మాదిరి ప్రశ్నలు
1. తెలుగులో పురాణాల ప్రభావంతో వెలువడింది?
1) భాగవతం 2) కాశీఖండం 3) భీమఖండం 4) అన్నీ
జ: అన్నీ
2. పాణినీయ ప్రభావం ఉన్నది...?
జ: బాలవ్యాకరణం
3. చైనా సాహిత్య ప్రభావం ఉన్న ఉద్యమం ఏది?
జ: విప్లవ ఉద్యమం
4. ఏ రచనా ప్రక్రియపై... ఓ హెన్రీ, మొపాసా, సోమర్సెట్ మామ్ల ప్రభావం ఎక్కువ?
జ: కథ
5. జాషువా 'ఫిరదౌసి' కావ్యంపై ఏ భాషా సాహిత్య ప్రభావం ఉంది?
జ: పార్శీ
6. 'హైకూ' అనే ఇటీవలి కవితా రూపం ఏ భాషా సాహిత్య ప్రభావంతో వచ్చింది?
జ: జపనీస్
7. 'తెలుగు సాహిత్యంపై ఆంగ్ల సాహిత్య ప్రభావం' పుస్తకం రచయిత ఎవరు?
జ: కొత్తపల్లి వీరభద్రరావు
8. కింది పదాల్లో పోర్చుగీస్ పదం కానిదేది?
1) టమాటో 2) బాల్చీ 3) మేస్త్రీ 4) బజారు
జ: బజారు
9. మజ్జిగ, హుటాహుటి అనేవి ఏ భాషా పదాలు?
జ: కన్నడం
10. కిందివాటిలో తమిళ భాషా పదమేది?
1) హెచ్చు 2) భోగట్టా 3) అరంగేట్రమ్ 4) పన్నె
జ: అరంగేట్రమ్