మాదిరి ప్రశ్నలు
1. భాను + ఉదయం -
జ: భానూదయం
2. గుణసంధికి ఉదాహరణ -
జ: సప్తర్షులు
3. ఐ, ఔ లను ఏమంటారు?
జ: వృద్ధులు
4. యణ్ణులు అంటే...?
జ: యవరలు
5. 'అభ్యుదయం' లో ఉన్న సంధి లాంటిది -
జ: అత్యున్నతం, గుర్వాజ్ఞ, అభ్యర్థి
6. చిన్మయం - విడదీయండి.
జ: చిత్+మయం
7. పిత్రంశం అనేది -
జ: యణాదేశసంధి
8. విసర్గ సంధికి ఉదాహరణలు -
జ: శిరోరత్నం, చతురాశన, మనస్తాపం
9. హ్రస్వమైన ఉకారాన్ని ఏమంటారు?
జ: ఉత్తు
10. ప్రథమ మీది పరుషాలకు వచ్చే సంధి -
జ: గసడదవా దేశసంధి
11. పేదరాలు, గుణవంతురాలులోని 'ఆలు' అంటే.
జ: స్త్రీ
12. దయఁజూచి అనేది-
జ: సరళాదేశ సంధి
13. ద్విరుక్తం యొక్క పరరూపం -
జ: ఆమ్రేడితం
14. యడాగమ త్రికసంధికి ఉదాహరణ-
జ: అయ్యది
15. కుఱు, చిఱు, కడు, నడు, నిడు శబ్దాలకు వచ్చేది-
జ: ద్విరుక్తటకార సంధి
16. అత్తఱి - విడదీయండి.
జ: ఆ + తఱి
17. వర్ణాధిక్యం అనేది ......
జ: ఆగమం
18. జగన్నాటకం - అనేది ఏ సంధి?
జ: అనునాసిక సంధి
19. గుణములు అంటే ...?
జ: ఏఓఅర్
20. స్వాగతం - విడదీయండి.
జ: సు + ఆగతం
21. కిందివాటిలో విసర్గ సంధి?
1) చతుర్ముఖ 2) దేవర్షి 3) దివ్యౌషధం 4) సూక్తి
జ: 1) చతుర్ముఖ
22. కెందమ్మి - ఏ సంధి?
జ: ప్రాతాది సంధి
23. వసంత + ఋతువు - కలపండి.
జ: వసంతర్తువు
24. సంస్కృత ప్రాకృతాలతో సమానమైన పదాన్ని ఏమంటారు?
జ: తత్సమం
25. కిందివాటిలో ఆమ్రేడిత సంధి కానిది ఏది?
1) అందదుకు 2) ఊరెల్ల 3) చెచ్చెర 4) ఏదీకాదు
జ: 2) ఊరెల్ల