1. పలుమార్లు ఒకే మాదిరి సమస్యలను సంఖ్యా మార్పులతో చేయడం ఏ సాంకేతిక విధానాన్ని సూచిస్తుంది?
జ: ఆవర్తనం
2. ఊర్ధ్వ, అధః కోణాలను తెలుసుకుని కొండలు, భవనాల ఎత్తులను గణించే విధానాన్ని బోధించడానికి ఉపయోగపడేది
జ: రేఖాగణితంలో మౌఖికపని
3. పనిలో పరిపూర్ణత ఇచ్చేది
1) మౌఖికపని 2) నియోజనం 3) ఆవర్తనం 4) రాతపని
జ: 4(రాతపని)
4. కన్నులను, చెవులను అనుసంధానం చేస్తూ విద్యార్థుల ఏకాగ్రతను పెంపొందించే సాంకేతిక విధానం
జ: మౌఖికపని
5. వ్యక్తి జ్ఞాపకశక్తి ఎక్కువగా ఆధారపడి ఉండే సాంకేతిక విధానం
1) మౌఖికపని 2) రాతపని 3) నియోజనం 4) ఆవర్తనం
జ: 1(మౌఖికపని)
6. మౌఖికపని వల్ల అభివృద్ధి చెందేది
1) ఆలోచించడం 2) మానసిక సంసిద్ధత 3) చురుకుదనం 4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)
7. ఆవర్తనానికి సమయం
జ: 20 నిమిషాలకు మించకూడదు
8. విద్యార్థిలో స్వయం అధ్యయనశక్తిని పెంపొందించే గణిత బోధనా సాంకేతిక విధానం
జ: నియోజనం
9. ఆవర్తన విధానం వల్ల ఉపయోగం
1) నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది
2) సమస్య పట్ల వెచ్చించే కాలాన్ని పొదుపు చేస్తూ ఉన్నతికి తోడ్పడుతుంది
3) వివిధ సన్నివేశాల్లో ఎలా నడచుకోవాలో తెలుపుతుంది
4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)
10. ఆవర్తనం ద్వారా మాత్రమే గణిత భావనలను, పాఠ్యాంశాలను విద్యార్థులు అర్థం చేసుకుని దానిలో గల అంతర, బాహ్య సంబంధాలను అవగాహన చేసుకుంటారని చెప్పినవారు
1) లాంగ్ 2) గెస్టాల్ట్ 3) శామ్యూల్ 4) లెస్టర్ బి. శాండ్స్
జ: 2(గెస్టాల్ట్)
11. బోధనలో ఏ సాంకేతిక విధానం ద్వారా ఉచ్ఛారణ దోషాలను సరిచేయవచ్చు?
జ: మౌఖికపని
12. గణితశాస్త్రంలో భావనలు, సూత్రాలు, నియమాల స్థిరీకరణకు తోడ్పడేది?
జ: ఆవర్తనం
13. బోధనాంశాలను విద్యార్థి అవగాహన చేసుకున్నాడో లేదో తెలుసుకోవడానికి ఇచ్చేది
జ: నియోజనం
14. నియోజనం ద్వారా ఇవ్వదగింది
1) గణిత సమస్యలను సాధించడం
2) పజిల్స్
3) ఒక శీర్షికకు సంబంధించిన చారిత్రక విషయాలను అధ్యయనం చేయడం
4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)
15. కిందివాటిలో గణితశాస్త్ర అభ్యసనకు సరిపోయేది
1) మౌఖికపని 2) రాతపని 3) ఆవర్తనం 4) నియోజనం
జ: 3(ఆవర్తనం)
16. నియోజనం లక్షణం కానిది
1) విద్యార్థి సమస్యా సాధనా నైపుణ్యం పెంపొందుతుంది.
2) విద్యార్థి పూర్వజ్ఞాన, అనుభవాలతో సంబంధం ఉండాలి.
3) పూర్తిచేయడానికి కాల నిర్ణయం ఉండాలి.
4) లిఖిత పూర్వకమైనవి కావచ్చు లేదా ప్రయోగాత్మకం కావచ్చు
జ: 1(విద్యార్థి సమస్యా సాధనా నైపుణ్యం పెంపొందుతుంది.)
17. గణితశాస్త్రానికి రెండు కళ్లు లాంటివి
జ: వేగం, కచ్చితత్వం
18. వేగం పెంపొందించే మార్గం
1) కచ్చితత్వాన్ని పెంపొందించడం
2) అలవాటు చేయడం
3) సులభ మార్గాలను అనుసరించడం
4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)
19. వేగం పెంపొందించే మార్గం కానిది
1) ఉపకరణాల ఉపయోగాన్ని తగ్గించడం 2) కచ్చితత్వాన్ని పెంపొందించడం
3) సమస్యను సరిగ్గా విశ్లేషించడం 4) సులభ మార్గాలను, పద్ధతులను అనుసరించడం
జ: 3(సమస్యను సరిగ్గా విశ్లేషించడం)
20. నియోజనాలను విద్యార్థుల స్థాయికి తగిన విధంగా తయారుచేయడానికి ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి?
జ: నిత్య అభ్యాసకుడిగా
21. సిలబస్లో గల ఖాళీలను పూరించేవి
జ: నియోజనం
22. నియోజనం ఆవశ్యకత
1) బోధనాంశాలను విద్యార్థి అవగాహన చేసుకున్నాడో లేదో తెలుసుకోవడానికి
2) పాఠ్యాంశానికి సంబంధించి అధిక సమాచార సేకరణకు
3) గణిత వాజ్ఞ్మయాలను సంప్రదించే అలవాటును పెంపొందించడానికి
4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)
23. రాతపనిలో తీసుకోవాల్సిన జాగ్రత్త
1) సమయ నిర్దేశం ఉండాలి
2) అందరికీ అర్థమయ్యేలా ఉండాలి
3) శుభ్రతకు గల ప్రాధాన్యాన్ని విద్యార్థి గ్రహించేలా చేయాలి
4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)