• facebook
  • whatsapp
  • telegram

మూర్తిమత్వ వికాసం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. రోజా అనే బాలిక పాఠశాల విరామ సమయంలో తండ్రి ఇచ్చిన డబ్బులతో తనకు ఇష్టమైన చాక్లెట్, ఐస్‌ఫ్రూట్‌లలో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి వస్తే ఈ విద్యార్థిలో ఏర్పడే సంఘర్షణ ఏది?

జ‌: ఉపగమ - ఉపగమ సంఘర్షణ
 

2. వ్యక్తిలో ప్రేరణాత్మక మరుపుగా గుర్తించే రక్షక తంత్రం

జ‌: దమనం
 

3. ఫెటనిజం అనేది ఒక

జ‌: లైంగిక నేరం
 

4. రోషాక్ సిరా మరకల పరీక్ష కిందివాటిలో దేన్ని మదింపు చేయడానికి ఉపయోగపడుతుంది?

ఎ) మూర్తిమత్వం        బి) ప్రజ్ఞ        సి) వైఖరులు        డి) సహజసామర్థ్యాలు

జ‌: ఎ(మూర్తిమత్వం)
 

5. పిల్లవాడికి కొన్ని బొమ్మలు ఇచ్చి ఆడుకోమని చెప్పి ఆ ఆట ద్వారా అతడి మూర్తిమత్వాన్ని అంచనావేస్తే అది ఎలాంటి పరీక్ష?

జ‌: స్థితి పరీక్ష

6. ఒక విద్యార్థి పరీక్షలో కాపీ కొట్టడానికి, వెళుతున్న రైలుపై రాళ్లు విసరడానికి, పక్క విద్యార్థి బ్యాగులోంచి పెన్సిళ్లు దొంగతనం చేయడానికి కారణభూతమైంది

జ‌: అచిత్తు
 

7. పై అధికారితో నిందనకు గురైన ఒక వ్యక్తి మరికొన్ని మంచి పనులు చేసి ఆ అధికారి మెప్పు పొందడానికి చేసే ప్రయత్నం

జ‌: పరిహారం
 

8. పిల్లలకు వివిధ వస్తువులను ఇచ్చి, వారు వాటితో ఆటలాడుతుండగా వారి ప్రవర్తనను అంచనా వేయడమనేది

జ‌: క్రీడా పద్ధతి
 

9. వికాస్‌కు మైదానానికి వెళ్లి ఆడుకోవాలని ఉన్నప్పటికీ దెబ్బలు తగిలించుకుంటాడని తల్లి వెళ్లనీయకపోవడం వల్ల అతడు కుంఠనానికి గురయ్యాడు. అతడికి కుంఠనాన్ని కలిగించిన కారకం ఎలాంటిది?

జ‌: మానసికమైంది
 

10. సంఘర్షణ అనేది

జ‌: మానసిక ఉద్వేగం
 

11. 'నల్లపిల్ల' అని అందరూ వెక్కిరించిన అమ్మాయి ఒక ప్రఖ్యాత వైద్యురాలిగా పేరు తెచ్చుకోవడం ఏ రక్షక తంత్రం?

జ‌: పరిహారం
 

12. ఒక విద్యార్థికి పిల్లిని పట్టుకోవాలని ఉంది. అది కరుస్తుందేమోనని భయంతో దగ్గరకు వెళ్లడానికి ఆలోచిస్తున్నాడు. ఇది ఏ రకమైన సంఘర్షణ?

జ‌: ఉపగమ - పరిహార
 

13. పరీక్ష సరిగా రాయలేకపోవడానికి కారణం అడగగా 'పరీక్షల వల్ల ఉపయోగం లేదు' అని కుర్రవాడు ఉపయోగించే తంత్రం

జ‌: హేతుకీకరణం
 

14. డీఎస్సీ కోచింగ్‌కు వెళ్లి చదువుకోవాలని ఉంది కానీ ఫీజు మాత్రం కట్టాలని లేదు. ఇలాంటి సందర్భంలో తను ఎదుర్కొంటున్న సంఘర్షణ?

జ‌: ఉపగమ - పరిహార
 

15. మానవుడిలో అన్ని గ్రంథులను నియంత్రించే గ్రంథిని ఏమని పిలుస్తారు?

జ‌: పీయూష గ్రంథి
 

16. 'స్ప్రేంజర్' ప్రకారం ''ఉద్యమ స్ఫూర్తితో, నాయకత్వ లక్షణాలతో సంఘసేవ చేస్తూ ఎల్లప్పుడూ ఏదీ ఆశించకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవచేసేవారు"

జ‌: సాంఘిక విలువలు ఉన్నవారు
 

17. దసరా పండగకు బంధువుల ఇంటికి వెళ్లిన వధూవరులు వారు చేసిన ఆహార పదార్థాలను తిని బాగాలేకపోయినా చాలా బాగా చేశారని చక్కగా ఉన్నాయని చెప్పడం

జ‌: ప్రతిచర్య నిర్మితి
 

18. ఐఏఎస్ కావాలనుకన్న ఉపాధ్యాయుడు తాను కాలేకపోయిన్పటికీ తన కొడుకు ఐఏఎస్ కావడంతో తానే సాధించినట్లు సంతృప్తి చెందడం అనేది ఏ రకమైన రక్షక తంత్రం?

జ‌: తదాత్మీకరణ
 

19. వరుణ్ అనే బాలుడిని అతడి తండ్రి ''ఎందుకు ఫస్ట్‌క్లాస్‌లో పాస్ కాలేదు" అని అడగగా ''మా తరగతిలో ఎవరూ ఫస్ట్‌క్లాస్‌లో పాస్ కాలేదు" అనడం ఏ రక్షక తంత్రం?

జ‌: దమనం
 

20. పదోతరగతి ఫెయిలైన అశ్విని అనే విద్యార్థిని ఇంటికి వచ్చి చిన్న పిల్లలా ఏడుస్తూ ప్రవర్తించడం అనేది ఏ రక్షక తంత్రంగా చెప్పవచ్చు?

జ‌: ప్రతిగమనం
 

21. సరిగా చదవని వ్యక్తి పరీక్ష రాయకుండా తప్పించుకోవడం

జ‌: ఉపసంహరణ
 

22. రెండుసార్లు డీఎస్సీ రాసి ఉపాధ్యాయుడు కాలేకపోయిన అతడిపై ప్రభావం చూపేది

జ‌: ఒత్తిడి
 

23. అవసరాలు, అవకాశాలకు మధ్య సమతూకం లోపించినప్పుడు వ్యక్తిలో ఏర్పడేది ఏది?

జ‌: విషమయోజనం

Posted Date : 01-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌