• facebook
  • whatsapp
  • telegram

సాంఘికశాస్త్రం, స్వభావం - పరిధి

1. 'జీవించడం ఒక కళ, ఆ కళను గురించి అధ్యయనం చేసేదే సాంఘిక శాస్త్రం' అని అన్నది ఎవరు?
జ: ముఫట్

 

2. ఏ వాదం ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత సాంఘిక శాస్త్రాన్ని విద్యాప్రణాళికలో చేర్చారు?
జ: వ్యవహారిక సత్తావాదం

 

3. 'భారతీయ విద్యా విధానంలో సాంఘికశాస్త్రం ఒక తులనాత్మక భావనను సూచిస్తుంది' అని అన్నది ఎవరు?
జ: మొదలియార్

 

4. 'సమాజ స్థాపన వికాసాలను అధ్యయనం చేయడమే సాంఘిక విజ్ఞానం' అని పేర్కొన్నది ఎవరు?
జ: అమెరికాలోని సెకండరీ విద్యాకమిటీ

 

5. ఆచరణకు, అభ్యసన అనుభవాలకు ప్రాధాన్యత ఇచ్చే అంశం ఏది?
జ: సాంఘిక శాస్త్రం

 

6. కిందివాటిలో అతి పురాతనమైన శాస్త్రం ఏది?
ఎ) భూగోళం     బి) చరిత్ర    సి) పౌరనీతి     డి) అర్థశాస్త్రం
జ:  భూగోళం

 

7. సాంఘిక అధ్యయనాల్లో అతి ప్రధానమైన అంశం ఏది?
జ:  చరిత్ర

 

8. విద్యార్థుల్లో ఉత్తమ పౌరసత్వాభివృద్ధి పెంపొందించే విషయభాగం ఏది?
జ: చరిత్ర, పౌరనీతి

 

9. చరిత్ర అనే పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. అయితే ఆ పదానికి అర్థం ఏమిటి?
జ: అన్వేషించడం

 

10. ఏ తరగతి నుంచి అర్థశాస్త్రాన్ని పాఠశాల స్థాయిలో ప్రవేశపెట్టారు?
జ: ఆరో తరగతి

 

11. కిందివాటిలో సామాజికశాస్త్రం కానిది ఏది?
ఎ) సమాజశాస్త్రం      బి) మనోవైజ్ఞానికశాస్త్రం   సి) అర్థశాస్త్రం    డి) సాంఘికశాస్త్రం
జ: సాంఘికశాస్త్రం

 

12. 'గతాన్ని విస్మరిస్తే వర్తమానం లేదు, వర్తమానాన్ని సద్వినియోగం చేసుకోకపోతే భవిష్యత్తు ఉండదు' అన్న సామెత ఏ పాఠ్య విషయానికి వర్తిస్తుంది?
జ:  చరిత్ర

 

13. 'మానవుడికి సంబంధించిన సామాజిక, సాంస్కృతిక విషయాలను చర్చించేదే సామాజిక అధ్యయనం' అని పేర్కొన్నది ఎవరు?
జ: ఎన్‌సైక్లోపిడియా ఆఫ్ బ్రిటానికా

 

14. 'మానవ సంబంధాలను అధ్యయనం చేసేదే సాంఘికశాస్త్రం' అని నిర్వచించింది?
జ: జాన్‌లీమైఖీలీన్

 

15. సవరించిన నూతన పాఠ్యప్రణాళిక ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
జ: 1993-94

 

16. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సాంఘిక అధ్యయనాలను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
జ: 1952 విద్యా సంవత్సరంలో

 

17. విద్యార్థులకు పాఠ్యపుస్తకాల బరువు తగ్గించాలని సూచించింది-
జ: యశ్‌పాల్ కమిటీ, N.C.F. 2005

 

18. కిందివాటిలో సరికాని అంశం ఏది?
ఎ) సాంఘికశాస్త్ర విషయాలు సమైక్యంగా బోధించాలి.    
బి) సాంఘికశాస్త్ర విషయాలు విడివిడిగా బోధించాలి.
సి) సాంఘికశాస్త్రం మానవ సంబంధాలను అధ్యయనం చేస్తుంది.
డి) సామాజికశాస్త్రాలు మానవ సంబంధాలను అధ్యయనం చేస్తాయి.
జ: సాంఘికశాస్త్ర విషయాలు విడివిడిగా బోధించాలి.

 

19. కిందివాటిలో సామాజిక ప్రమాణం ఏది?
ఎ) సత్యం పలకడం            
బి) సమాజం గురించి తెలుసుకోవడం   
సి) చట్టాలను గౌరవించడం  
డి) అంటరానితనాన్ని నిరోధించడం
జ: సత్యం పలకడం

 

20. గాంధీజీ ప్రతిపాదించిన విద్యావిధానం పేరు?
ఎ) వార్ధా విధానం    
బి) నయీతాలీమ్ విధానం    
సి) వృత్తివిద్యా విధానం    
డి) పైవన్నీ
జ: పైవన్నీ

Posted Date : 24-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌