• facebook
  • whatsapp
  • telegram

పాండిత్య సాధన నికష నిర్మాణం, నిర్వహణ, విశ్లేషణ

1. మూల్యాంకన ప్రక్రియలో ఎన్ని ఉప ప్రక్రియలు ఉంటాయి?
జ: నాలుగు

 

2. పాండిత్యరంగంలో విద్యార్థుల వికాస మాపనానికి ఉపయోగించే సాధనం ఏది?
i) నియోజనాలు                 ii) పరీక్షలు                     iii) ప్రాజెక్టులు
1) i, ii               2) ii, iii               3) i, iii               4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

3. విద్యార్థులకు 'ఆకారాల వర్గీకరణ' అనే పాఠ్యాంశం చెప్పే ముందు వివిధ వస్తువుల ఆకారాలు గీయమని చెప్పడం ఏ నియోజనాన్ని సూచిస్తుంది?
జ: పాఠానికి ముందు తయారీ (Preparation part)

 

4. తరగతిగదిలో బోధించిన పాఠ్యాంశానికి చెందిన సూత్రాలు, నిర్మాణాలు, సమస్య సాధన పద్ధతులను అభ్యసనం చేయడానికి ఉపయోగించే నియోజనం ఏది?
జ: సాధన చేయాల్సిన భాగం

 

5. విద్యార్థుల భాషా నైపుణ్యాలను, విషయాన్ని క్రమపద్ధతిలో తర్కబద్ధంగా, హేతుబద్ధంగా వివరించడానికి ఉపయోగపడే ప్రశ్నలు
జ: వ్యాసరూప ప్రశ్నలు

 

6. విద్యార్థుల మనోగణనను పరీక్షించడానికి ఉపయోగపడే పరీక్షలు
జ: మౌఖిక పరీక్షలు

 

7. ఒక చతురస్ర వైశాల్యం = ......... అనే ప్రశ్న ఏ లఘు సమాధాన ప్రశ్నకు చెందుతుంది?
జ: పూరణం

 

8. విద్యార్థి కౌశలాలను, అనుప్రయుక్తానికి సంబంధించిన లక్ష్యాలను మాపనం చేయడానికి ఉపయోగపడే పరీక్ష
జ: ప్రయోగ పరీక్ష

 

9. ప్రశ్నావళి బ్యాంకు వల్ల ప్రయోజనం
i) విద్యార్థుల ప్రమాణాల మెరుగుదలను తెలుసుకోవచ్చు.
ii) సమయం ఆదా అవుతుంది.
iii) పరీక్షలకు సప్రమాణత ఉంటుంది.
iv) విద్యార్థులకు ప్రశ్న జవాబులను ఊహించే అవకాశం ఉంటుంది.
జ: i, ii, iii

10. కిందివాటిలో మౌఖిక పరీక్ష కానిది ఏది?
1) పదో ఎక్కం చెప్పమనడం                     2) ఇచ్చిన గోళీలను లెక్కించమనడం
3) 20 లోపు ఉండే ప్రధానసంఖ్యలను తెలపమనడం         4) 2 గుణిజాలు చెప్పమనడం
జ: 2 (ఇచ్చిన గోళీలను లెక్కించమనడం)

 

11. కిందివాటిలో గణితానికి సంబంధించి ఇవ్వదగిన ప్రాజెక్టు ఏది?
1) నమూనా గడియారం తయారుచేయమనడం
2) పాఠశాలలో వివిధ తరగతుల విద్యార్థుల సంఖ్యను వృత్తరేఖా చిత్రంలో చూపమనడం
3) మార్కెట్‌కి వెళ్లి కూరగాయల ధరల పట్టికను తయారుచేయమనడం
4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

12. ఉపాధ్యాయుడు తరగతిగదిలో తరచూ విషయానికి చెందిన కొన్ని ప్రశ్నలు అడిగి విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టడం ద్వారా వారి ప్రగతిని అంచనా వేయడానికి ఉపయోగపడే పరీక్షలు?
జ: మౌఖిక పరీక్షలు

 

13. 'రోజు, గంట, కిలోగ్రామ్, నిమిషం, సెకను' అనే వరుస క్రమానికి చెందని అంశమేది? అనేది ఏ విషయనిష్ఠ ప్రశ్నకు చెందుతుంది?
జ: వర్గీకరణ రూపం

 

14. 'దీర్ఘచతురస్రం : l × b : : చతురస్రం : .........' అనేది ఏ రకపు లఘు సమాధాన ప్రశ్న?
జ: సాదృశ్య రూపం

 

15. 'ఎక్కాలను పదేపదే రాయించడం' అనేది ఏ నియోజనం?
జ: సాధన చేయాల్సిన భాగం

Posted Date : 01-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌