• facebook
  • whatsapp
  • telegram

మన ఆహారం - పౌష్టికాహారం - పోషకాహారలోప వ్యాధులు

* మనకు ఆహారం రెండు రకాలుగా లభిస్తుంది.
      1) మొక్కలు
     2) జంతువులు
* మొక్కల నుంచి ధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, నూనెలు లభిస్తాయి.
* జంతువుల నుంచి పాలు, పాల సంబంధ పదార్థాలు, గుడ్లు, చేపలు, మాంసం లభిస్తాయి.
* వివిధ రకాల పదార్థాలను తయారుచేయడానికి పలు రకాల పదార్థాలు కావాలి. ఆహారాన్ని తయారుచేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులు అంటారు.

* యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యాని ఆకులు, నల్ల మిరియాలు... వీటన్నింటిని సుగంధ ద్రవ్యాలు అని పిలుస్తారు.
* జీడిపప్పు, బాదం, కిస్‌మస్, కర్జూరాలను ఎండినపండ్లు అంటారు.
వెజిటబుల్ కార్వింగ్: కూరగాయాలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు, డిజైన్‌లతో అందంగా అలంకరిస్తారు. దీన్నే వెజిటబుల్ కార్వింగ్ అంటారు.
అరటిపండు: దీనిలో మనశరీరానికి కావాల్సిన పొటాషియం అనే మూలకం ఉంటుంది.
     అరటిపండులో ఎక్కువగా చక్కెరలు ఉంటాయి. కాబట్టి ఖాళీ కడుపుతో తినకూడదు. ఏదైన మాంసకృత్తులున్న పదార్థంతో కలిపి తినాలి.
చికోరి: ఇది జీర్ణవ్యవస్థకు, రక్తప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది.
* సోయాబీన్, బఠానీలలో మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి.
* ఉల్లిపాయలో ఉండే 'యాంటీఆక్సైడెంట్‌లు' రోగాల నుంచి కాపాడతాయి.
* చిలగడదుంపల్లో రక్తాన్ని శుద్ధిచేసే కెరొటినాయిడ్, యాంటీఆక్సిడెంట్‌లు ఉంటాయి.
* టమాటోలో విటమిన్ 'సి' ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది.
* సలాడ్ అనే పదం సాలాటా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సాలాటా అంటే ఉప్పు అని అర్థం.
* మనం తీసుకునే ఆహారంలో 5 రకాల పోషక పదార్థాలు ఉంటాయి.
         కార్బోహైడ్రేట్‌లు
         ప్రొటీన్‌లు (ఇవి అధికంగా ఉంటాయి. అందుకే వీటిని స్థూల పోషకాలు అంటారు.)
         కొవ్వులు
         విటమిన్‌లు
         ఖనిజలవణాలు (ఇవి తక్కువ పరిమాణంలో ఉంటాయి. వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు.)
* శక్తినిచ్చే పోషకాలు - కార్బొహైడ్రేట్‌లు, కొవ్వులు
* శరీరనిర్మాణానికి, పెరుగుదలకు ఉపయోపడేవి - ప్రొటీన్‌లు (మాంసకృత్తులు)

 

లిపిడ్లు
* అధిక శక్తినిచ్చే పోషకాలు. వీటినే కొవ్వులు అంటారు.
* ఇవి శరీరంలో నిల్వ ఉంటాయి.
* ఒక గ్రాము కొవ్వు నుంచి 9.45k.cal శక్తి లభిస్తుంది.
* కొవ్వు పదార్థాలు ముఖ్యంగా నూనెలు, పాల సంబంధ పదార్థాలు, గుడ్డు పచ్చసొన, జంతువుల మాంసంలో ఉంటాయి.
* వీటిని సాధారణంగా కాగితపు పరీక్షతో నిర్ధారిస్తారు. (కొవ్వు పదార్థాన్ని కాగితంపై రుద్దినప్పుడు అది పారదర్శకంగా మారుతుంది)

 

ప్రొటీన్‌లు/మాంసకృత్తులు:
* ఇవి ముఖ్యంగా పాలు, గుడ్లు, మాంసం, పప్పుధాన్యాల్లో, ముఖ్యంగా సోయాబీన్‌లో అత్యధికంగా ఉంటాయి.
* ప్రొటీన్‌లను శరీర నిర్మాణకాలు అని అంటారు. ఎందుకంటే ఇవి శరీర నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
* ప్రొటీన్లను గుర్తించడానికి 2% CuSO4, + 10% NaOH, + 10 చుక్కల నీటి మిశ్రమాన్ని ప్రొటీన్లు ఉండే ఆహారంలోకి వేసినప్పుడు ఆ పదార్థం నీలిరంగు/వంకాయ రంగులోకి మారుతుంది.

 

కార్బొహైడ్రేట్లు/పిండి పదార్థాలు:
* ఇవి శరీరానికి శక్తినిచ్చే పదార్థాలు. కార్బోహైడ్రేట్లు, కొవ్వులను కలిపి శక్తి జనకాలు అంటారు.
* ఇవి ముఖ్యంగా ధాన్యాలు (వరి, గోధుమ, జొన్న, రాగి), దుంపల్లో అత్యధికంగా ఉంటాయి.
* చిలగడదుంప, బీట్‌రూట్‌లలో అత్యధికంగా పిండిపదార్థాలు ఉంటాయి.
అయోడిన్ పరీక్ష: కార్బోహైడ్రేట్లు అత్యధికంగా ఉన్న ఒక పదార్థంలో అయోడిన్ ద్రావణాన్ని కలపగా వెంటనే ఆ పదార్థం ముదురు నీలిరంగులోకి మారుతుంది.
సంతులిత ఆహారం: శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు సరైన మోతాదులో కలిగిన ఆహారం.
పీచుపదార్థాలు: సన్నని దారాలు/ నారల లాంటి నిర్మాణాలున్న ఆహార పదార్థాలను పీచుపదార్థాలు అంటారు.
ఉదా: పొట్టుతియ్యని గోధుమలు, తృణధాన్యాలు, చిలగడదుంప, బఠానీ, గుమ్మడి, పాలకూర, పొట్టుతీయని పండ్లు.
* పీచు పదార్థాలు మలబద్దకాన్ని తొలగిస్తాయి.
జంక్‌ఫుడ్స్: నూడిల్స్, బర్గర్లు, ఐస్‌క్రీమ్‌లు, శీతలపానీయాలు... లాంటి బేకరీ పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. (వీటిలో హానికర కార్బోహైడ్రేట్లు ఉంటాయి.)
* ఒక అరటిపండు 104 కేలరీల శక్తిని ఇస్తుంది.
* 100 గ్రాములు ద్రాక్ష 17 కేలరీల శక్తిని ఇస్తుంది.
* జామపండులో ఉన్న యాంటి ఆక్సిడెంట్లు మలబద్దకాన్ని నివారిస్తాయి.

* మామిడిపండు గుండె కొట్టుకునే వేగాన్ని, రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
* మనదేశంలో అన్నం, రొట్టె (చపాతీ) ప్రధానమైన ఆహార పదార్థాలు.
* కమలాపండులో సి-విటమిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది సహజమైన, బలమైన యాంటీఆక్సిడెంట్.
 

శరీరానికి నీటి ఆవశ్యకత
* మనశరీరంలో అధికశాతం నీరు ఉంటుంది. ఇది కణాల జీవపదార్థంలో 60% ఉంటుంది.
* పదార్థాల రవాణాలో, వ్యర్థపదార్థాలను తొలగించడానికి నీరు చాలా అవసరం.

 

వివిధ సమయాల్లో వ్యక్తులు తీసుకోవాల్సిన పదార్థాలు
 సమయం  ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహారపదార్థాలు
ఎదిగే పిల్లలు మాంసకృత్తులు, పిండిపదార్థాలు
జబ్బుచేసినప్పుడు విటమిన్‌లు, ఖనిజలవణాలు
కూలీలు, కార్మికులు పిండిపదార్థాలు, కొవ్వులు
గర్భిణులు, పసిపిల్లల తల్లులు పిండి పదార్థాలు, మాంసకృత్తులు, లవణాలు, విటమిన్లు

 

హార పిరమిడ్: మనం ప్రతిరోజు ఏ ఏ పదార్థాలు ఎంత మోతాదులో, ఏ సమయంలో తినాలి అని చూపే చార్టునే ఆహారపిరమిడ్ అంటారు.
 

మధ్యాహ్న భోజన పథకం:
ఇది పాఠశాలల్లో పౌష్టికాహారం కోసం ఉద్దేశించిన ప్రభుత్వ పథకం.
* ఈ పథకం 2003, జనవరి 2 నుంచి అమల్లోకి వచ్చింది.
* ఈ పథకం ప్రకారం ప్రతి పిల్లవాడికి కనీసం 300 కేలరీల శక్తి, 8.12 గ్రాముల ప్రొటీన్లు ఉండే ఆహారం అందించాలి.
* ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త ఫ్రెంచ్ దేశస్థుడు 'లెవోయిజర్' 1743 - 1793 వరకు చేసిన పరిశోధనలు పోషణలో ఆధునిక ఆలోచనలకు దారితీశాయి.
* 1752లో జేమ్స్‌లిండ్ అనే శాస్త్రవేత్త 'స్కర్వీ' వ్యాధిని తాజా ఫలాలు, కూరగాయలను తినడం వల్ల నయం చేయవచ్చని కనుక్కున్నాడు.
* కొన్ని రకాల వ్యాధులకు, కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల నయం చేయవచ్చని 1952లో తెలిసింది.

పోషకాహార లోపం - వ్యాధులు:
పోషకాహార లోపం: మనం తినే ఆహారంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషక పదార్థాలు తగినపాళ్లలో లేకపోవడం.

 

పోషకాహార లోపవ్యాధులు
ఎ) క్యాషియార్కర్        బి) మెరాస్‌మస్       సి) స్థూలకాయత్వం
ఎ) క్వాషియార్కర్:
* ఇది ప్రొటీన్ల లోపం వల్ల 18 నెలలు - 5 సంవత్సరాలు లోపు పిల్లల్లో వచ్చే వ్యాధి.

 

లక్షణాలు:
1) శరీర కణజాలాల్లోకి నీరు చేరడం వల్ల కాళ్లు, చేతులు, ముఖం, శరీరమంతా ఉబ్బినట్లుగా ఉంటుంది.
2) కండరాల పెరుగుదల సరిగా ఉండదు.
3) పొడిబారిన చర్మం, విరేచనాలతో బాధపడుతూ ఉంటారు.
* క్వాషియోర్కర్ అనేది ఆఫ్రికన్ పదం. దీనర్థం నిర్లక్ష్యానికి గురైన శిశువు.

 

బి) మెరాస్‌మస్:
ఇది ప్రొటీన్, కేలరీ (కార్బోహైడ్రేట్లు, కొవ్వులు) రెండింటి లోపం వల్ల కలిగే వ్యాధి.

 

లక్షణాలు:
* నిస్సత్తువ, బలహీనత, కీళ్లవాపు
* కండరాల్లో పెరుగుదల లోపం
* పొడిబారిన చర్మం, విరేచనాలు
* ఈ వ్యాధి సాధారణంగా వెంట వెంటనే గర్భం దాల్చడం/ ఎక్కువ కాన్పులైన తల్లికి పుట్టే పిల్లల్లో కనిపిస్తుంది.

 

3. స్థూలకాయత్వం:
* శరీరబరువు 20% కొవ్వుల వల్లే ఉంటే దాన్ని స్థూలకాయత్వం అంటారు.

 

కారణాలు:
    1. అధిక కేలరీల ఆహారం ఎక్కువగా తినడం, తక్కువ శక్తిని ఖర్చు చేయడం.
    2. అనువంశికత
    3. జంక్‌ఫుడ్స్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు

 

సమస్యలు: డయాబిటిస్, గుండె సంబంధిత సమస్యలు
విటమిన్లు
* ఇవి సూక్ష్మపోషకాలు, శరీరంలో సంశ్లేషితం కావు.
* కరిగే స్వభావం ఆధారంగా విటమిన్లు 2 రకాలు

 


B-Complex / B- సమూహపు విటమిన్లు:
      B1 - థయామిన్
      B2 - రైబోఫ్లేవిన్
      B3 - నియాసిన్
      B6 - పైరిడాక్సిన్
      B12 - సయానోకోబాలమిన్
      ఫోలిక్ఆమ్లం
      పాంటోథెనిక్ ఆమ్లం
      బయోటిన్
* జంతువులపై పరిరక్షణ, వాటి హక్కులపై పరిశీలనలకు సంబంధించిన సంస్థ - బ్లూక్రాస్
కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్: పర్యావరణాన్ని పచ్చదనంతో నింపడానికి ప్రకృతిని కాపాడుకోవడం కోసం కోటి మొక్కలు నాటే ఉద్దేశంతో ఏర్పడిన స్వచ్ఛంద సంస్థ.
* ప్రకృతి పరిరక్షణ పట్ల, శ్రద్దచూపిన విద్యార్థులకు 'వనప్రేమి' పురస్కారం అందిస్తుంది.

విటమిన్లు - లభ్యవనరులు - లోపంవల్ల కలిగే వ్యాధులు - లక్షణాలు
 విటమిన్   వనరులు  కలిగే వ్యాధులు లక్షణాలు
1) థయామిన్ (B1) తృణ ధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, చేపలు, గుడ్లు బెరిబెరి వాంతులు, మూర్చ, ఆకలి లేకపోవడం, శ్వాసలో ఇబ్బందులు, పక్షవాతం కూడా రావచ్చు.
2) రైబోఫ్లేవిన్ (B2) పాలు, గుడ్లు, కాలేయం, మూత్రపిండాలు, ఆకుకూరలు గ్లాసైటీస్ నోటిపూత, పెదవుల చివర్లు పగలడం, నాలుకపై పుండ్లు, వెలుతురు చూడలేకపోవడం
3) నియాసిన్ (B3) మూత్రపిండాలు, కాలేయం, మాంసం, గుడ్లు, చేపలు, నూనెగింజలు పెల్లాగ్రా చర్మవ్యాధులు, నీళ్ల విరేచనాలు, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం చర్మం పొలుసుబారిపోవడం
4) ఫెరిడాక్సిన్ (B6) నూనెగింజలు, తృణధాన్యాలు, కూరగాయలు, పాలు, చేపలు, మాంసం, గుడ్లు, కాలేయం అనీమియా వాంతులు, మూర్చ
5) సయానకోబాలమిన్ (B12) జీర్ణవ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా దీన్ని సంశ్లేషిస్తుంది. వెర్నీషియస్ అనీమియా నిస్సత్తువ, ఆకలి మందగించడం
6) ఫోలిక్ ఆసిడ్ కాలేయం, మాంసం, గుడ్లు, పాలు, పండ్లు, తృణ ధాన్యాలు, ఆకుకూరలు అనీమియా నీళ్ల విరేచనాలు, ల్యూకోసైట్ల సంఖ్య తగ్గిపోవడం, జీర్ణవ్యవస్థలో శ్లేష్మ సమస్యలు.
7) పాంటోథెనిక్ ఆమ్లం చిలగడ దుంపలు, వేరుశనగ, గుడ్లు, కూరగాయలు, కాలేయం, మూత్రపిండాలు పాదాల పగుళ్లు నడవలేకపోవడం, మడమ నొప్పులు
8) బయోటిన్ పప్పుధాన్యాలు, గింజలు, కూరగాయలు, కాలేయం, మూత్రపిండాలు, పాలు నాడీ సంబంధ సమస్యలు కండరాల నొప్పులు, అలసిపోవడం, మానసిక వ్యాకులత
9) ఆస్కార్బిక్ ఆమ్లం (C) ఆకుకూరలు, పుల్లని పండ్లు, మొలకెత్తిన గింజలు స్కర్వీ గాయాలు మానకపోవడం, ఎముకలు విరగడం
10) రెటినాల్ (A) ఆకుకూరలు, క్యారెట్, టమాటో, గుమ్మడి, బత్తాయి, మామిడి, మాంసం, చేపలు, గుడ్లు, కాలేయం, పాలు, కార్డ్‌లివర్, షార్క్‌లివర్ ఆయిల్ కన్ను  చర్మ వ్యాధులు రేచీకటి, చత్వారం, కంటి నుంచి నీరుకారడం, చర్మం పొలుసు నేత్ర పటాల సమస్య
11) కాల్సిఫెరాల్ (D) కాలేయం, గుడ్లు, కార్డ్‌లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్ రికెట్స్ ఎముకలు సరిగా పెరగకపోవడం పెలుసుబారడం, డొడ్డికాళ్లు, దంత సమస్య, ముంజేతి వాపు
12) టోకోఫెరాల్ (E) పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, పొద్దు తిరుగుడు నూనె వంధ్యత్వ సమస్యలు పురుషుల్లో వంధ్యత్వం స్త్రీలలో గర్భస్రావ సమస్యలు
13) ఫిల్లోక్వినోన్ (K) మాంసం, గుడ్లు ఆకుకూరలు, పాలు రక్తం గడ్డకట్టక పోవడం అధిక రక్తస్రావం, రక్తం గడ్డకట్టక పోవడం

Posted Date : 09-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌