• facebook
  • whatsapp
  • telegram

విజ్ఞానశాస్త్ర స్వభావం

1. విజ్ఞానశాస్త్ర నిర్మాణాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చిన విద్యావేత్తలు ఎవరు?
జ: పాయింకేర్, శర్మ

 

2. 'సిద్ధాంతమనేది సత్యాల మధ్య సంబంధాన్ని లేదా సత్యాలను అర్థవంతమైన రీతిలో వివరించే ఒక మార్గం' అని పేర్కొన్నది?
జ: గుడ్, హల్

 

3. విజ్ఞానశాస్త్ర లక్షణం కానిది?
1) విజ్ఞానశాస్త్రం సంచిత జ్ఞానం            2) విజ్ఞానశాస్త్రం ఒక ప్రక్రియ
3) విజ్ఞానశాస్త్ర జ్ఞానం సాపేక్ష సత్యం    4) విజ్ఞానశాస్త్రం శాస్త్రీయ పద్ధతిని అనుసరించదు
జ: విజ్ఞానశాస్త్రం శాస్త్రీయ పద్ధతిని అనుసరించదు

 

4. విజ్ఞానశాస్త్రాన్ని సంశ్లేషణాత్మక, ద్రవ్యాత్మక నిర్మాణాలుగా పేర్కొన్నది -
జ: ష్యాబ్, ఫీనిక్స్

 

5. 'విజ్ఞానశాస్త్రం అంటే పరస్పర సంబంధం ఉన్న భావనలు, భావన పథకాలు' అని పేర్కొన్నది?
జ: జె.బి. కొనాంట్

 

6. ఒక తెగ లేదా సమూహ జీవుల పుట్టుక, పరిణామం గురించి తెలియజేస్తూ, జాతుల మధ్య సంబంధాలు వివరించే శాస్త్రం?
జ: ఫైలోజని

 

7. ఉత్తమ విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుడిగా విద్యార్థుల్లో పెంపొందించే మొదటి ప్రక్రియ నైపుణ్యం-
జ: పరిశీలన

 

8. స్తబ్ధ దృష్టిలో విజ్ఞానశాస్త్రం అంటే...?
1) సూత్రాలు       2) సిద్ధాంతాలు         3) భావనలు         4) పైవన్నీ
జ: పైవన్నీ

 

9. 'నీటి లోతుకు, పీడనానికి సంబంధం ఉందని' తెలిపేది?
జ: ప్రకటనాత్మక పరికల్పన

 

10. ప్రయోగాత్మకంగా గానీ, సిద్ధాంతరీత్యా గానీ పరికల్పన వివరాలను సూత్రీకరించడంలో సహయపడేది?
జ: శాస్త్రీయ విధానం

 

11. విజ్ఞానశాస్త్ర గతిశీల దృష్టికి సంబంధించింది-
జ: పరిశీలన

 

12. విజ్ఞానశాస్త్ర మూలభావన కానిది?
1) శాస్త్రం సంభావ్యతను మాత్రమే తెలుపుతుంది           2) శాస్త్రం సాపేక్ష సత్యాన్ని మాత్రమే తెలుపుతుంది
3) శాస్త్రం పరిశీలించిన దృగ్విషయాలపై ఆధారపడదు  4) శాస్త్రం సంకుచితం
జ: శాస్త్రం సంకుచితం

 

13. ప్రాక్కల్పన లక్షణం కానిది?
1) తార్కికంగా, వాస్తవంగా ఉండాలి                   2) పునఃపరిశీలనకు వీలుగా ఉండాలి
3) దత్తాంశ సేకరణకు వీలుగా ఉండకూడదు    4) పరిశీలించిన విషయాల ఆధారంగా ఆమోదయోగ్యంగా ఉండాలి
జ: దత్తాంశ సేకరణకు వీలుగా ఉండకూడదు

 

14. 'సిద్ధాంతం సంఘటనల మధ్య సంబంధాన్ని స్పష్టపరుస్తుంది. అంతేకాక ఆ సంఘటనల కారణాన్ని వివరిస్తూ, భవిష్యత్తులోని సంభావ్యతలను ప్రాగుక్తీకరిస్తుంది' అని పేర్కొన్నది-
జ: మాథ్స్‌సన్

 

15. 'జ్ఞానం అంతా భావనల ద్వారానే ఏర్పడుతుంది' అని పేర్కొన్నది -
జ: సోక్రటీస్

 

16. సంశ్లేషణాత్మక నిర్మాణంలోని అంశం కానిది?
1) సాధారణీకరణం       2) ప్రయోగం           3) ప్రాగుక్తీకరణ         4) మాపనం
జ: సాధారణీకరణం

 

17. 'విజ్ఞానశాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వం ముడి పదార్థమే' అని పేర్కొన్నది?
జ: కార్ల్ పియర్సన్

 

18. 'విజ్ఞానశాస్త్రం అనేది సంచిత, అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహం' అని పేర్కొన్నది-
జ: సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్టు

 

19. విజ్ఞానశాస్త్రమంటే ఒక మాపనం అని పేర్కొన్నది?
జ: అర్హీనియస్

 

20. సేకరించిన సమాచారం ఆధారంగా తర్వాతి పరిణామాన్ని లేదా సంఘటనను ఊహించడమే...?
జ: ప్రాగుక్తీకరించడం

Posted Date : 09-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌