• facebook
  • whatsapp
  • telegram

వైయక్తిక భేదాలు - ప్రజ్ఞ

మాదిరి ప్ర‌శ్న‌లు

1. దీక్షిత అనే విద్యార్థిని సమస్యలను చక్కగా పరిష్కరించగలదు. సుదీప్తి తన వద్ద ఉన్న క్రీడా పరికరాలను చక్కగా ఉపయోగించగలదు. అయితే వీరిద్దరి ప్రజ్ఞలు వరుసగా...
జ: అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ

 

2. కిందివాటిలో వ్యక్తంతర్గత వైయక్తిక భేదం కానిది గుర్తించండి.
    1) సాహితికి ఆంగ్లం కంటే గణితంపై ఆసక్తి ఎక్కువ.
    2) శృతి తన వయసువారితో చూస్తే ప్రజ్ఞాశాలి.
    3) జ్యోత్స్న బాగా చదవగలదు. బాగా ఆటలు కూడా ఆడగలదు.
    4) గీత పాటలు బాగా పాడగలదు, డ్యాన్స్ కూడా బాగా చేయగలదు.
జ: 2 (శృతి తన వయసువారితో చూస్తే ప్రజ్ఞాశాలి.)

 

3. సుధీర్ అనే విద్యార్థి ఆటలపై ఆసక్తి చూపుతున్నాడు. సంగీతం అంటే కూడా ఇష్టపడుతున్నాడు అయితే ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎన్నుకోవడానికి ఈ విద్యార్థిలో ఆసక్తితోపాటు ముఖ్యంగా ఏ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి?
జ: సహజ సామర్థ్యం

4. కిందివాటిలో వ్యక్తంతర వైయక్తిక భేదాన్ని గుర్తించండి.
    1) లోహిత లెక్కలు బాగా చేయగలదు కానీ చదరంగం అంటే ఆసక్తి చూపుతుంది.
    2) హిమవర్షిణి బాగా చదవగలదు కానీ ఆటలంటే ఆసక్తి చూపదు.
    3) లోహిత్ పాఠశాలలోని విద్యార్థుల్లోకెల్లా తెలివైనవాడు.
    4) పార్థివ్‌కు గణిత సామర్థ్యం కంటే భాషా సామర్థ్యం అధికం.
జ: 3 (లోహిత్ పాఠశాలలోని విద్యార్థుల్లోకెల్లా తెలివైనవాడు.)

 

5. డాన్స్ నేర్చుకోవడానికి ఒకే సంస్థలో శిక్షణ పొందుతున్న అనేకమంది పిల్లల్లో కొందరు బాగా రాణిస్తున్నారు. అయితే సుశాంత్ ఎంత చక్కగా శిక్షణ పొంది, సాధన చేస్తున్నా ఆశించిన స్థాయిలో డ్యాన్స్ చేయలేకవడానికి కారణం?
జ: సహజ సామర్థ్యం లేకపోవడం

 

6. సునీత తన చుట్టూ ఉన్న దృశ్య ప్రపంచాన్ని అంతటినీ గ్రహించి తిరిగి తన మనసులో సంపూర్ణంగా ఊహించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటే గార్డ్‌నర్ బహుళకారక ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం ఈమె కలిగి ఉన్న సామర్థ్యం ఏది?
జ: ప్రాదేశిక ప్రజ్ఞ

 

7. 'ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్' అనే గ్రంథం ఎవరికి సంబంధించింది?
జ: పియర్సన్

 

8. దర్పిత ఎల్లప్పుడూ టీవీలో వచ్చే కార్టూన్ సీరియల్స్‌ను ఆసక్తితో చూస్తుంది. హాసిని ఆంగ్లాన్ని ఎల్లప్పుడూ ధనాత్మక దృష్టితో చూస్తుంది. అయితే వీరిలో ఉన్న మనోవైజ్ఞానిక అంశాలు వరుసగా...
జ: అభిరుచి, వైఖరి

Posted Date : 22-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌