• facebook
  • whatsapp
  • telegram

బోధనా ప్రణాళిక (Instructional Planning)

1. ఒక తరగతికి సంబంధించి గణిత ఉపాధ్యాయుడు బోధించాల్సిన విషయాన్ని ఏ యూనిట్‌ను ఏ నెలలో, ఎంతమేరకు బోధించాలో తెలుసుకోవడానికి ఉపయోగపడే పథకం
జ: వార్షిక పథకం

 

2. బోధించాల్సిన యూనిట్‌లో విద్యార్థి ఏ దశలో ఉన్నాడో తెలుసుకుని, ఉపాధ్యాయుడు అక్కడి నుంచి ప్రారంభించడానికి వీలైతే అది యూనిట్‌లోని ఏ అంగాన్ని సూచిస్తుంది?
జ: నేపథ్యాన్ని కనుక్కోవడం

 

3. 'అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల సంబంధిత పెద్ద విషయ భాగమే యూనిట్' అని నిర్వచించినవారు
జ: ప్రెస్టన్

 

4. ప్రతి యూనిట్‌ను అర్థవంతమైన ఉపయూనిట్లుగా విభజించి, ఒక్కో ఉపయూనిట్‌ను పూర్తిచేయడానికి పట్టే కాలాన్ని నిర్ణయించినట్లయితే అది కిందివాటిలో దేన్ని సూచిస్తుంది?
1) వార్షిక పథకం           2) యూనిట్ పథకం           3) పాఠ్యపథకం           4) కాలనిర్ణయ పట్టిక
జ: 4 (కాలనిర్ణయ పట్టిక)

 

5. ఏ విద్యావేత్త సూచనల వల్ల పాఠ్యపథక రచన ఆవశ్యకత గుర్తింపు పొందింది? 
1) బ్లూమ్స్             2) బేకన్                   3) గిల్బర్ట్              4) హెర్బార్ట్
జ: 4 (హెర్బార్ట్)

 

6. పాఠ్యపథకంలో 'పునర్విమర్శ' అనే సోపానం కింది ఏ కృత్యాలకు చెందుతుంది?



1) ప్రవేశ వ్యాసక్తులు                                   
2) పర్యవసాన వ్యాసక్తులు      
3) వికాస వ్యాసక్తులు                                 
4) ఉన్ముఖీకరణ వ్యాసక్తులు
జ: 2 ( పర్యవసాన వ్యాసక్తులు)

 

7. 8వ తరగతి బోధించే గణిత ఉపాధ్యాయుడు ముందు తరగతిలోని పాఠ్యవిషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని పూర్వ జ్ఞాన మూల్యాంకనం ద్వారా తెలుసుకున్నాడు. ఇది పాఠ్యపథక నమూనాలో ఏ దశను సూచిస్తుంది?
జ: ఉన్ముఖీకరణ వ్యాసక్తులు

 

8. హెర్బార్ట్ పాఠ్యపథక రచనలో 4వ సోపానం ఏమిటి?
జ: సాధారణీకరణం

 

9. కిందివాటిలో సాధారణీకరణం కానిది
1)                     
2) వృత్తంలో వ్యాసార్ధాలన్నీ సమానం
3) సమాంతర రేఖల వాలులు సమానం                 
4) బేసి సంఖ్య, సరిసంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ సరిసంఖ్యయే.

జ: 1 ()

 

10. మనదేశంలో బరోడాలోని ఏ సంస్థలో సూక్ష్మబోధనపై పరిశోధనలు జరిగాయి?
జ: CASE

 

11. విద్యార్థి ఒక విషయంపై నిర్వచనాలు, సూత్రాలు మొదలైన అంశాలను స్వయంగా అవగాహన
చేసుకోవడానికి ప్రయత్నించడం - హెర్బార్ట్ ప్రకారం పాఠ్యపథక రచన దశల్లో దేన్ని సూచిస్తుంది?
జ: సాధారణీకరణం

 

12. పాఠ్యపథకం వల్ల ప్రయోజనం
1) నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవచ్చు                 2) పాఠ్యబోధన ఆసిక్తికరంగా ఉంటుంది
3) మూల్యాంకనం క్రమబద్ధంగా జరుగుతుంది          4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

13. 10వ తరగతి బోధించే గణిత ఉపాధ్యాయుడు 'రేఖాగణితం' అనే యూనిట్‌లో పైథాగరస్ సిద్ధాంతాన్ని బోధించిన తర్వాత దానిపై ఒక నియోజనాన్ని ఇచ్చాడు. ఇది ప్రస్తుతం అమల్లో ఉన్న పాఠ్యపథక నమూనాలో ఏ దశను సూచిస్తుంది?
జ: పర్యవసాన వ్యాసక్తులు

 

14. కిందివాటిలో దీర్ఘకాలిక ప్రణాళిక
1) పాఠ్యపథకం            2) యూనిట్ పథకం           3) వార్షిక పథకం            4) పైవన్నీ
జ: 3 (వార్షిక పథకం)

 

15. పాఠ్యబోధనకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిర్ణయించి, ఆత్మస్థైర్యంతో బోధించడానికి ఉపాధ్యాయుడికి ఉపయోగపడే పథకం
జ: పాఠ్యపథకం

Posted Date : 01-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌