• facebook
  • whatsapp
  • telegram

మన ఆహారం - పౌష్టికాహారం - పోషకాహారలోప వ్యాధులు

బిట్లు

1. రక్తాన్ని శుద్దిచేసే కెరొటినాయిడ్, 'యాంటీ ఆక్సిడెంట్‌లను' కలిగిన పదార్థం-
జ: చిలకడదుంప

 

2. విటమిన్ 'సి'ని కలిగి ఉన్న, రోగనిరోధక శక్తిని పెంపొందించే కాయగూర -
జ: టమాటా

 

3. సలాడ్ అనే పదం సాలాటా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. అయితే సాలాటా అంటే అర్థం.....
జ: ఉప్పు

 

4. ఒక విద్యార్థి పిండి పదార్థాలు అధికంగా ఉండే ఒక పదార్థంలోకి 'అయోడిన్' ద్రావణాన్ని కలపగా అది ఏ రంగులోకి మారుతుంది?
జ: నీలి

 

5. తాజా ఫలాలు, కూరగాయలను తినడం వల్ల 'స్కర్వీ' వ్యాధి నయమవుతుంది అని 1752లోనే తెలిపిన శాస్త్రవేత్త
జ: జేమ్స్‌లిండ్

 

6. 'ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు' కారణమేంటి?
జ: దీనిలో చక్కెరలు ఎక్కువగా ఉంటాయి

 

7. కిందివాటిలో జంక్‌ఫుడ్‌కు చెందనిది-
ఎ) ఐస్‌క్రీం         బి) పెప్సీ         సి) నూడిల్స్         డి) చెరకు
జ: డి(చెరకు)

 

8. 'మలబద్దకం'ను నివారించడానికి మనం ఆహారం ద్వారా ఎక్కువగా తీసుకోవాల్సినవి
జ: పీచుపదార్థాలు

 

9. కిందివాటిలో బి - కాంప్లెక్స్‌లో లేని విటమిన్
ఎ) నియాసిన్         బి) బయోటిన్         సి) రెటినాల్         డి) పైరిడాక్సిన్
జ: సి(రెటినాల్ )

 

10. కొవ్వుల్లో కరగని విటమిన్లు-
జ: B6, C

 

11. పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావ సమస్యలకు కారణమయ్యే విటమిన్ ఏది?
జ: టోకోఫెరాల్

 

12. జీర్ణవ్యవస్థలో ఉండే బ్యాక్టీరియం వల్ల సంశ్లేషణం చెందే విటమిన్-
జ: సయానకోబాలమిన్

 

13. క్వాషియార్కర్ దేని లోపం వల్ల సంభవిస్తుంది?
జ: ప్రొటీన్లు

 

14. తిన్న ఆహారం వాంతి అవడానికి కారణాలు
ఎ) అతిగా తిన్నప్పుడు
బి) విషతుల్యమైన ఆహారం తీసుకొన్నప్పుడు
సి) తీసుకున్న ఆహారంలో కొవ్వుశాతం ఎక్కువగా ఉన్నప్పుడు
డి) అన్నీ
జ: డి(అన్నీ)

 

15. 'పెల్లాగ్రా' అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది?
జ: B3

 

16. నోటిపూత, పెదవుల చివరలు పగలడం, నాలుకపై పుండ్లు లాంటి లక్షణాలున్న వ్యక్తిలో లోపించిన విటమిన్
జ: రైబోఫ్లావిన్

 

17. ఒక గ్రాము కొవ్వు నుంచి లభించే శక్తి
జ: 9.45 k.cal

 

18. జంతువుల పరిరక్షణ, వాటి హక్కులపై పరిశీలనలకు సంబంధించిన సంస్థ
జ: బ్లూక్రాస్

 

19. ప్రస్తుతం ఆడపిల్లలు తొందరగా యవ్వనదశ చేరడానికి కారణం
జ: ఈస్ట్రోజన్ ఇంజెక్షన్ పాలు

 

20. 'శరీర నిర్మాణకాలు' అని పేరున్న పోషక పదార్థాలను అధికంగా కలిగిన పదార్థం ......
జ: సోయాబీన్

 

21. గుండె కొట్టుకునే వేగాన్ని, రక్తపోటును అదుపులో ఉంచే ఫలం-
జ: మామిడి పండు

 

22. 'ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త' -
జ: లేవోయిజర్

 

23. మధ్యాహ్న భోజన పథకం ప్రకారం ప్రతిపిల్లవాడికి కనీసం ఒక రోజులో ఇవ్వాల్సిన కేలరీల శక్తి
జ: 300

 

24. 2 సంవత్సరాల వయసు ఉన్న రవి అనే బాలుడు కండరాల అభివృద్ధి సరిగా లేక, శరీర కణజాలాల్లోకి నీరు చేరడం వల్ల ముఖం, కాళ్లు, చేతులు ఉబ్బి, విరేచనాలతో బాధపడుతున్నాడు. అయితే ఆ బాలుడికి అందించాల్సిన పోషకాలు
జ: ప్రొటీన్లు

 

25. జంక్‌ఫుడ్‌లో ఉండేలో ఉండే పోషక పదార్థాలు
జ: కార్బోహైడ్రేట్లు

 

26. ఒక అరటి పండు నుంచి లభించే కేలరీల శక్తి
జ: 104

Posted Date : 24-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌