• facebook
  • whatsapp
  • telegram

పెడగోజీ 

మాదిరి ప్ర‌శ్న‌లు

1. బ్రెయిలీ లిపి ద్వారా విద్యను అందించడం ఎవరికి సరైన పద్ధతి?
జ: దృష్టి లోపం ఉన్నవారు

 

2. కిందివారిలో 'డన్' వర్గీకరణకు చెందనివారు?
1) అంగవైకల్యం ఉన్నవారు           2) దీర్ఘకాల అనారోగ్యం ఉన్నవారు
3) ప్రతిభావంతులు                      4) సగటు ప్రతిభావంతులు
జ: 4 (సగటు ప్రతిభావంతులు)

 

3. పిల్లలకు ఏవైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ వైకల్యాలు ఉండటాన్ని ఏ వైకల్యం అంటారు?
జ: బహుళ వైకల్యం

 

4. మానసిక వైకల్యానికి కారణం ఏమిటి?
1) జన్యుపర లోపం      2) మేనరిక వివాహం     3) అపరిపక్వ జననం      4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

5. బుద్ధిమాంద్యులకు అవసరమైన విద్యా ప్రణాళిక ఏది?
1) సమైక్య విధానం      2) ఆశ్రమ పాఠశాలలు      3) గృహ శిక్షణ      4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

6. కిందివాటిలో బుద్ధిమాంద్యుల ప్రవర్తనను అభివృద్ధి చేసే పద్ధతులకు చెందనిది ఏది?
1) ఆకృతీకరణం      2) క్రమీణ అస్తిత్వం      3) సాధారణ బోధన      4) గొలుసు విధానం
జ: 3 (సాధారణ బోధన)

 

7. బుద్ధిమాంద్యులకు ఏ గొలుసు విధాన పద్ధతి ఉపయోగకరం?
జ: ఆరోహణా గొలుసు విధానం

 

8. బుద్ధిమాంద్యుల ప్రవర్తన ఒక నిర్దేశిత లక్ష్యం చేరే వరకు క్రమంగా ప్రోత్సాహాన్ని ఇవ్వడం అనేది
జ: క్రమీణా అస్తిత్వం

 

9. ప్రపంచంలోనే మొదటిసారిగా 1784లో ప్యారిస్‌లో అంధుల కోసం పాఠశాలను స్థాపించినవారు
జ: వాలెంటీన్ హ్యూ

 

10. 'పర్సన్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్‌'ను ఎప్పుడు రూపొందించారు?
జ: 1995

 

11. అంధులకు ప్రత్యేక విధాన సూత్రాలు ఏవి?
1) మూర్తత్వం      2) స్వీయకృత్యాలు      3) ఏకీకృత బోధన      4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

12. పీడబ్ల్యూడీ యాక్ట్ 1995 ప్రకారం ఎన్ని డెసిబుల్స్ వరకు వినలేని వారిని పూర్తి వినికిడి లోపం ఉన్నవారిగా గుర్తించాలి?
జ: 60

 

13. ముద్రిత భాషను చదవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న విద్యార్థిలోని సమస్యను ఏమంటారు?
జ: డిస్‌లెక్సియా

 

14. గణితపరమైన సమస్యను ఎదుర్కోవడం అనేది
జ: డిస్‌కాల్కులియా

 

15. ఒకరు వ్యక్తపరచిన భావాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం
జ: డిస్‌ఫేసియా

 

16. రాయడంలో ఇబ్బంది పడటం అనేది ఏ అభ్యసన వైకల్యం?
జ: డిస్‌గ్రాఫియా

 

17. కిందివాటిలో బహుళ ఇంద్రియ శిక్షణా పద్ధతి ఏది?
1) 3 R పద్ధతి         2) TLM పద్ధతి       3) VAKT పద్ధతి         4) గొలుసు విధానం
జ: 3 (VAKT పద్ధతి)

 

18. ప్రతిభావంతులకు ఉపయోగించే విద్యాప్రణాళిక
1) త్వరణం      2) పృథక్కరణం      3) సంవృద్ధిమత్వం      4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

19. బాలుడి కాళ్లు, చేతుల్లో అసంకల్పితంగా కదలిక ఉండటం అనేది ఏ సమస్య?
జ: ఎథెటోసిస్

 

20. కండరాల కదలిక ఒక వైపు చూపితే మరో వైపు కదలడం అనేది ఏ సమస్య?
జ: స్పాస్టిసిటీ

 

21. ఒక వ్యక్తి సమావస్థ శక్తిని కోల్పోవడం వల్ల ప్రాదేశిక సంబంధాలు తక్కువగా ఉండటం
జ: అటాక్సియా

 

22. కండరాలు బిగుసుకుపోవడం వల్ల అవయవాలను సరిగ్గా కదల్చలేకపోవడం అనేది
జ: అనమ్యత

 

23. టెర్మన్ ప్రకారం నాయకుల్లో ఉండాల్సిన లక్షణాలెన్ని?
జ: 79

 

24. అందరి అభిప్రాయాలను గౌరవించే నాయకత్వం
జ: సహభాగి నాయకత్వం

 

25. నాయకుడే అన్ని రకాలుగా నిర్ణయాలు తీసుకునే నాయకత్వం
జ: నిర్దేశిత నాయకత్వం

 

26. విద్యాహక్కు చట్టం అమల్లోకి రాకముందే స్థాపితమై, నిర్వహణలో ఉన్న పాఠశాల షెడ్యూలులోని ప్రామాణికాలను పాటించేందుకు ఇచ్చే గడువు ఎన్ని సంవత్సరాలు?
జ: 3

 

27. బాలలను శారీరక హింసకు గురిచేయకూడదని, అలా శిక్షించినవారి పై క్రమశిక్షణా చర్యలు తప్పవని విద్యాహక్కు చట్టంలోని ఏ సెక్షన్ తెలియజేస్తోంది?
జ: సెక్షన్ - 17

 

28. కిందివాటిలో పాఠశాల యాజమాన్య సంఘం బాధ్యత కానిది ఏది?
1) బడి పనితీరు పర్యవేక్షణ                
2) పాఠశాలలో ఉపాధ్యాయులను తొలగించడం
3) బడి అభివృద్ధి ప్రణాళిక తయారుచేసి సిఫార్సు చేయడం  
4) నిధుల వినియోగం - పర్యవేక్షణ
జ: 2 (పాఠశాలలో ఉపాధ్యాయులను తొలగించడం)

 

29. నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం గురించి విద్యాహక్కు చట్టంలోని ఏ సెక్షన్ తెలియజేస్తోంది?
జ: సెక్షన్ - 29

 

30. విద్యాహక్కు చట్టం అమలు కోసం కేంద్ర, రాష్ట్ర వాటాల నిష్పత్తి 68 : 32 అని తెలియజేసే సెక్షన్?
జ: సెక్షన్ - 7

Posted Date : 09-10-2020

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌