• facebook
  • whatsapp
  • telegram

అభ్యసనం (Learning) 

మాదిరి ప్ర‌శ్న‌లు
 

1. పవన్ అనే విద్యార్థికి పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడంటే భయం. ఆ విద్యార్థి క్రమంగా ఈ భయాన్ని గణిత ఉపాధ్యాయుడికి, వ్యాయామ ఉపాధ్యాయుడికి అనుప్రయుక్తం చేసుకుంటే దీన్ని ఎలా గుర్తించవచ్చు?

జ: సామాన్యీకరణం

2. వెంకట్ అనే విద్యార్థికి ఇంజక్షన్ చేయించుకోవడమంటే భయం. క్రమంగా ఈ భయాన్ని డాక్టర్‌కు, హాస్పిటల్‌కు, చివరికి ఆ వీధికి కూడా మార్చుకుంటూ ఉంటే వెంకట్‌లోని ఈ మార్పును ఎలా పేర్కొనవచ్చు?

జ: ఉన్నతక్రమ నిబంధనం

3. ఉపాధ్యాయుడు తరగతి గదిలో రేవంత్, హేమంత్ అనే విద్యార్థుల్లో మంచి అలవాట్లను పెంపొందించాలనుకుని, వారిలో మంచి ఉద్దీపనలను ఏర్పాటు చేయడం పావ్‌లోవ్ ప్రయోగంలోని ఏ నియమాన్ని గుర్తుంచుకున్నట్టుగా భావించాలి?

జ: పునర్బలన నియమం

4. మౌనిష ప్రతిరోజూ ఇంటిదగ్గర నుంచి పాఠశాలకు సైకిల్‌పై వస్తుంది. ఒకరోజు ఆమె స్కూటర్‌పై పాఠశాలకు వచ్చిన కొద్దిసేపటి తర్వాత ఉపాధ్యాయుడు 'పాఠశాలకు ఎలా వచ్చావు' అని ప్రశ్నించగా ఉన్నట్లుండి 'సైకిల్‌ పై' అని సమాధానం చెప్పడం పావ్‌లోవ్ ఏ నియమాన్ని సూచిస్తుంది?

జ: అయత్నసిద్ధ స్వాస్థ్యం

5. వివిధ రకాలైన బాధలు, కుంఠనం కలిగిన కుమార్ అనే వ్యక్తి తనకి తాను స్వాంతన కలిగించుకోవడానికి ఉపయోగించుకునే నియమం ఏది?

జ: విరమణ

6. కిందివాటిలో 'అభ్యసన' లక్షణం కానిది ఏది?

     1) అభ్యసనం సంచితమైంది.

     2) వ్యక్తి పరిపక్వతపై అభ్యసనం ఆధారపడుతుంది.

     3) అభ్యసనం విచ్ఛిన్నంగా జరుగుతుంది.

     4) బదలాయింపును ప్రదర్శిస్తుంది.

జ: 3

7. హాసిని అనే బాలిక ప్రతిరోజూ వేళ్లు నోట్లో ఉంచుకోవడం, పక్క తడపడం లాంటి పనులు చేస్తుంది. ఈ అలవాట్లను క్రమంగా తగ్గించడానికి మీరు ఏ నియమాన్ని ఉపయోగించాలి?

జ: విలుప్తీకరణం

8. కిందివాక్యాల్లో అభ్యసన ప్రక్రియ ఏది?

     1) ప్రీతి తన కుటుంబసభ్యుల నుంచి 'తల్లి, తండ్రిని గుర్తించడం'.

     2) రుతిక్ అనే బాలుడిలో కలిగే శారీరక పెరుగుదల.

     3) హాసినికి క్రమంగా పాలదంతాలు రావడం.

     4) కుసుమ, సుజాత తరగతిలో అందరికంటే మంచి శరీర సౌష్ఠవం కలిగి ఉండటం.

జ: 1

9. కిందివాటిలో అభ్యసనం కాని అంశాన్ని గుర్తించండి.

     1) నిష్పాదన     2) సహజాతాలు   3) పరిపక్వత     4) పైవన్నీ

జ: 4

Posted Date : 30-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌