• facebook
  • whatsapp
  • telegram

దత్తాంశ నిర్వహణ, ఘాతాంకాలు

      ఒక విషయానికి సంబంధించిన వివరాలను దత్తాంశం అంటారు. అంటే సంఖ్యారూపంలో సేకరించిన సమాచారం. సంఖ్యారూపంలో దత్తాంశాన్ని సేకరించడం, సేకరించిన దత్తాంశాన్ని వర్గీకరించడం, వ్యాఖ్యానించడం, విశ్లేషించడం, సేకరించిన వివరాల ద్వారా నూతన విషయాలు  తెలుసుకోవడమే సాంఖ్యక శాస్త్రం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనం.
దత్తాంశాలు ముడి దత్తాంశం, వర్గీకృత దత్తాంశం అని రెండు రకాలు.
ముడి దత్తాంశం:
సేకరించిన సమాచారాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఉంచితే దాన్ని ముడి దత్తాంశం లేదా అవర్గీకృత దత్తాంశం అంటారు.
ఉదా: విద్యార్థులు పొందిన మార్కులు 10, 15, 20, 18, 4, 3, 21, 24
వర్గీకృత దత్తాంశం: ముడి దత్తాంశాన్ని అవసరాలకు అనుగుణంగా విభజించి రాస్తే దాన్ని వర్గీకృత దత్తాంశం అంటారు.
ఉదా:


 

వ్యాప్తి: దత్తాంశంలోని గరిష్ఠ, కనిష్ఠ విలువల తేడాను వ్యాప్తి అంటారు.
ఉదా: 4, 5, 9, 12, 2, 36, 4, 6
         వ్యాప్తి = 36 - 2 = 34

తరగతి:
దత్తాంశంలోని రాసులను ఒక్కసారిగా ప్రదర్శించడానికి సమగ్రంగా, సులభంగా అర్థం కావడానికి అనువుగా చిన్నచిన్న సమూహాలుగా రాయడాన్ని తరగతి అంటారు.
ఉదా: 1-10,  11-20,  21-30, ...
     1-10లో ఎగువ అవధి = 10
         దిగువ అవధి = 1

 

తరగతి అంతరం లేదా తరగతి పొడవు:
తరగతుల్లో రెండు వరుస ఎగువ అవధుల లేదా దిగువ అవధుల తేడానే తరగతి అంతరం అంటారు.
ఉదా: 1-10, 11-20, 21-30


 అవధుల తేడా 11 - 1 = 10 , 20 - 10 = 10
పై తరగతుల తరగతి అంతరం = 10
* సాంఖ్యక శాస్త్ర పితామహుడు: సర్ రోనాల్డ్ ఎ.ఫిషర్
»* Father of Statistics in India: పి.సి.మహలనోబిస్
* దత్తాంశాన్ని ప్రదర్శించడానికి ఉపయోగించే చిత్రాలు
i) పటచిత్రాలు              ii) కమ్మీ చిత్రాలు (లేదా) దిమ్మె చిత్రాలు            iii) వృత్త రేఖాచిత్రాలు
పటచిత్రాలు: సంఖ్యల్లో ఇచ్చిన విషయాలను బొమ్మల ద్వారా చూపించే చిత్రాలను పటచిత్రాలు అంటారు.
* సమాన సంఖ్య విలువలను సూచించడానికి ఒకే రకమైన బొమ్మలు ఉపయోగించే చిత్రం.

 

నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
i) గీసే ప్రతి బొమ్మ సమాన పరిమాణంలో ఉండాలి.
ii) ఒక్కో బొమ్మ ఎన్ని విలువలను సూచిస్తుందో తెలియజేయాలి (దీన్ని స్కేలు అంటారు).
iii) సగాన్ని సూచించే బొమ్మ వివరాలు తెలపాలి.

 

కమ్మీ చిత్రాలు:
దత్తాంశ విలువలను దీర్ఘ చతురస్రాలతో సూచిస్తే ఆ చిత్రాన్ని కమ్మీ రేఖాచిత్రం లేదా బార్ గ్రాఫ్ లేదా దిమ్మె చిత్రం అంటారు.

 

గీయడంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు
i) దత్తాంశంలో, ఒక్కో అంశం విలువను ఒక్కో కమ్మీ తెలుపుతుంది.
ii) కమ్మీల వెడల్పులు ఏ అంశాన్నీ సూచించవు. కానీ అన్ని కమ్మీల వెడల్పులు సమానంగా ఉంటాయి.
iii) కమ్మీల మధ్య ఖాళీలు కూడా సమానంగా ఉండాలి.
iv) కమ్మీలన్నీ ఒకే ఆధార రేఖ మీద నిలబడి ఉండేలా గీయాలి.
* కమ్మీల పొడవులు దత్తాంశంలోని అంశాల విలువను సూచిస్తాయి.

 

వృత్త రేఖాచిత్రం:
దత్తాంశాన్ని సూచించడానికి వీలుగా ఒక వృత్తాన్ని కొన్ని సెక్టారులుగా విభజిస్తే ఏర్పడే చిత్రాన్ని వృత్తరేఖా చిత్రం అంటారు.
* ఒక సంస్థ లేదా వ్యక్తి వివిధ పద్దుల కింద చేసే ఖర్చును సూచించడానికి, దత్తాంశంలోని వివిధ భాగాల విలువలను పోల్చడానికి వృత్త రేఖాచిత్రం ఉపయోగపడుతుంది.
* దత్తాంశంలో వివిధ అంశాల విలువల మొత్తాన్ని వృత్తం సూచిస్తుంది.
* వివిధ అంశాల విలువల నిష్పత్తిని కనుక్కుని, వృత్తకేంద్రం వద్ద 360º కోణాన్ని ఆ నిష్పత్తిలో విభజించి, వృత్తాన్ని ఈ కోణాలున్న సెక్టారులుగా విభజిస్తారు.
* దీన్ని కోణీయ రేఖాచిత్రం లేదా చక్రీయ రేఖాచిత్రం అని కూడా అంటారు.
* దత్తాంశంలోని అంశాల మొత్తం విలువను 360o సూచిస్తుంది.
* వృత్తాకార చిత్రంలో వివిధ విలువలను సూచించేవి సెక్టార్లు.
* అంశం విలువ సూచించే కోణం 

 

ఘాతాంకాలు
* an. ఇక్కడ aను భూమి అని, nను ఘాతాంకం అని అంటారు. an ను aకి nవ ఘాతం అంటారు.
* ఇక్కడ a శూన్యేతర అకరణీయ సంఖ్య. m,nలు పూర్ణ సంఖ్యలను సూచిస్తాయి.

 

సూత్రాలు

Posted Date : 09-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌