• facebook
  • whatsapp
  • telegram

ఒక జాతిగా భారతదేశం

1. భారతదేశ అధికార భాష ఏది?
జవాబు: హిందీ

 

2. భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని?
జవాబు: 22

 

3. ప్రపంచంలోని ముఖ్య భాషల్లో తెలుగు భాష ఎన్నో స్థానంలో ఉంది?
జవాబు: 16వ

 

4. జనాభాలో ప్రపంచంలో రెండోస్థానంలో ఉన్న దేశం ఏది?
జవాబు: భారతదేశం

 

5. జనాభాలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది?
జవాబు: చైనా

 

6. మనదేశంలో  ఉన్న రాష్ట్రాలు,  కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని?
జవాబు: 28, 7 

 

7. భారత రాజ్యాంగం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది?
జవాబు: 1950  జనవరి 26

 

8. భారతదేశంలో సర్వసత్తాక సార్వభౌమాధికారం ఎవరిది?
జవాబు: ప్రజలది

 

9. మత వ్యవహారాల నుంచి రాజ్యాన్ని వేరుచేయడాన్ని ఏమని అంటారు?
జవాబు: లౌకికవాదం 

 

10. బంగ్లాదేశ్‌కు రెట్టింపు వైశాల్యం ఉన్న రాష్ట్రం ఏది?
జవాబు: ఆంధ్రప్రదేశ్ 

 

11. భారతదేశంలో ఎన్ని సంవత్సరాల పైబడిన వారికి  ఓటుహక్కు కల్పించారు?
జవాబు: 18 

 

12. లౌకికతత్వ రాజ్యమంటే  ఏమిటి?
జవాబు: రాజ్యానికి మత ప్రమేయం లేకపోవడం 

 

13. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజనలో ప్రధానమైన లక్షణం  ఏది?
జవాబు: సమాఖ్య ప్రభుత్వం

 

14. రాజ్యాంగం ముసాయిదా కమిటీ అధ్యక్షుడు  ఎవరు?
జవాబు: బి.ఆర్. అంబేడ్కర్ 

 

15. చట్టం ముందు ప్రతి వ్యక్తిని సమానంగా చూసే పరిపాలనను  ఏమంటారు?
జవాబు: సమన్యాయపాలన  

 

16.  ఏది లేకపోతే స్వేచ్ఛకు అర్థం ఉండదు?
జవాబు: సమానత్వం

 

17. I.A.S. ను విస్తరించండి.
జవాబు: ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్

 

18. I.P.S. ను  విస్తరించండి.
జవాబు: ఇండియన్ పోలీస్ సర్వీస్

 

19. భారతదేశంలో జాతీయ సమైక్యతా ప్రక్రియను ప్రతిబింబించే నినాదం ఏది?
జవాబు: భిన్నత్వంలో ఏకత్వం

 

20. మన రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులను రక్షించేహక్కు  ఏది?
జవాబు: రాజ్యాంగ పరిహార హక్కు

 

21. ప్రాచీన భారతదేశంలో ప్రజలంతా సమానులనే భావనను ప్రబోధించిన మతం ఏది?
జవాబు: బౌద్ధమతం 

 

22. మన దేశంలో 22 భాషలను  ఎలాంటి బద్ధమైన భాషలుగా గుర్తించారు?
జవాబు: శాసన 

 

23. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన సంవత్సరం ఏది? 
జవాబు: 1949 

 

24. భారత దేశ విశిష్ట లక్షణం ఏది?
జవాబు: భిన్నత్వంలో ఏకత్వం  

 

25. భారత రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడు  ఎవరు? 
జవాబు: బాబూ రాజేంద్రప్రసాద్

 

26. భాషా ప్రాతిపదికపై ఏర్పడిన మొదటి రాష్ట్రం  ఏది? 
జవాబు: ఆంధ్రరాష్ట్రం

 

27. తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య సుమారుగా ఎంత? 
జవాబు: 8 కోట్లు 

 

28. సౌభ్రాతృత్వం అంటే  ఏమిటి?
జవాబు: సోదరభావం

 

29. మనదేశాన్ని ముస్లిం విజేతలు  ఏమని పిలిచేవారు?
జవాబు: హిందూస్థాన్

 

30. 1996 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా సుమారు గా ఎంత? 
జవాబు: 96 కోట్లు

 

31. మన దేశంలోని అతిపెద్ద రాష్ట్రం ఏది? 
జవాబు: రాజస్థాన్

 

32. భారతదేశంలో ఇటలీ కంటే ఎక్కువ వైశాల్యం ఉన్న రాష్ట్రం ఏది?
జవాబు: రాజస్థాన్

 

33. సామాజిక న్యాయ భావన ద్వారా వేటిని తగ్గించవచ్చు లేదా నిర్మూలించవచ్చు?
జవాబు: పేదరికాన్ని, వెనుకబాటుతనాన్ని

 

34. స్వాతంత్య్రం తర్వాత, భారత ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పెంపొందించడానికి  ఏ వ్యవస్థను రద్దు చేసింది?
జవాబు: జమిందారీ వ్యవస్థ

 

35. ప్రజలంతా  ఎలా ఉంటే ఆ జాతి లేదా దేశం మనగలుగుతుంది?
జవాబు: ఏకతాభావన 

 

36.  ఎలాంటి భావనను కల్గించడమే జాతీయ సమైక్యత పరమార్థం?
జవాబు: ఈ దేశం నాది

 

37. ప్రాచీన కాలంలో మన దేశాన్ని ఏమని వ్యవహరించేవారు?
జవాబు: భరతవర్షం

 

38.  జాతీయ సమైక్యతను పెంపొందించడానికి దృఢమైన ప్రాతిపదికలు ఏవి?  
జవాబు: ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సామాజిక న్యాయం.

Posted Date : 24-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌