• facebook
  • whatsapp
  • telegram

ప్రక్రియలు

సంభాషణ:

* ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది వ్యక్తుల మధ్య జరిగే మాటల కొనసాగింపును సంభాషణ అంటారు.

* సంభాషణ మన కళ్ల ముందు పాత్రలు మాట్లాడినట్లు అనుభూతిని కలిగిస్తుంది.

యాత్రా రచన:

* యాత్ర వల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేది యాత్రా చరిత్ర.

* ఇది యాత్రా చరిత్ర ప్రక్రియకు చెందింది.

* దేశ, విదేశాల్లో నెలకొన్న అప్పటి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను కూడా ఇవి వివరిస్తాయి.

ముందు మాట లేదా పుస్తక పరిచయం:

* ఒక పుస్తకం ఆశయాన్ని, అంతస్సారాన్ని తాత్త్వికతను, రచయిత దృక్పథాన్ని, ప్రచురణ కర్త వ్యయప్రయాసలను తెలిపేదే ముందుమాట.

చారిత్రక సంస్కృతి వ్యాసం:

* వ్యాస ప్రక్రియకు చెందింది.

* చరిత్రను తెలిపే వ్యాసాన్ని చారిత్రక వ్యాసం అంటారు.

అనువాద కథ:

* ఒక భాషలో ఉన్న విషయాన్ని మరొక భాషలోకి మార్చి రాస్తే, దాన్ని అనువాదం అంటారు.

కరపత్రం 

* ఒక వ్యక్తి లేదా సంస్థ ప్రజలకు అందించాలనుకునే సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించడానికి వినియోగించే పత్రమే కరపత్రం.

* ఆంగ్లంలో దీన్ని pamphlet అంటారు.

ఇంటర్వ్యూ (లేదా) పరిపృచ్ఛ (లేదా) ముఖాముఖి

* ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ముఖాముఖిగా సంభాషించి, కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవడం పరిపృచ్ఛ.

అచ్చ తెలుగు కావ్యం

* సంస్కృత పదాలను ఉపయోగించకుండా అచ్చమైన తెలుగు మాటలతో రాసిన కావ్యమే అచ్చ తెలుగు కావ్యం.

బుర్ర కథ

* జానపద కళా రూపాల్లో బుర్ర కథ ఒకటి.

* ఇందులో ఒక కథకుడు, ఇద్దరు వంతపాడే వాళ్లు ఉంటారు.

* వచన గేయ రూపంలో కథను చెబుతూ, అభినయిస్తూ ప్రేక్షకులను రంజింపజేస్తారు.

మాదిరి ప్రశ్నలు

1. పాడగలిగేది అనే ప్రక్రియ....

1) గేయ కథ  2) గేయం  3) ద్విపద  4) పాట

2. చెలిమి అనే పాఠం ఏ ప్రక్రియకు చెందుతుంది?

1) అనువాద కథ        2) కథా కావ్యం     

3) ఖండ కావ్యం        4) అచ్చతెనుగు కావ్యం

3. మంజరీ ద్విపద అంటే?

1) యతి నియమం లేనిది 

2) ప్రాస నియమం ఉన్నది    

3) ప్రాస నియమం లేనిది  4) అంత్య ప్రాస ఉన్నది

4. పురాణాలు ఎన్ని?

1) 16     2) 12     3) 18     4) 32

5. ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులోకి వచ్చిన సాహిత్య ప్రక్రియ?

1) బుర్ర కథ         2) పాట 

3) వచన కవిత         4) గేయ కథ

6. అభినందన అనే పాఠం ఏ ప్రక్రియకు చెందింది?

1) ద్విపద    2) పద్యం    3) మినీ కవిత    4) గేయం

7. కిందివాటిలో స్వగతం అనే ప్రక్రియకు చెందిన పాఠం ఏది?

1) స్నేహ బంధం         2) చెరువు 

3) ఉడత సాయం         4) వాయసం

8. ‘కాపాడుకుందాం’ అనే పాఠం ఏ ప్రక్రియకు చెందింది?

1) సంభాషణ            2) రేడియో ప్రసంగం 

3) కథ         4) గేయ కవిత

9. ‘పల్లెటూరి పిల్లగాడా’ అనేది ఏ ప్రక్రియకు చెందిన పాఠం?

1) గేయం         2) బుర్ర కథ 

3) పాట         4) వచన కవిత

10. ప్రబంధంలో ఎన్ని వర్ణనలుంటాయి?

1) 12    2) 18     3) 24     4) 36

11. గూడూరి సీతారాం రాసిన ‘భూమిక’ అనే పాఠం ఏ ప్రక్రియకు చెందింది?

1) పుస్తక పరిచయం    2) సంపాదకీయ వ్యాసం

3) గేయ కవిత       4) మినీ కవిత

12. శతకాల్లో ప్రతి పద్యం చివర ఉన్న పదబంధాన్ని ఏమంటారు?

1) ఛందో నియమం    2) వృత్త నియమం 

3) ముక్తకం          4) మకుటం

13. తొల్లిటి కథలే.....

1) ఇతిహాసాలు         2) పురాణాలు 

3) ప్రబంధాలు         4) గల్పికలు

14. తెలుగు సాహిత్య చరిత్రలో ఏ శతాబ్దాన్ని ప్రబంధ యుగం అంటారు?

1) 20వ     2) 12వ    3) 16వ    4) 18వ

15. గల్పికలో ప్రధానమైంది?

1) విమర్శ  2) వ్యాఖ్యానం  3) హాస్యం  4) క్లుప్తత

16. ‘దీక్షకు సిద్ధం కండి’ అనే పాఠం ఏ ప్రక్రియకు చెందింది?

1) అభినందన వ్యాసం     2) కరపత్రం     

3) యాత్రారచన         4) అనువాద కథ

17. గొప్ప వారి జీవితాన్ని, వారి వ్యక్తిత్వంలోని ఉదాత్తమైన, స్ఫూర్తిమంతమైన జీవన కోణాలను విశ్లేషిస్తూ, ప్రశంసిస్తూ రాసేది?

1) తాత్విక వ్యాసం      2) అధిక్షేప వ్యాసం    

3) అభినందన వ్యాసం    4) సంపాదకీయ వ్యాసం

18. ఒక పుస్తకం ఆశయాలను, అంతస్సారాన్ని, తాత్వికతను, రచయిత దృక్పథాన్ని, ప్రచురణ కర్త వ్యయ ప్రయాసలను తెలియజేసేది?

1) ఆత్మకథ         2) జీవిత చరిత్ర 

3) మినీ కవిత         4) ముందు మాట

19. ‘గజల్‌’లో పల్లవిని ఏమంటారు? 

1) మత్లా   2) మక్తా   3) తఖుల్లస్‌   4) ఖేలన

20. ‘చీమల బారు’ పాఠం ఏ ప్రక్రియకు చెందింది?

1) గేయం   2) గేయ కవిత     3) గేయ కథ    4) పాట

21. ‘ముక్తకాలు’ ఏ ప్రక్రియకు చెందుతాయి?

1) ప్రబంధం   2) ఇతిహాసం   3) ద్విపద    4) శతకం

22. ‘ధర్మార్జునులు’ అనే పాఠం ఏ ప్రక్రియకు చెందుతుంది?

1్శ ఇతిహాసం         2్శ ప్రబంధం 

3్శ పురాణం         4్శ అనువాద కథ

23. దేశ విదేశాల్లో నెలకొన్న అప్పటి రాజకీయ, ఆర్థిక సామాజిక స్థితి గతులను వివరించేది?

1) యాత్రారచన       2) జీవిత చరిత్ర    

3) అనువాద కథ        4) మినీ కవిత

24. చేతికి అనువుగా ఒదిగి ఒక విషయానికి సంబంధించిన వివరణను ఇచ్చే కాగితాన్ని ఏమంటారు?

1్శ వ్యాసం         2్శ కరపత్రం 

3్శ వార్తా వ్యాఖ్య         4్శ గజం

25. ‘యాత్రా చరిత్ర’ ప్రక్రియకు చెందిన పాఠం.....

1) సముద్ర లంఘనం     2) త్యాగ నిరతి

3) సముద్ర ప్రయాణం     4) బండారి బసవన్న

26. కిందివాటిలో దేశి కవితా ప్రక్రియ ఏది?

1) ఇతిహాసం            2) అచ్చతెనుగు కావ్యం 

3) కథా కావ్యం           4) ద్విపద

27. ఆచార్య కె.రుక్నుద్దీన్‌ ‘విప్లవ ఢంకా’ అనే కావ్యాన్ని ఏ ప్రక్రియలో రాశారు?

1) గేయం  2) గేయ కథ  3) కథ  4) కథానిక

28. కిందివాటిలో పద్య కావ్య ప్రక్రియకు చెందిన కావ్యం?

1) సింగరేణి         2) అమరులు

3) కాపు బిడ్డ         4) మాట్లాడే నాగలి

29. సంఘటనల మధ్య సంబంధాన్ని కథాత్మకంగా  చిత్రించేది?

1) పాట         2) గేయం

3) గేయ కథ         4) కథానిక

30. ముఖాముఖి (ఇంటర్వ్యూ) ఎన్ని రకాలు?

1) 2    2) 3    3) 4    4) 5

31. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను ఒక గ్రంథంగా రాస్తే అది....

1) జీవిత చరిత్ర         2) ఆత్మకథ

3) ఇంటర్వ్యూ         4) కథానిక

32. ఆధునిక వస్తువుతో సులభశైలిలో దీర్ఘ సమాసాలు లేకుండా సరళంగా రచించే ప్రక్రియ?

1) అచ్చతెనుగు కావ్యం     2) దీర్ఘ కావ్యం 

3) ఖండ కావ్యం         4) పద్య కావ్యం

33. బసవ పురాణాన్ని ఏ ప్రక్రియలో రాశారు?

1) వచనం         2) చంపూ కావ్యం

3) పద్య కావ్యం         4) ద్విపద

34. కిందివాటిలో వ్యాస ప్రక్రియకు చెందిన పాఠం? 

1) మంజీర         2) అసామాన్యులు 

3) చిన్నప్పుడే         4) కాపు బిడ్డ

35. శతక లక్షణాల్లో ‘మకుటం’ ప్రధానం కదా! ‘మకుటం’ అంటే ......

1) కిరీటం         2) భుజ కీర్తులు

3) వంకీలు         4) కంకణం

36. జానపద సాహిత్యం అనగానే మనకు గుర్తుకు వచ్చేది..

1) ఖండ కథ  2) కథ  3) గేయం  4) కథానిక

37. ‘శ్రీలు పొంగిన జీవగడ్డ’ అనే పాఠం ఏ ప్రక్రియకు చెందింది?

1) గేయ కథ         2) దేశభక్తి గేయం

3) ఆధునిక పద్యం     4) జానపద గేయం

38. కథనం, సంభాషణలు, శిల్పం అనేవి దేనిలో ప్రధానాంశాలు?

1) గేయం   2) పాట   3) గల్పిక   4) కథానిక

39. కిందివాటిలో మాత్రా ఛందస్సులో ఉండేది?

1) ద్విపద         2) గేయం

3) మంజరీ ద్విపద     4) ఖండ కావ్యం

40. ఉత్తమ పురుష కథనంలో ఉండేది?

1) కథానిక         2) నవల 

3) జీవిత చరిత్ర         4) ఆత్మకథ

41. తెలుగులో స్వతంత్ర పురాణం ఏది?

1) మార్కండేయ పురాణం     2) భాగవత పురాణం

3) బసవ పురాణం     4) రామాయణం

42. సూర్యవంశ రాజుల చరిత్రను తెలిపే ఇతిహాసం?

1) రామాయణం         2) మహాభారతం

3) భాగవతం         4) బసవ పురాణం

43. ఆధునిక సాహిత్య ప్రక్రియల్లో ఎక్కువ పాఠక జనాదరణ పొందిన ప్రక్రియ ఏది?

1) గల్పిక   2) కథ   3) పురాణం   4) నవల

44. తెలుగులో ప్రబంధ యుగ కాలం.....

1) 15వ శతాబ్దం      2) 16వ శతాబ్దం 

3) 18వ శతాబ్దం      4) 12వ శతాబ్దం 

45. దిద్దుబాటు కథానిక 1910లో ఏ పత్రికలో వచ్చింది?

1) ఆంధ్ర పత్రిక         2) ఆంధ్రజ్యోతి

3) ఆంధ్ర భారతి         4) భారతి

46. కనుపర్తి వరలక్ష్మమ్మ గారు రాసిన లేఖలు.....

1) శారద లేఖలు           2) వసంత లేఖలు

3) ప్రేమ లేఖలు           4) జానపదుని జాబులు

47. కళాపూర్ణోదయానికి పీఠిక రాసింది?

1) వేటూరి ప్రభాకరరెడ్డి 

2) కట్టమంచి రామలింగారెడ్డి

3) రాళ్లపట్టి అనంతకృష్ణ శర్మ      4) చలం

48. నాటకాన్ని చాక్షుష క్రతువు అని పేర్కొంది ఎవరు?

1) కాళిదాసు         2) అభినవ గుప్తుడు

3) అరిస్టాటిల్‌        4) అశ్వఘోషుడు

49. తెలుగులో గల్పికా ప్రక్రియకు ఆద్యుడు?

1) గురజాడ అప్పారావు

2) కొడవటిగంటి కుటుంబరావు

3) త్రిపురనేని గోపీచంద్‌         

4) గొర్రెపాటి వెంకట సుబ్బయ్య 

50. ‘ఒకే ఒక్కడు’ పేరుతో జీవిత చరిత్ర రాసింది?

1్శ పింగళి లక్ష్మీకాంతం      2్శ కందుకూరి

3్శ గొర్రెపాటి వెంకట సుబ్బయ్య 

4్శ ఇనగంటి వెంకటరావు

51. శ్రీనాథుడు తాను రచించిన ఏ కావ్యాన్ని శైవ ప్రబంధం అని పేర్కొన్నాడు?

1్శ కాశీఖండం         2్శ హరవిలాసం

3్శ శివరాత్రి మాహాత్మ్యం     4్శ భీమఖండం

52. వ్యాసం అనే ప్రక్రియకు చెందిన పాఠం?

1్శ సింగరేణి         2్శ మాట్లాడే నాగలి

3్శ నేనెరిగిన బూర్గుల     4్శ దీక్షకు సిద్ధం కండి

53. వచన గేయ రూపంలో కథను చెబుతూ అభినయిస్తూ ప్రేక్షకులను రంజింపజేసే ప్రక్రియ.....

1్శ అభినందన కావ్యం     2్శ యాత్రా రచన

3్శ రేడియో ప్రసంగం     4్శ బుర్రకథ

54. ప్రేరణ అనే పాఠం ఏ ప్రక్రియకు చెందింది? 

1్శ దేశభక్తి పాఠం         2్శ రేడియో ప్రసంగం

3్శ జీవిత చరిత్ర         4్శ ఆత్మకథ

55. బండారి బసవన్న అనే పాఠం ఏ ప్రక్రియకు చెందింది?

1్శ ప్రబంధం         2్శ ద్విపద 

3్శ ఆధునిక పద్యం     4్శ ఖండకావ్యం

56. మకుట రహితంగా ఉన్న శతకం?

1) సుభాషిత రత్నావళి     2) శివతత్వ సారం

3) వృషాధిప శతకం     4్శ కుమారీ శతకం

57. ఉద్యమ స్ఫూర్తి అనే పాఠం ఏ ప్రక్రియకు చెందింది?

1) జీవిత చరిత్ర         2) ఆత్మకథ

3) ఖండ కావ్యం         4) కథా కావ్యం

58. కిందివాటిలో స్వగతం ఎందులో ఉంటుంది?

1) ఉత్తమ పురుష కథనం       2) ప్రథమ పురుష కథనం  

3) మధ్యమ పురుష కథనం    4) అన్య పురుష కథనం

59. ‘సాలార్‌జంగ్‌ మ్యూజియం’ పాఠం ఏ ప్రక్రియకు చెందింది?

1) గేయం   2) డైరీ   3) లేఖ   4) సంభాషణ

సమాధానాలు

1 - 2   2 - 4   3 - 3   4 - 3   5 - 3   6 - 4   7 - 2   8 - 1   9 - 3    10 - 2   11 - 1   12 - 4    13 - 1    14 - 3    15 - 1    16 - 2    17 - 3    18 - 4    19 - 1    20 - 2    21 - 4    22 - 2    23 - 1    24 - 2    25 - 3    26 - 4    27 - 1    28 - 3    29 - 4    30 - 1    31 - 2    32 - 3    33 - 4    34 - 2    35 - 1    36 - 3    37 - 2    38 - 4    39 - 2    40 - 4    41 - 3     42 - 1   43 - 4   44 - 2   45 - 3   46 - 1   47 - 2   48 - 1   49 - 2   50 - 4   51 - 2   52 - 1   53 - 4   54 - 4   55 - 2   56 - 1   57 - 2   58 - 1   59 - 2

Posted Date : 20-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌