• facebook
  • whatsapp
  • telegram

జ్ఞానేంద్రియాలు

1. పుస్తకానికి, కంటికి మధ్య దూరం ఎంత ఉండాలి?
జ‌: 30 మి.మీ.

 

2. నేత్రదానంలో కంటి నుంచి దేన్ని సేకరిస్తారు?
జ‌: రెటీనా

 

3. వెలుపలి చెవికి, మధ్య చెవికి మధ్యలో ఉండే పలుచని నిర్మాణం
జ‌: కర్ణభేరి

 

4. 60 ఏళ్ల వయసున్న రంగయ్య తన తోటలో దూరంగా ఉండే చెట్లను చూడలేకపోతున్నాడు. ఈ లోపాన్ని ఏమంటారు?
జ‌: హ్రస్వదృష్టి

 

5. మధ్యచెవిలోని ఎముకల వరుసక్రమం
జ‌: కూటకం, దాగలి, కర్ణాంతరాస్థి

 

6. కంటి గుడ్డును కదిపేందుకు కనుగుంతల్లో ఉన్న కండరాల సంఖ్య
జ‌: 6

 

7. అతి తక్కువ కాంతి ఉన్న గుహలో ఉన్న కుందేలును వేటగాడు బంధించి పట్టుకున్నాడు. అయితే దీనికి సహాయపడిన కంటిలోని కణాలు-
జ‌: దండాలు

 

8. కిందివాటిలో కంటికి సంబంధించని వ్యాధి
(ఎ) గ్లూకోమా          (బి) ట్రకోమా          (సి) బొల్లి            (డి) వర్ణాందత
జ‌: సి (బొల్లి)

 

9. కంటి రంగును దేన్ని బట్టి నిర్ణయిస్తారు?
జ‌: కనుపాప

 

10. నేత్రపటలంలో శంకువులు అనే కణాలు అధికంగా ఉండే భాగం.
జ‌: ఎల్లోస్పాట్

 

11. అంతశ్చర్మంలో 'సెబం' అనే పదార్థాన్ని స్రవించేది
జ‌: తైలగ్రంథి

 

12. కంటిలోని మొదటిపొర అయిన ధృడస్తరంలో ఉండే కటకం
జ‌: కుంభాకార కటకం

 

13. కిందివాటిలో నాలుక గ్రహించని రుచి ఏది?
(ఎ) కారం              (బి) చేదు            (సి) ఉప్పు              (డి) తీపి
జ‌: ఎ (కారం)

 

14. మానవుడి చెవి వినగలిగే ధ్వని గరిష్ఠ పౌనఃపున్యం ఎంత? (హెర్ట్జ్‌లలో)
జ‌: 20000

 

15. మానవ శరీరంలో చర్మం ఎక్కడ దళసరిగా ఉంటుంది?
జ‌: అరికాళ్లు

 

16. కనురెప్పల్లో చర్మం మందం ......... మి.మీ.
జ‌: 0.5

 

17. శరీరంలోనే అతి చిన్న ఎముక అయిన స్టేపిస్ ఏ అవయవంలో ఉంటుంది?
జ‌: మధ్యచెవి

 

18. సూర్యకిరణాల నుంచి చర్మాన్ని రక్షించే వర్ణకం
జ‌: మెలనిన్

 

19. జిరాఫ్తాల్మియా వ్యాధి ఏ అవయవానికి సంభవిస్తుంది?
జ‌: కన్ను

 

20. చర్మంలో పీడనాన్ని గ్రహించే గ్రాహకాలు
జ‌: పాసినియన్ గ్రాహకాలు

 

21. కిందివాటిలో చర్మానికి వచ్చే పోషకాహార వ్యాధి ఏది?
(ఎ) తట్టు           (బి) కుష్టు          (సి) తామర        (డి) పెల్లాగ్రా
జ‌: డి (పెల్లాగ్రా)

 

22. చెవిలో ఏ భాగం నుంచి సెరుమినస్ గ్రంథులు ఉండి 'మైనం' లాంటి పదార్థాన్ని స్రవిస్తాయి?
జ‌: పిన్నా

 

23. శరీర సమతాస్థితిని కాపాడే చెవిలోని భాగం
జ‌: అంతరచెవి

 

24. ఆధార్ లాంటి గుర్తింపు కార్డులను ఇచ్చేటప్పుడు కంటిలో ఏ భాగాన్ని ఫోటోగా తీసుకుంటారు?
జ‌: కనుపాప

 

25. కిందివాటిలో సరికానిది??
(ఎ) కన్ను - దృక్‌నాడీ                   (బి) ముక్కు - ఘ్రాణనాడీ
(సి) చెవి - శ్రవణనాడీ                     (డి) చర్మం - వేగస్‌నాడీ
జ‌: డి (చర్మం - వేగస్‌నాడీ)

 

26. చర్మంలోని శీతల గ్రాహకాలు ఎంత ఉష్ణోగ్రత దాటితే ఉష్ణగ్రాహకాలుగా మారతాయి?
జ‌: 35ºC

 

27. కంటి అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?
జ‌: ఆప్తామాలజీ

 

28. కంటిలోని ఏ ప్రాంతంలో ప్రతిబింబం ఏర్పడదు?
జ‌: దండకణాలు, శంకుకణాలు లేని ప్రాంతం

 

29. నాలుక పక్కభాగం ఏ రుచులను గ్రహిస్తుంది?
జ‌: పులుపు

 

30. కంటిలో జ్ఞాన రంగానికి చెందిన పొర
జ‌: రెటీనా

 

31. దగ్గరి వస్తువులను చూడలేకపోతే దాన్ని ఏమంటారు?
జ‌: దూరదృష్టి

 

32. మానవుడి కన్ను ఏ దృష్టిని కలిగి ఉంటుంది?
జ‌: బైనాక్యులర్

 

33. కృత్రిమంగా తయారు చేసిన ఆహార పదార్థాల రుచికి ఉన్న పేరు
జ‌: మెటాలిక్ టేస్ట్

 

34. బాహ్య చెవిలోని కర్ణభేరి  ఏ ఎముకతో కలిసి ఉంటుంది?
జ‌: కూటకం

 

35. మానవుడి శరీరంలో అతిపెద్ద అవయవం ఏది?
జ‌: చర్మం

Posted Date : 24-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌