• facebook
  • whatsapp
  • telegram

మానవ వికాసదశలు 

 ఏక కణంతో ప్రారంభమైన మానవ జీవితం వివిధ మార్పులు జరిగి వృద్ధాప్యంతో ముగుస్తుంది. అంటే శిశువులోని సంపూర్ణ అభివృద్ధి భౌతిక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక వికాసాల సమన్వయంతో కలసి సంయుక్తంగా ఏర్పడుతుంది. ఈ వికాసం మన జీవితంలో అవిరళంగా జరుగుతుంది.


                                            
        ఎలిజబెత్ హర్లాక్ అనే మనో విజ్ఞానవేత్త తాను రాసిన Developmental Psychology అనే గ్రంథంలో మానవ వికాసాన్ని 10 దశలుగా విభజించారు.

      వీటిలో శైశవ, పూర్వబాల్య, ఉత్తరబాల్య, కౌమార దశలు ఉపాధ్యాయుడికి ఉపయుక్తమైనవి. ఈ దశల్లో ఉండే వివిధ వికాసాల్లోని ముఖ్యాంశాల గురించి తెలుసుకుందాం.
 

1. శైశవ దశ:

* ఈ దశలో శిశువు శారీరక పెరుగుదల చాలా వేగంగా జరుగుతుంది. ఈ పెరుగుదల 5, 6 నెలల్లో రెండు రెట్లు, మొదటి సంవత్సరంలో మూడు రెట్లు, రెండో సంవత్సరానికి 4 రెట్లు పెరుగుతుంది.

* తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రారంభమైన స్పర్శాజ్ఞానంతో పాటూ జ్ఞానేంద్రియ వికాసం బాగా అభివృద్ధి చెందుతుంది.

* పాలబుగ్గలతో శిశువు అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

* పాలదంతాలు ఏర్పడే దశ.

* శిశువులోని సాంఘిక వికాసం కుటుంబానికి మాత్రమే పరిమితం చేసుకునే దశ.

* ఈ దశలో శిశువు తనను తాను ప్రేమించుకునే గుణమైన 'నార్సిజం'ను ప్రదర్శిస్తాడు.

* శిశువులో ఏర్పడే భావనలు, వారి ప్రజ్ఞ అనుభవాలపై ఆధారపడతాయి. అందుకే ఈ దశను 'మొక్కై వంగనిది మానై వంగునా' అనే సామెతతో పోల్చవచ్చు.
* మూర్త అమూర్త వస్తువులకు, విషయాలకు భయపడని దశ ఇది.

2. పూర్వ బాల్యదశ

* శారీరక వికాసం భౌతిక వికాసంలా వేగంగా జరగదు. కానీ మానసిక వికాసం వేగంగా జరుగుతుంది.

* శిశువులో అన్వేషణా గుణం (విజ్ఞానతృష్ణ) అధికంగా ఉండే వయసు.

* శరీర నిర్మాణ భేదాలు అంటే స్థూలకాయత, మధ్యమకాయత, లంబాకృతకాయత లాంటి శరీర నిర్మాణాలు కనిపించే దశ.

* పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు ఏర్పడతాయి.

* పిల్లలు సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సహకార క్రీడలను ప్రదర్శిస్తారు.

* పిల్లల్లో 'నేను అంటే ఏమిటనే' ఆత్మభావన ఏర్పడుతుంది.

* ఉద్వేగాలు నియంత్రణలో ఉండవు. ధారాపాతంగా కనిపిస్తాయి.

* అపరిపక్వ నైపుణ్యాలు కలిగి ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. అధికంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ దశను వాగుడుకాయ దశగా పేర్కొనవచ్చు.

* వ్యక్తి సాంఘిక వికాసంలో దశ ముఖ్యమైంది. అందుకే ఈ దీన్ని 'సాంఘిక వికాసానికి తొలిమెట్టు'గా ఉండే దశ అంటారు.

3. ఉత్తర బాల్యదశ

* పాఠశాల వయసు

* బాలలు తమలోని ఉద్వేగ ఒత్తిడిని కాపాడుకోవడం కోసం చేసే పనినే 'ఉద్వేగ కేథార్సిస్' అంటారు. ఇది ఈ దశ ముఖ్య లక్షణం.

* ముఠాలుగా ఏర్పడి సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటారు.

* కౌశలాలు, నైపుణ్యాలు ఏర్పడతాయి.

* కాలం, దూరం లాంటి అమూర్త భావనలు కలిగి ఉంటారు.

* భౌతిక వికాస, లింగభేదాలను చూపుతారు.

* అమూర్త వివేచనంతో న్యాయం, ధర్మం, నిజాయతీ లాంటి భావనలను ప్రస్తావిస్తారు.

* ఆడపిల్లలు సూక్ష్మకండరాలపై, మగపిల్లలు పెద్ద కండరాలపై అదుపు పొందగలరు.
 

4. యవ్వనారంభ దశ

* ఆంగ్లంలో ఈ దశను 'ప్యూబర్టి' అంటారు. దీన్ని ప్యూబారిటాస్ అనే లాటిన్ పదం నుంచి గ్రహించారు. అర్థం - 'పురుషత్వపు వయసు'. వ్యక్తి అలైంగిక జీవి నుంచి లైంగిక జీవిగా మార్పు చెందే దశ. అంటే లైంగిక భాగాలు పరిపక్వత చెంది పూర్తి పునరుత్పత్తి సామర్థ్యాన్ని చేరుకునే దశ. 

* ఇది శారీరక మనో వైజ్ఞానిక మార్పులతో కూడుకుని, జీవాత్మక లైంగిక పరిపక్వతను సూచిస్తుంది.

5. కౌమార దశ

* ఈ దశను ఆంగ్లంలో 'అడాలసెన్స్' అంటారు. దీన్ని 'అడాల్సరీ' అనే లాటిన్ పదం నుంచి స్వీకరించారు. అర్థం - పరిపక్వత చెందడం.
 

లక్షణాలు 

* అన్ని దశలలోకెల్లా ముఖ్యమైన దశ.

* శారీరక పరిపక్వతతోపాటూ వ్యక్తి ఉద్వేగ, సాంఘిక, మానసిక వికాసాల్లో మార్పు చూపే దశ.

* అధిక మానసిక సంఘర్షణ, సమస్యలతో కూడుకున్న దశ. ఈ దశలోని వారు నిరంతరం గుర్తింపు కోసం ప్రయత్నిస్తారు.

* ఇది టీనేజ్ దశ. అందానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు.

* తనకు నచ్చిన నాయకులను ఆరాధిస్తారు. దీన్నే 'వ్యక్తి పూజ దశ' అంటారు.

* భిన్న లైంగిక వ్యక్తుల పట్ల అధికమైన ఆసక్తి కనబరుస్తారు. 

*  ఈ దశలో ప్రజ్ఞ పూర్తి ఉన్నత స్థాయికి చేరుకుంటుంది.

* స్టాన్లీ హాల్ ఈ దశను 'ఒత్తిడి, సంచలనం'తో కూడుకున్న దశగా వర్ణించారు.

* కోట్లాన్ ఈ దశను 'శారీరక, మానసిక, ఉద్వేగ ప్రవర్తనలను ఎదుర్కొంటూ సర్దుబాటు చేసుకునే దశ'గా పేర్కొన్నారు.

Posted Date : 06-09-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌