మాదిరి ప్రశ్నలు
1. ప్రతివ్యక్తి మాట్లాడేది మాండలికమే కాని భాష కాదు అని చెప్పినవారు ఎవరు?
జ: మాక్స్‌ముల్లర్
2. ఆంధ్రప్రదేశ్‌ను నాలుగు మండలాలుగా ఎవరు విభజించారు?
జ: భద్రిరాజు కృష్ణమూర్తి
3. కృష్ణా జిల్లా ఏ మాండలికంలో ఉంది?
జ: మధ్యమండలం
4. ప్రకాశం జిల్లా ఏ మాండలికంలో ఉంది?
జ: దక్షిణ మండలం
5. విజయనగరం జిల్లా ఏ మాండలికంలో ఉంది?
జ: పూర్వమండలం
6. వంద అనేది ఏ భాషా పదం?
జ: తెలుగు
7. మాంసాన్ని 'నీసు' అని ఏ మాండలికంలో అంటారు?
జ: పూర్వమండలం
8. మంచాన్ని 'అరక' అని ఏ మాండలికంలో అంటారు?
జ: పూర్వమండలం
9. వార్తా పత్రికలు, కథలు, నవలల్లో ఉపయోగించే మాండలికం ఏది?
జ: మధ్యమండలం
10. మున్నూరు, నన్నూరు, ఐన్నూరు అని ఏ మాండలికంలో ఉపయోగిస్తారు?
జ: దక్షిణ మండలం
11. బేడ, బీగం, హొన్ను లాంటి కన్నడ పదాలు ఏ మండలంలో కనిపిస్తాయి?
జ: దక్షిణ మండలం
12. సలాం, షా, కాఫిర్, గులామ్ లాంటి ఉర్దూ పదాలు ఏ మాండలికానివి?
జ: ఉత్తర మండలం
13. బేసి, బంద, రుగత, పరుడు లాంటి పదాలు ఏ భాషా ప్రభావం వల్ల ఏర్పడ్డాయి?
జ: ఒరియా
14. ఉర్దూ పదాలు ఏ మండలంలోని జిల్లాల్లో చేరుతాయి?
జ: ఉత్తర మండలం
15. కిందివాటిలో మాండలికం లేని భాష?
ఎ) ఒరియా బి) తమిళం సి) కన్నడ డి) మళయాళం
జ: బి (తమిళం)
16. 'పుణ్యం - పుణ్నెం' పదాల మార్పు కిందివాటిలో దేనికి సంబంధించింది?
ఎ) మూర్థన్యం మార్పు బి) ఊష్మాల మార్పు సి) సంయుక్తాక్షర ప్రయోగం డి) అంతస్థరాహిత్యం
జ: సి (సంయుక్తాక్షర ప్రయోగం)
17. 'తాళం - తాలం' అనే పదాల మార్పు కిందివాటిలో దేనికి సంబంధించింది?
ఎ) మూర్థన్యంతో మార్పు బి) దంత్యమార్పు సి) ఊష్మాల మార్పు డి) అంతస్థరాహిత్యం
జ: ఎ (మూర్థన్యంతో మార్పు)
18. 'యజ్ఞం - ఎగ్గెం' అనేవి కిందివాటిలో దేనికి సంబంధించినవి?
ఎ) అల్పప్రాణరాహిత్యం బి) అంతస్థరాహిత్యం సి) మూర్థన్యంతో మార్పు డి) దంత్యపు మార్పు
జ: బి (అంతస్థరాహిత్యం)
19. 'గాబు' అనేది ఏ మండల రూపం?
జ: పూర్వమండలం
20. 'చిలుకు' అనే పదం ఏ మాండలికంలోనిది?
జ: దక్షిణ మండలం
28. 'గోంగూర'ను ఉత్తర మండలంలో ఏమని పిలుస్తారు?
జ: పుంటికూర
29. 'సొమ్ములు' అనే పదాన్ని పూర్వమండలంలో ఏమని పిలుస్తారు?
జ: పశువులు
30. 'బిడారు' అన్న పదాన్ని వాడిన కవి.
జ: దూర్జటి