• facebook
  • whatsapp
  • telegram

తెలుగు సాహిత్యం

మాదిరి ప్ర‌శ్న‌లు 

1. శ్రీవాణీ గిరిజాశ్చిరాయదధతో.... అన్న ఆదిపద్యకర్త ఎవరు?
జ‌: నన్నయ

 

2. శారదరాత్రులుజ్జ్వల రసత్తర... అనే నన్నయ పద్యం కింది ఏ పర్వంలోనిది?
ఎ) ఆదిపర్వం           బి) సభాపర్వం             సి) అరణ్యపర్వం          డి) ఉద్యోగపర్వం
జ‌: సి (అరణ్యపర్వం )

 

3. నన్నయ పూర్తిచేసిన పర్వాల సంఖ్య
జ‌: 2

 

4. ఆంధ్రకవితా విశారధుడు అని నన్నయను కీర్తించినవారు
జ‌: తిక్కన

 

5. 'ఆంధ్రకవితాగురుడు' అని నన్నయను కీర్తించినవారు
జ‌: మారన

 

6. సారమతింగవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తి.... పద్యరచయిత
జ‌: నన్నయ

 

7. భారత భారతీసముద్రము దరియంగనీదను... పద్యరచయిత
జ‌: నన్నయ

 

8. గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్... పద్యరచయిత
జ‌: నన్నయ

 

9. భాషింతు నన్నయభట్టు మార్గంబున నుభయ వాక్ప్రౌడి... పద్యరచయిత
జ‌: శ్రీనాథుడు

 

10. బహువన పాదపాబ్ధికుల పర్వత... పద్య రచయిత
జ‌: నన్నయ

 

11. కిందివారిలో 'కవిరాక్షసుడు' అనే బిరుదు ఎవరిది?
ఎ) వేములవాడ భీమకవి                 బి) నారాయణభట్టు
సి) నన్నయ                                డి) మారన
జ‌: ఎ (వేములవాడ భీమకవి )

 

12. తెలుగులో వెలసిన మొదటి ఛందోలక్షణ గ్రంథం
జ‌: కవిజనాశ్రయం

 

13. 'కవిజనాశ్రయుడు, శ్రావకాభరణుడు' అనే బిరుదు ఉన్న కవి
జ‌: మల్లియ రేచన

 

14. 'వార్తయందు జగము వర్థిల్లుచున్నది' అన్న మహాకవి ఎవరు?
జ‌: నన్నయ

 

15. నుతజల పూరితంబులగు నూతులు నూఱింటికంటె... పద్య రచయిత
జ‌: నన్నయ

 

16. నన్నెచోడుడు ఏ శతాబ్దానికి చెందినవాడు?
జ‌: 12

 

17. 'కవిరాజశిఖామణి' అనే బిరుదు ఎవరిది?
జ‌: నన్నెచోడుడు

 

18. నన్నెచోడుడు 'వస్తుకావ్యాబ్జరవి' అని ఎవరిని పొగిడాడు?
జ‌: వాల్మీకిని

 

19. 'జాను తెనుగు, వస్తుకవిత, దేశీయమార్గము' అనే శబ్దాలను ప్రయోగించినవారు
జ‌: నన్నెచోడుడు

 

20. ప్రబంధ శబ్దాన్ని ప్రయోగించినవారిలో ప్రథముడు
జ‌: నన్నెచోడుడు

 

21. కిందివారిలో శివత్రయంలో లేనివారు
ఎ) పాల్కురికి సోమన                      బి) పండితారాధ్యుడు
సి) నన్నెచోడుడు                            డి) మల్లికార్జున పండితుడు
జ‌: డి (మల్లికార్జున పండితుడు)

 

22. 'బసవపురాణం'లోని ఆశ్వాసాల సంఖ్య
జ‌: 6

 

23. పాల్కురికి సోమనాథుడి అలభ్యకృతి
జ‌: మల్లమదేవి పురాణం

 

24. పాల్కురికి సోమన 'అనుభవసారాన్ని' ఎవరికి అంకితం ఇచ్చారు?
జ‌: గొడగి త్రిపురాంతకుడు

 

25. వృషాధిపా శతకంలోని మకుటం
జ‌: బసవా! బసవా! బసవా! వృషాధిపా

 

26. తెలుగు నుంచి సంస్కృతంలోకి అనువాదమైన సోమన రచన
జ‌: బసవ పురాణం

 

27. అల్పాక్షరములతో అనల్పార్థ రచన చేయగల సమర్థుడు ఎవరు?
జ‌: పాల్కురికి సోమన

 

28. 'తెలుగు తోటలో తెలుగుకోసం, తెలుగు ఛందస్సు ద్విపదలో పాటలు పాడిన కోకిల పాల్కురికి సోమన' అని ఎవరు అన్నారు?
జ‌: ఆరుద్ర

 

29. శివా, అజా, రుద్రా, మహేశా.... అనే మకుటంతో సాగే శతకం
జ‌: శివతత్త్వసారం

 

30. కిందివారిలో పండిత త్రయంలో లేనివారు
ఎ) శ్రీపతి పండితుడు                     బి) మంచన పండితుడు
సి) మల్లికార్జున పండితుడు              డి) పాల్కురికి
జ‌: సి (మల్లికార్జున పండితుడు)

 

31. 'నమశ్శివాయ' రగడను రచించింది
జ‌: చక్రపాణి రంగన

 

32. సర్వేశ్వర శతకాన్ని రచించింది ఎవరు?
జ‌: యథావాక్కుల అన్నమయ్య

 

33. 'కావ్యాలంకార చూడామణి' అనే అలంకార గ్రంథ్రాన్ని రచించింది
జ‌: విన్నకోట పెద్దన

Posted Date : 09-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌