మాదిరి ప్రశ్నలు
1. వ్యుత్పత్తి స్పష్టంగా నిరూపించలేని పదానికి సామాన్యులు ఒక అర్థాన్ని ఊహిస్తే దాన్ని ఏమంటారు?
జ: లోకనిరూక్తి
2. ఒక పదం సూచించే వస్తురూపం, నిర్మాణంలో కాలక్రమేణ వచ్చే మార్పును ఏమంటారు?
జ: వస్తుపరిణామం
3. ఒక కాలంలో నిందార్థం లేదా సామర్థ్యార్థంలో వాడే పదాలు విశిష్టార్థ బోధకాలైనప్పుడు ఆ పదాలను ఏమంటారు?
జ: అర్థసామ్యత
4. విస్తృతార్థమున్న ఒక పదానికి పరిమితార్థం ఏర్పడినప్పుడు దాన్ని ఏమంటారు?
జ: అర్థసంకోచం
5. జన వ్యవహారంలో ఉన్న మౌలిక అర్థానికి నష్టం కలిగి పరిహాసార్థంలో లేదా నిందార్థంలో వాడితే అది
జ: అర్థగ్రామ్యత
6. కిందివాటిలో అర్థవ్యాకోచం కాని పదం
ఎ) చెంబు బి) ధర్మరాజు సి) రాక్షసుడు డి) ఆరాధ్యుడు
జ: డి (ఆరాధ్యుడు)
7. కిందివాటిలో అర్థసంకోచం కాని పదం
ఎ) మృగం బి) నెయ్యి సి) నూనె డి) తద్దినం
జ: సి (నూనె)
8. కిందివాటిలో అర్థసామ్యతకు సంబంధించిన పదం
ఎ) అవధాని బి) వ్యవసాయం సి) పత్రం డి) మర్యాద
జ: డి (మర్యాద)
9. కిందివాటిలో అర్థగ్రామ్యతకు సంబంధించని పదం
ఎ) కంపు బి) దేవదాసి సి) ఛాందసుడు డి) దొర
జ: ఎ (కంపు)
10. కిందివాటిలో సభ్యోక్తికి సంబంధించిన పదం
ఎ) చనిపోవు బి) సాని సి) విధవ డి) ఘటం
జ: ఎ (చనిపోవు)
11. కిందివాటిలో లోకనిరూక్తికి సంబంధించిన పదం
ఎ) చందమామ బి) శనిగ్రహం సి) అసహ్యం డి) అంతస్తు
జ: ఎ (చందమామ)
12. 'దీపం కొండెక్కింది' అనేది కిందివాటిలో దేనికి సంబంధించింది?
ఎ) వస్తుపరిమాణం బి) లోకనిరూక్తి సి) సభ్యోక్తి డి) మృదూక్తి
జ: డి (మృదూక్తి)
13. 'సన్యాసి' అనే పదం
జ: అర్థగ్రామ్యత
14. 'ఉద్యోగం' అనేది
జ: అర్థసంకోచం
15. 'అదృష్టం' అనేది
జ: అర్థసామ్యత
16. 'వ్యంగం' అనేది
జ: అర్థగ్రామ్యత
17. 'గురుశంక' అనేది
జ: సభ్యోక్తి
18. 'మొక్కజొన్న' అనేది
జ: లోకనిరూక్తి
19. 'చేదు నిజం' అనేది
జ: అలంకారిక ప్రయోగం
20. 'విల్లు, గద' అనే పదాలు కిందివాటిలో దేనికి సంబంధించినవి?
ఎ) లోకనిరూక్తి బి) మృదూక్తి సి) వస్తుపరిణామం డి) అర్థగ్రామ్యత
జ: సి (వస్తుపరిణామం)
21. 'గ్రహచారం' అనే పదం
జ: అర్థగ్రామ్యత
22. 'మధుర వాడ' అనేది
జ: లోకనిరూక్తి
23. 'చాడీ' అనే పదం
జ: అర్థసంకోచం
24. 'వారం' అనే పదం
జ: అర్థవ్యాకోచం