1. అమ్మవార్లను తాంత్రిక పద్ధతిలో పూజించేవారు?
జ: ఆసాదులు
2. కిందివాటిలో రాత్రి పూట మాత్రమే ప్రదర్శించే కళారూపం?
జ: గంటె భాగవతం
3. కిందివారిలో యాదవ కులానికి చెందిన కళాకారులు ఎవరు?
1) మందెచ్చు కళాకారులు 2) విప్ర వినోదులు
3) బుడగ జంగాలు 4) శారదకాండ్రు
జ: మందెచ్చు కళాకారులు
4. ‘గంగ-గౌరి’ కళను చెప్పేవారు ఎవరు?
జ: భిక్షుక కుంట్లు
5. ఏ కళను కోస్తా, రాయలసీమలో తప్పెటగుళ్లు అని పిలుస్తారు?
జ: కప్ప పెళ్లి
6. స్త్రీలు పాల్గొనే చుట్టకాముడు ఆటకు దగ్గరగా ఉన్న కళారూపం?
జ: ధులా నృత్యం
7. మిద్దెరాములు కింది ఏ కళలో ప్రపంచ ప్రసిద్ధి చెందారు?
జ: ఒగ్గు కథ
8. ఎల్లమ్మ కథను గానం చేసే కళాకారులు?
జ: ఆసాదులు
9. ‘బవనీలు’ అని ఎవరిని పిలుస్తారు?
జ: జముకుల వారు
10. తెలంగాణలో పెళ్లిళ్లు, హోళీ, ఏరువాక సందర్భాల్లో బంజారాలు ప్రదర్శించే నృత్యం?
జ: లంబాడి నృత్యం
11. జ్యోతిషం చెబుతూ, తాయెత్తులు కడుతూ యాచక వృత్తిని చేసే కళాకారులు?
జ: బుడబుక్కల వారు
12. ముకెబర్ల జంగాలను ఎవరి కాలంలో శైవులుగా పేర్కొన్నారు?
జ: కాకతీయులు
13. ‘బుడ్డర్ ఖాన్’ పాత్ర ఎందులో ముఖ్యమైంది?
జ: చిందు భాగవతం