మాదిరి ప్రశ్నలు
1. రాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులున్నారనడానికి ఆధారం?
జ: తిప్పలూరు శాసనం
2. ప్రబంధాల్లో ఉండేది...
జ: మితిమీరిన శృంగారం
3. స్త్రీల నడకను హంసతో పోల్చడం అనేది-
జ: కవి సమయం
4. ఆముక్తమాల్యదకి మరో పేరేంటి?
జ: విష్ణుచిత్తీయం
5. పెద్దన మనుచరిత్రలో లేని పాత్ర?
1) వరూధిని 2) ప్రవరుడు 3) గిరిక 4) మాయా ప్రవరుడు
జ: గిరిక
6. నిగమశర్మ కథ ఏ ప్రబంధంలోది?
జ: పాండురంగ మహాత్మ్యం
7. అష్టదిగ్గజ కవుల్లో ఎవరు లేరని చరిత్రకారులు పేర్కొంటారు?
1) నంది తిమ్మన 2) పెద్దన 3) ధూర్జటి 4) తెనాలి రామకృష్ణుడు
జ: తెనాలి రామకృష్ణుడు
8. 'ముద్దుపలుకు' ఉన్న ప్రబంధమేది?
జ: పారిజాతాపహరణం
9. నంద్యాల కృష్ణభూపతికి తన ప్రబంధాన్ని అంకితమిచ్చిన కవి?
జ: పింగళి సూరన
10. కిందివాటిలో ద్వ్యర్థి కావ్యం?
1) రాఘవ పాండవీయం 2) వసుచరిత్ర 3) రాజశేఖర చరిత్ర 4) శ్రీకాళహస్తి మహాత్మ్యం
జ: రాఘవ పాండవీయ