• facebook
  • whatsapp
  • telegram

వర్ణమాల నుంచి విరామ చిహ్నల వరకు

మాదిరి ప్ర‌శ్న‌లు 

1. కిందివాటిలో వక్రం కానిది.
 ఎ) ఏ               బి) ఓ              సి) ఔ              డి) ఒ
జ‌: సి (ఔ)

 

2. దీర్ఘాచ్చుల సంఖ్య
జ‌:9


3. 

జ‌: దంత్యములు
 

4. మూర్థన్యములకు, ఓష్ఠ్యములకు మధ్యస్తంగా పలికేవి
జ‌: దంత్యములు

 

5. 'ల' అనేది
జ‌: దంత్యము

 

6. కిందివాటిలో దంత్య చ, కారమును గుర్తించండి.     
ఎ) చాప             బి) చీమ                   సి) చేను       డి) చౌక
జ‌: ఎ (చాప)

 

7. 'భారతదేశం' అనేది నామవాచకంలో ఏ రకం?
జ‌: సంజ్ఞానామవాచకం

 

8. 'సముద్రాలు' అనేవి నామవాచకంలో ఏ రకం?
జ‌: జాతి నామవాచకం

 

9. వీడు, వాడు అనేవి సర్వనామాలలో ఏ రకం?
జ‌: నిర్దేశాత్మక సర్వనామం

 

10. క్షత్రియపుత్రుడు అనేది సర్వనామాలలో ఏ రకం?
జ‌: జాతి విశేషణం

 

11. కుయ్యో , మొర్రో, భళీ లాంటి పదాలతో ఏర్పడే అవ్యయ రకం
జ‌: ప్రతి పదోక్తవ్యయం

 

12. కిందివాటిలో విధేయ విశేషణం.
ఎ) వండిన        బి) ఒకటో తరగతి         సి) బ్రాహ్మణ బాలుడు         డి) ఆయన డాక్టర్
జ‌: డి (ఆయన డాక్టర్)

 

13. కిందివాటిలో నిత్యైక వచనం కానిది.
ఎ) ఆముదం             బి) ఉప్పు              సి) జున్ను           డి) గంతులు
జ‌: డి (గంతులు)

 

14. కిందివాటిలో నిత్య ఏకవచనం
ఎ) పాలు                బి) ఇరులు              సి) నీళ్లు                 డి) ఆవాలు
జ‌: బి (ఇరులు)

 

15. కిందివాటిలో నిత్య బహువచనం కానిది.
ఎ) అందరూ             బి) తప్పట్లు                సి) పాలు               డి) కేలు
జ‌: డి (కేలు)

 

16. ప్రతిరోజు, ప్రతినిత్యం జరిగే క్రియలను ఏమంటారు?
జ‌: తద్ధర్మకాలం

 

17. జింక అనేది కిందివాటిలో ఏ వాచకానికి సంబంధించింది?
ఎ) మహతీ వాచకం            బి) మహద్వాచకం           సి) అహమద్వాచకం          డి) అన్నీ
జ‌: సి (అహమద్వాచకం)

 

18. గుణవంతుడు అనేది కింది ఏ వాచకానికి సంబంధించింది?
ఎ) మహతీ వాచకం        బి) మహద్వాచకం         సి) అహమద్వాచకం        డి) అన్నీ
జ‌: బి (మహద్వాచకం)

 

19. క్రియతో అన్వయం కలిగించే వాటిని ఏమంటారు?
జ‌: విభక్తి

 

20. కిందివాటిలో ఉత్తమ పురుషంను సూచించే క్రియావిభక్తి
ఎ) డు, రు             బి) వు, రు               సి) ను, ము            డి) అన్నీ
జ‌: సి (ను, ము)

 

21. కిందివాటిలో ఔప విభక్తి కాని పదం
ఎ) రాతిమీద            బి) నేతిగిన్నె            సి) చేతిమీద            డి) కోతికి
జ‌: డి (కోతికి)

 

22. 'ఎక్కడ + వాడు'లో చేరే ఔప విభక్తి
జ‌: ఇ

 

23. ఒక వాక్యం పూర్తి అయిందని తెలిపే విరామ చిహ్నం ఏది?
జ‌: వాక్యాంత బిందువు

 

24. వాక్యంలో ఇంకా చెప్పవలసి ఉంది అని తెలియజేసే దాన్ని ఏమంటారు?
జ‌: మూడుచుక్కలు

 

25. ఒక పదానికి ఉన్న మరొక పర్యాయ పదాన్ని తెలిపే విరామ చిహ్నం.
జ‌: కుండళీకరణం

 

26. ఒక విషయాన్ని విపులంగా వివరించేటప్పుడు ఉపయోగించే విరామ చిహ్నం ఏది?
జ‌: న్యూనబిందువు

 

27. రెండు అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు వచ్చినప్పుడు ఉపయోగించేది?
జ‌: వాక్యాంశ బిందువు

 

28. ధర్మార్థకామ మోక్షముల్లో; ధర్మము వలన; కామము వలన; పక్కన ఉపయోగించిన విరామ చిహ్నం ఏది?
జ‌: అర్ధబిందువు

 

29. కిందివాటిలో అనౌప విభక్తికి సంబంధించిన పదం.
ఎ) రోకలితో          బి) నాగలితో           సి) పిడికిలితో          డి) అన్నతో
జ‌: డి (అన్నతో)

 

30. పదానికి పదానికి మధ్య సంబంధాన్ని కలిపేవి
జ‌: కారకాలు

Posted Date : 08-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌