4) సాహిత్య రచనలను విమర్శనా దృష్టితో చదువుతారు.
జ: 3 (సాహితీవేత్తల పట్ల గౌరవ భావం కలిగి ఉంటారు.)

అద‌న‌పు ప్ర‌శ్న‌లు

1. బోధన కృత్యానికి ప్రాతిపదికలుగా, అభ్యసనానికి సాక్ష్యాలుగా నిలిచే బోధనా లక్ష్యాల సూక్ష్మరూపాలు?

జ: స్పష్టీకరణలు

2. గద్య, పద్యాల్లో అన్వయ క్రమాన్ని తెలపగలగడం - అనే స్పష్టీకరణ ఏ బోధనా లక్ష్యానికి చెందింది?

జ: అవగాహన

3. ఆయా విషయాంశాలను జ్ఞప్తికి తెచ్చుకోవడం - అనేది ఏ లక్ష్యాలకు చెందిన స్పష్టీకరణ?

జ: జ్ఞానం

4. మనసును ఒకదానివైపు ఆకర్షింపజేసేది ఏది?

జ: అభిరుచి
 

5. 'కవి పరిచయం' జ్ఞాన లక్ష్యానికి చెందిన ఏ విభాగంలోది?

జ: విషయ జ్ఞానం

6. సంస్కృతీ సంప్రదాయానికి చెందిన స్పష్టీకరణ?

జ: పురాణేతిహాసాల్లోని విశేషాలను వివరిస్తాడు.

7. 'కచ్ఛప మూషికములు జలబిలముల దూరెను' అనే వాక్యాన్ని అన్వయ క్రమాన్ని తెలపగలుగుతాడు అనేది..?

జ: అవగాహన లక్ష్యానికి చెందింది


8. విద్యా ప్రణాళిక మొత్తంపై సాధించాల్సిన ప్రవర్తనా మార్పుల మొత్తాలు ఏవి ...?

జ: గమ్యాలు

Posted Date : 17-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌