• facebook
  • whatsapp
  • telegram

దత్తాంశ అనువర్తనాలు

1. సాంఖ్యక శాస్త్ర పితామహుడు ......
జ: సర్ రొనాల్డ్ ఎ. ఫిషర్
 

2. స్వయంగా విచారణ చేసి సేకరించిన సమాచారాన్ని ..... అంటారు.
జ: దత్తాంశం
 

3. దత్తాంశాన్ని ఏ విధంగా ప్రదర్శిస్తారు?
     ఎ) పట చిత్రాలు      బి) దిమ్మె చిత్రాలు      సి) వృత్త రేఖాచిత్రాలు      డి) అన్నీ
జ: డి (అన్నీ)


4. 1 సెం.మీ. = 8 యూనిట్లు అయితే 24 యూనిట్లు = .... సెం.మీ.
జ: 3
 

5. ఆంగ్లం = 50, సాంఘిక శాస్త్రం = 30, తెలుగు = 60, గణితం = 40 అయితే గణితం వృత్త రేఖాచిత్రంలో సూచించే కోణం
జ: 80º

6. సేకరించిన దత్తాంశాన్ని బొమ్మల రూపంలో చూపినట్లయితే వాటిని ..... చిత్రాలు అంటారు.
జ: పట
 

7. కమ్మీ పొడవు లేదా కమ్మీ ఎత్తు దత్తాంశంలోని అంశానికి .....గా ఉంటుంది.
జ: అనుపాతంలో
 

8. కమ్మీ చిత్రాల్లో 1 సెం.మీ. = 10,000 కి.మీ. అయితే 3.8 సెం.మీ. = ..... కి.మీ.
జ: 38,000
 

9. ఒక వృత్త రేఖాచిత్రంలో ఒక త్రిజ్యాంతర కోణం 135º వృత్తరేఖా చిత్రంలో ఎంత భాగం ఉంటుంది?
జ: 


 

10. ఒక వృత్తరేఖా చిత్రంలో 3 త్రిజ్యాంతరాలున్నాయి. అందులో రెండు కోణాలు 80º, 140º అయితే మూడో కోణం ......
జ: 140º
 

11. సగటు = [x . మధ్యగతం - బాహుళకం] y అయితే x + y =
జ: 
 

12. ఒక దత్తాంశంలోని 9 రాశుల సగటు 45 అని లెక్కించారు. అలా చేయడంలో ఒక రాశి 24ను 42గా పొరపాటుగా లెక్కిస్తే 9 రాశుల అసలు సగటు ఎంత?
జ: 43

13. మూలం నుంచి సమాచారాన్ని సేకరించడాన్ని ..... దత్తాంశం అంటారు.
జ: ప్రాథమిక
 

14. తరగతి అంతరం =
జ:  
 

15. ఒక దత్తాంశ వ్యాప్తి 70.9, కనిష్ఠ విలువ 27.6 అయితే గరిష్ఠ విలువ?
జ: 98.5
 

16. 10 - 19, 20 - 29, 30 - 39 తరగతుల్లో 20 - 29 తరగతి మధ్య విలువ
జ: 24.5
 

17. 9 - 15, 16 - 22, 23 - 29, 30 - 36 తరగతుల్లో 23 - 29 తరగతి యదార్థ దిగువ హద్దు
జ: 22.5
 

18. తరగతి మధ్య విలువలు 12.5, 17.5, 22.5, 27.5 అయితే 22.5 మధ్య విలువ యొక్క తరగతి అంతరం
జ: 20 - 25
 

19. తరగతి అంతరాలు అసమానంగా ఉన్నప్పుడు దేని ఆధారంగా సోపాన చిత్రం నిర్మిస్తారు?
జ: పౌనఃపున్య సాంద్రత

20. పౌనఃపున్య బహుభుజిలో X - అక్షంపై తీసుకునేది
జ: తరగతి మధ్య విలువలు
 

21. ఓజివ్ వక్రం ద్వారా కనుక్కునే కేంద్రీయ స్థాన కొలత
జ: మధ్యగతం
 

22. సోపాన చిత్రం, పౌనఃపున్య బహుభుజి, పౌనఃపున్య వక్రం ద్వారా కనుక్కునే కేంద్రీయ స్థాన కొలత
జ: బాహుళకం
 

23. సాంఖ్యక శాస్త్ర ముఖ్య ఉద్దేశం
      ఎ) దత్తాంశాన్ని సేకరించడం                              బి) దత్తాంశాన్ని వర్గీకరించడం
      సి) నూతన విషయాలను తెలుసుకోవడం           డి) అన్నీ
జ: డి (అన్నీ)
 

24. సాంఖ్యక శాస్త్రం అనే పదం ఇటాలియన్‌లో ఏ పదం నుంచి వచ్చింది?
జ: స్టాటిస్టా
 

25. దత్తాంశం నుంచి దత్తాంశాన్ని సేకరించే విధానాన్ని ..... దత్తాంశం అంటారు.
జ: గౌణ

Posted Date : 22-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌