మాదిరి ప్రశ్నలు
1. పాఠ్యపుస్తకంలోని సిలబస్, పని దినాలు, పనిగంటలు, సెలవు దినాల ఆధారంగా రూపొందించే ప్రణాళిక ఏది?
జ: వార్షిక ప్రణాళిక
2. యూనిట్ పథకం అమలులోని దశల్లో లేనిది ఏది?
జ: పథకం అమలు
3. పాఠ్యపథకం ఆవశ్యకత ఏమిటి?
1) నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి 2) బోధనా కార్యక్రమంపై అవగాహన కోసం
3) ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి 4) పైవన్నీ
జ: పైవన్నీ
4. హెర్బార్షియన్ పాఠ్యపథకంలో మూడో సోపానం ఏది?
జ: సంసర్గం
5. పాఠ్యపథకంలోని మొదటి సోపానమైన 'ప్రవేశం'లో లేని అంశం ఏది?
జ: నియోజనం
6. 'తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పాఠ్యపథకం' అన్నది ఎవరు?
జ: ఎల్.బి. స్టాండ్
7. కిందివాటిలో సూక్ష్మబోధన ఎవరికోసం ఉద్దేశించింది?
1) చాత్రోపాధ్యాయులు 2) విద్యార్థులు 3) జూనియర్ ఉపాధ్యాయులు
4) సీనియర్ ఉపాధ్యాయులు
జ: చాత్రోపాధ్యాయులు
8. 'క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ ఉపయోగించి ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పాదనను పరీక్షించి, వారికి వెనువెంటనే పరిపుష్టి కలిగించేదే సూక్ష్మబోధన' అని పేర్కొన్నది ఎవరు?
జ: మెక్ అలెన్, యురవిన్