మాదిరి ప్రశ్నలు
1. ఆంధ్ర మహాభారతంలో యయాతి చరిత్ర -
జ: నన్నయ భారతంలో ఉంది
2. 'శబ్దశాసనుడు' ఎవరు?
జ: నన్నయ
3. 'శ్రీవాణీ గిరిజాశ్చిరాయ....' అనే శ్లోకంతో ప్రారంభమయ్యేది-
జ: నన్నయ భారతం
4. హరిహరనాథుడికి అంకితమిచ్చిన కవి ఎవరు?
జ: తిక్కన
5. సుమతీ శతకం రాసిన కవి ఎవరికి సమకాలీకుడు?
జ: తిక్కన
6. కిందివాటిలో తిక్కన భారతంలో ఉన్నది?
1) వచ్చినవాడు ఫల్గుణుడవశ్యము గెల్తుమనంగరాదు...
2) గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్
3) వరమున పుట్టితిన్ భరతవంశము జొచ్చితి...
4) రాజకులైక భూషణుడు రాజమనోహరు...
జ: 1, 3 (వచ్చినవాడు ఫల్గుణుడవశ్యము గెల్తుమనంగరాదు..., వరమున పుట్టితిన్ భరతవంశము జొచ్చితి...)
7. ఎఱ్ఱన ఎవరి ఆస్థాన కవి?
జ: ప్రోలయ వేమారెడ్డి
8. ఎఱ్ఱన రాసిన అలభ్య రచన ఏది?
జ: రామాయణం
9. నాచన సోమనకు ఉన్న బిరుదు?
1) సాహిత్య రసపోషణ 2) సంవిధాన చక్రవర్తి 3) నవీనగుణ సనాథ 4) అన్నీ
జ: 4 (అన్నీ)
10. తెలుగులో తొలి ఛందో గ్రంథం ఏది?
జ: కవిజనాశ్రయం