1. కిందివాటిలో వార్షిక పథకంలోని అంశం?
1) ఏ నెలలో పూర్తి చేయాలి 2) యూనిట్లు
3) కేటాయించిన పీరియడ్ల సంఖ్య 4) అన్నీ
జ: 4 (అన్నీ)
2. సాధారణంగా ఉపాధ్యాయుడు తరగతి గదిలో అవలంభించే విధానం?
జ: సమగ్ర పాఠ్యప్రణాళిక
3. వార్షిక పథకాన్ని తయారు చేసేటప్పుడు ఉపాధ్యాయుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశం?
1) ఒక్కో యూనిట్‌ను బోధించడానికి పట్టే పీరియడ్ల సంఖ్య 2) ఉపాధ్యాయుడి సెలవులు
3) ఒక్కో నెలలో లభ్యమయ్యే పీరియడ్ల సంఖ్య 4) అన్నీ
జ: 4 (అన్నీ)
4. పాఠ్యప్రణాళిక పునర్విమర్శ అనే సోపానం కింది ఏ కృత్యాలకు చెందుతుంది?
జ: సమ్మిళిత కృత్యాలు
5. 'ఒక సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపరనే యూనిట్' అన్నవారు?
జ: హెర్బార్ట్
6. ఉపాధ్యాయులు సంవత్సరకాలంలో పూర్తిచేయాల్సిన అంశాలను దృష్టిలో ఉంచుకొని తమకు కేటాయించిన పీరియడ్ల ఆధారంగా తయారుచేసే పథకం?
జ: యూనిట్ పథకం
7. హెర్బార్ట్ పాఠ్యపథక రచనలో సూచించిన సోపానాల సంఖ్య?
జ: 6
8. కిందివాటిలో దీర్ఘకాలిక ప్రణాళిక?
1) పాఠ్య పథకం 2) యూనిట్ పథకం 3) వార్షిక పథకం 4) బోధన ప్రణాళిక
జ: 3 (వార్షిక పథకం)
9. విద్యార్థుల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా శ్రద్ధతో ఎన్నుకున్న విషయ బాహ్య స్వరూపమే యూనిట్ అన్నవారు?
జ: సాంపోర్టు
10. టైమ్ షెడ్యూల్ చార్ట్‌లో పేర్కొన్న అంశం?
జ: సబ్ యూనిట్, సబ్ యూనిట్‌కు కేటాయించిన పీరియడ్ల సంఖ్య
11. కిందివాటిలో పాఠ్యపథకంలోని సోపానానికి చెందనిది?
1) విషయ విశ్లేషణ 2) నల్లబల్ల పని
3) సబ్ యూనిట్లు 4) విద్యార్థి ఉపాధ్యాయుడి కృత్యాలు
జ: 3 (సబ్ యూనిట్లు)
12. కిందివాటిలో యూనిట్‌లోని అంగం?
1) ప్రేరణ 2) సంకీర్ణ దృష్టి 3) నేపథ్యాన్ని కనుక్కోవడం 4) అన్నీ
జ: 4 (అన్నీ)
13. సమీప భవిష్యత్తులో చేసే చర్య కోసమే రూపొందించిన పథకం లేదా మార్గదర్శిని ఏమంటారు?
జ: పాఠ్య పథకం
14. కిందివాటిలో పాఠ్య పథకంలోని సోపానం?
1) నల్లబల్ల పని 2) మూల్యాంకనం 3) బోధన అభ్యసన సామగ్రి 4) అన్నీ
జ: 4 (అన్నీ)
15. పాఠ్యపథక రచనకు ఎవరి సూచనలతో గుర్తింపు వచ్చింది?
జ: జె.ఎఫ్. హెర్బార్ట్
16. కిందివాటిలో పాఠ్యపథకంలోని సోపానం?
1) లక్ష్యాలు - స్పష్టీకరణలు 2) విషయ విశ్లేషణ
3) ఉపాధ్యాయ కృత్యం - విద్యార్థి కృత్యం 4) అన్నీ
జ: 2 (విషయ విశ్లేషణ)
17. పాఠ్య ప్రణాళికలోని పునర్విమర్శ అనే సోపానం ఏ రకమైన మూల్యాంకనం?
జ: సంకలన మూల్యాంకనం
18. కిందివాటిలో హెర్బార్ట్ పాఠ్యపథక దశలో లేనిది?
1) సన్నాహం 2) మూల్యాంకనం 3) సమర్పణ 4) సంసర్గం
జ: 2 (మూల్యాంకనం)
19. వార్షిక పథక రచన అంతా దేనిపై ఆధారపడి ఉంటుంది?
జ: యూనిట్
20. హెర్బార్ట్ పాఠ్యపథక దశలు?
జ: ఆరు
21. కిందివాటిలో విషయంలోని ఒక పెద్ద భాగం అని దేన్ని అంటారు?
1) యూనిట్ 2) సబ్ యూనిట్ 3) విద్యాప్రణాళిక 4) పాఠ్యపథకం
జ: 1 (యూనిట్)
22. బోధనా విధానానికి అతి ముఖ్యమైంది?
జ: పాఠ్య పథకం
23. ఒక ఉపాధ్యాయుడు దేన్ని రూపొందించకుండా పాఠాన్ని బోధిస్తే అతడు ఎంత సమర్థుడైనప్పటికీ ఆశించిన లక్ష్యాలను సాధించలేడు?
జ: పాఠ్య పథకం
24. ప్రతి పాఠానికి తగిన పథకాన్ని తయారు చేసుకోవడం దేనిలో ప్రథమ సోపానం?
జ: విద్యా లక్ష్య సాధన
25. వార్షిక పాఠ్య పథకం తయారు చేయడంలో మొదటి సోపానం?
జ: విషయాన్ని యూనిట్లుగా విభజించడం
26. 'అభ్యాసకుడు విహంగవీక్షణం చేయగల సంబంధిత పెద్ద విషయ భాగమే యూనిట్' అని నిర్వచించినవారు?
జ: ప్రెస్టెన్
27. లక్ష్యాలు, స్పష్టీకరణ, బోధనా వ్యూహాలు, పుస్తక సామగ్రి, మూల్యాంకన విధానం అన్నీ సమర్థంగా రూపొందించడానికి అవసరమైంది?
జ: యూనిట్ ప్రణాళిక
28. జె.ఎఫ్. హెర్బార్ట్ ప్రకారం పాఠ్యపథక రచనలో మొదటి సోపానం?
జ: సన్నాహం
29. వార్షిక ప్రణాళికను తయారు చేసేటప్పుడు వార్షిక పని దినాల సంఖ్య
జ: 220
30. 'పాఠ్యాంశం ఒక యూనిట్' అనే భావనపై ఆధారపడిన పద్ధతి?
జ: శీర్షికా పద్ధతి
31. పాఠ్య పథకంలో చివరి సోపానం?
జ: పునర్విమర్శ
32. కిందివాటిలో గణిత పాఠ్య పథకంలో చేరని అంశం?
1) బోధనా విషయాలు 2) విషయాన్ని విశ్లేషణ చేసే యూనిట్లుగా విభజించడం
3) విద్యార్థి చేయాల్సిన వ్యాసక్తులు 4) ఉపాధ్యాయుడు చేయాల్సిన వ్యాసక్తులు
జ: 2 (విషయాన్ని విశ్లేషణ చేసే యూనిట్లుగా విభజించడం)
33. హెర్బార్ట్ సోపానాల్లో మొదటిది?
జ: సంసర్గం
34. ఉపాధ్యాయుడు ఏ దశలో పాఠ్యాంశంలోని భావాలను ఒక తార్కిక క్రమంలో అమర్చి విద్యార్థులకు అందించడానికి ప్రయత్నిస్తాడు?
జ: సమర్పణ
35. పాఠ్య పథకాన్ని రూపొందించాల్సింది?
జ: ఉపాధ్యాయుడు
36. సన్నాహ దశను సమర్థంగా నిర్వహించడానికి ఉపాధ్యాయుడు కింది ఏ విధానాన్ని అవలంభించాలి?
1) ప్రశ్నించడం 2) విద్యార్థుల్లో ఆసక్తి కలిగేలా చేయడం
3) కథలు చెప్పడం 4) అన్నీ
జ: 4 (అన్నీ)
37. పాఠ్య పథకంలో ఉన్ముఖీకరణం అనే సోపానం కింది ఏ కృత్యానికి చెందుతుంది?
1) ప్రదర్శన 2) అభివృద్ధి 3) సమ్మిళిత 4) ప్రారంభ
జ: 4 (ప్రారంభ)
38. పాఠ్య బోధన సోపానాలను రూపొందించడం దేనిలో భాగం?
జ: సమర్పణ
39. పాఠ్యపథకంలో సామాన్యీకరణం అనే సోపానం కింది ఏ కృత్యానికి చెందుతుంది?
1) ప్రదర్శన 2) అభివృద్ధి 3) ప్రారంభ 4) సమ్మిళిత
జ: 1 (ప్రదర్శన)
40. పాఠశాలలో సాధారణంగా ఉపాధ్యాయుడు తాను తరగతి గదిలో అవలంభించాల్సిన విధానాన్ని ఏదో ఒకరీతిలో ముందుగా తయారు చేసుకోవడాన్ని ఏమంటారు?
జ: టీచింగ్ నోట్స్
41. హెర్బార్ట్ పాఠ్యపథక రచనలో మూడో సోపానం?
జ: పునర్విమర్శ
42. కిందివాటిలో యూనిట్‌లోని భాగం కానిది?
1) పూర్వజ్ఞాన పరిశీలన 2) ప్రేరణ 3) నేపథ్యాన్ని కనుక్కోవడం 4) సంకీర్ణ దృష్టి
జ: 1 (పూర్వజ్ఞాన పరిశీలన)
43. యూనిట్ పథకాన్ని తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన ముఖ్యాంశాల్లో లేనిది?
1) సబ్యూనిట్లు 2) యూనిట్‌కు కేటాయించిన పీరియడ్ల సంఖ్య
3) విద్యార్థుల పూర్వజ్ఞానం 4) సెలవులు
జ: 3 (విద్యార్థుల పూర్వజ్ఞానం)
44. కిందివాటిలో స్వల్పకాలిక ప్రణాళిక?
1) వార్షిక పథకం 2) సంస్థాగత పథకం 3) అర్ధ వార్షిక పథకం 4) యూనిట్ పథకం
జ: 4 (యూనిట్ పథకం)
45. యూనిట్ పథకం తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన ముఖ్యాంశాలు?
1) మాల్యాంకన విధానాలు 2) యూనిట్ల లక్ష్యాలు, స్పష్టీకరణలు
3) యూనిట్‌లోని విషయం 4) అన్నీ
జ: 4 (అన్నీ)
46. ఒక సంవత్సర కాలంలో బోధించాల్సిన విషయాన్ని సూచించే పథకం?
జ: వార్షిక పథకం
47. 'ఉపాధ్యాయుడు పాఠ్యాంశంలోని భావాలను ఒక తార్కిక క్రమంలో అమర్చి విద్యార్థులకు అందించడానికి ప్రయత్నిస్తాడు'. అనేది హెర్బార్ట్ పాఠ్యపథక రచనలో ఏ సోపానం?
జ: సమర్పణ
48. ప్రతి యూనిట్‌ను అర్థవంతమైన ఉప యూనిట్‌గా విభజించిన తర్వాత ఒక్కో ఉప యూనిట్‌ను పూర్తిచేయడానికి పట్టే పీరియడ్ల సంఖ్యను నిర్ణయించడానికి తయారుచేసే పట్టిక?
జ: కాల నిర్ణయ పట్టిక
49. 'ఉపాధ్యాయుడు తాను బోధించే పాఠానికి సంబంధించిన పూర్వజ్ఞానాన్ని విద్యార్థుల నుంచి ప్రశ్నల ద్వారా రాబడతాడు' ఇది హెర్బార్ట్ పాఠ్యపథకం రచనలో ఏ సోపానానికి చెందింది?
జ: సన్నాహం
గత టెట్, డీఎస్సీలో అడిగిన ప్రశ్నలు
50. వార్షిక పథకం తయారుచేయడంలో ప్రధాన సోపానంలో చేరనివి?
జ: యూనిట్‌ను బోధించడానికి విద్యార్థి పూర్వజ్ఞానం.
51. పాఠ్యప్రణాళికలో 'పునర్విమర్శ' అనే సోపానం కింది ఏ కృత్యాలకు చేరుతుంది?
జ: సమ్మిళిత కృత్యాలు
52. గణిత పాఠ్యపథకంలో చేరని అంశం?
జ: విషయాన్ని విశ్లేషణ చేసే యూనిట్లుగా విభజించడం
53. బోధన - పునఃబోధన వలయం అనే బోధన పద్ధతి?
జ: మైక్రో టీచింగ్
54. చతుర్భుజాల గురించి బోధించడానికి వివిధ వస్తువుల ఆకారాలు, కొలతలపై విద్యార్థికి ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించుకునే పాఠ్యపథకంలోని సోపానం?
జ: సాధారణీకరణం
55. బోధనోపకరణాల్లో చార్టుల ఉపయోగం?
జ: సూత్రాలు, నిర్వచనాలు నమోదు చేసి, పునశ్చరణ చేయడానికి వీలవుతుంది.
56. సెకండరీ పాఠశాలలో గణిత బోధనకు ఉపన్యాస పద్ధతి ఉపయోగించిన పాఠ్యాంశం?
జ: గణిత శాస్త్ర మూలాధారాలు
57. విషయ బోధన కోసం పాఠ్యపథక నిర్మాణం చేసిన విద్యావేత్త?
జ: హెర్బార్ట్
58. పూర్తిగా నియోజనాలపై ఆధారపడిన గణిత విద్యా ప్రణాళిక పథకం?
జ: డాల్టన్ పథకం
59. పాఠ్యపథక రచన ఆవశ్యకత కింది ఏ విద్యావేత్త సూచనల వల్ల గుర్తింపు పొందింది?
జ: హెర్బార్ట్