• facebook
  • whatsapp
  • telegram

గణితశాస్త్ర పథక రచన

1. కిందివాటిలో వార్షిక పథకంలోని అంశం?

   1) ఏ నెలలో పూర్తి చేయాలి             2) యూనిట్లు 

   3) కేటాయించిన పీరియడ్‌ల సంఖ్య       4) అన్నీ

జ: 4 (అన్నీ)
 

2. సాధారణంగా ఉపాధ్యాయుడు తరగతి గదిలో అవలంభించే విధానం?

జ: సమగ్ర పాఠ్యప్రణాళిక
 

3. వార్షిక పథకాన్ని తయారు చేసేటప్పుడు ఉపాధ్యాయుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశం?

   1) ఒక్కో యూనిట్‌ను బోధించడానికి పట్టే పీరియడ్ల సంఖ్య     2) ఉపాధ్యాయుడి సెలవులు 

   3) ఒక్కో నెలలో లభ్యమయ్యే పీరియడ్ల సంఖ్య               4) అన్నీ

జ: 4 (అన్నీ)
 

4. పాఠ్యప్రణాళిక పునర్విమర్శ అనే సోపానం కింది ఏ కృత్యాలకు చెందుతుంది?

జ: సమ్మిళిత కృత్యాలు
 

5. 'ఒక సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపరనే యూనిట్' అన్నవారు?

జ: హెర్బార్ట్
 

6. ఉపాధ్యాయులు సంవత్సరకాలంలో పూర్తిచేయాల్సిన అంశాలను దృష్టిలో ఉంచుకొని తమకు కేటాయించిన పీరియడ్‌ల ఆధారంగా తయారుచేసే పథకం?

జ: యూనిట్ పథకం
 

7. హెర్బార్ట్ పాఠ్యపథక రచనలో సూచించిన సోపానాల సంఖ్య?

జ: 6
 

8. కిందివాటిలో దీర్ఘకాలిక ప్రణాళిక?

   1) పాఠ్య పథకం      2) యూనిట్ పథకం   3) వార్షిక పథకం     4) బోధన ప్రణాళిక

జ: 3 (వార్షిక పథకం)
 

9. విద్యార్థుల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా శ్రద్ధతో ఎన్నుకున్న విషయ బాహ్య స్వరూపమే యూనిట్ అన్నవారు?

జ: సాంపోర్టు
 

10. టైమ్ షెడ్యూల్ చార్ట్‌లో పేర్కొన్న అంశం?

జ: సబ్ యూనిట్, సబ్ యూనిట్‌కు కేటాయించిన పీరియడ్‌ల సంఖ్య
 

11. కిందివాటిలో పాఠ్యపథకంలోని సోపానానికి చెందనిది?

    1) విషయ విశ్లేషణ         2) నల్లబల్ల పని

    3) సబ్ యూనిట్లు         4) విద్యార్థి ఉపాధ్యాయుడి కృత్యాలు

జ: 3 (సబ్ యూనిట్లు)
 

12. కిందివాటిలో యూనిట్‌లోని అంగం?

    1) ప్రేరణ     2) సంకీర్ణ దృష్టి    3) నేపథ్యాన్ని కనుక్కోవడం  4) అన్నీ

జ: 4 (అన్నీ)
 

13. సమీప భవిష్యత్తులో చేసే చర్య కోసమే రూపొందించిన పథకం లేదా మార్గదర్శిని ఏమంటారు?

జ: పాఠ్య పథకం
 

14. కిందివాటిలో పాఠ్య పథకంలోని సోపానం?

    1) నల్లబల్ల పని     2) మూల్యాంకనం     3) బోధన అభ్యసన సామగ్రి       4) అన్నీ

జ: 4 (అన్నీ)
 

15. పాఠ్యపథక రచనకు ఎవరి సూచనలతో గుర్తింపు వచ్చింది?

జ: జె.ఎఫ్. హెర్బార్ట్
 

16. కిందివాటిలో పాఠ్యపథకంలోని సోపానం?

    1) లక్ష్యాలు - స్పష్టీకరణలు                    2) విషయ విశ్లేషణ 

    3) ఉపాధ్యాయ కృత్యం - విద్యార్థి కృత్యం        4) అన్నీ

జ: 2 (విషయ విశ్లేషణ)
 

17. పాఠ్య ప్రణాళికలోని పునర్విమర్శ అనే సోపానం ఏ రకమైన మూల్యాంకనం?

జ: సంకలన మూల్యాంకనం
 

18. కిందివాటిలో హెర్బార్ట్ పాఠ్యపథక దశలో లేనిది?

    1) సన్నాహం    2) మూల్యాంకనం    3) సమర్పణ         4) సంసర్గం

జ: 2 (మూల్యాంకనం)
 

19. వార్షిక పథక రచన అంతా దేనిపై ఆధారపడి ఉంటుంది?
జ: యూనిట్
 

20. హెర్బార్ట్ పాఠ్యపథక దశలు?
జ: ఆరు
 

21. కిందివాటిలో విషయంలోని ఒక పెద్ద భాగం అని దేన్ని అంటారు?
    1) యూనిట్     2) సబ్ యూనిట్    3) విద్యాప్రణాళిక      4) పాఠ్యపథకం
జ: 1 (యూనిట్)
 

22. బోధనా విధానానికి అతి ముఖ్యమైంది?
జ: పాఠ్య పథకం
 

23. ఒక ఉపాధ్యాయుడు దేన్ని రూపొందించకుండా పాఠాన్ని బోధిస్తే అతడు ఎంత సమర్థుడైనప్పటికీ ఆశించిన లక్ష్యాలను సాధించలేడు?
జ: పాఠ్య పథకం
 

24. ప్రతి పాఠానికి తగిన పథకాన్ని తయారు చేసుకోవడం దేనిలో ప్రథమ సోపానం?
జ: విద్యా లక్ష్య సాధన
 

25. వార్షిక పాఠ్య పథకం తయారు చేయడంలో మొదటి సోపానం?
జ: విషయాన్ని యూనిట్లుగా విభజించడం
 

26. 'అభ్యాసకుడు విహంగవీక్షణం చేయగల సంబంధిత పెద్ద విషయ భాగమే యూనిట్' అని నిర్వచించినవారు?
జ: ప్రెస్టెన్
 

27. లక్ష్యాలు, స్పష్టీకరణ, బోధనా వ్యూహాలు, పుస్తక సామగ్రి, మూల్యాంకన విధానం అన్నీ సమర్థంగా రూపొందించడానికి అవసరమైంది?
జ: యూనిట్ ప్రణాళిక
 

28. జె.ఎఫ్. హెర్బార్ట్ ప్రకారం పాఠ్యపథక రచనలో మొదటి సోపానం?
జ: సన్నాహం
 

29. వార్షిక ప్రణాళికను తయారు చేసేటప్పుడు వార్షిక పని దినాల సంఖ్య
జ: 220
 

30. 'పాఠ్యాంశం ఒక యూనిట్' అనే భావనపై ఆధారపడిన పద్ధతి?
జ: శీర్షికా పద్ధతి
 

31. పాఠ్య పథకంలో చివరి సోపానం?
జ: పునర్విమర్శ
 

32. కిందివాటిలో గణిత పాఠ్య పథకంలో చేరని అంశం?
    1) బోధనా విషయాలు             2) విషయాన్ని విశ్లేషణ చేసే యూనిట్లుగా విభజించడం
    3) విద్యార్థి చేయాల్సిన వ్యాసక్తులు  4) ఉపాధ్యాయుడు చేయాల్సిన వ్యాసక్తులు
జ: 2 (విషయాన్ని విశ్లేషణ చేసే యూనిట్లుగా విభజించడం)
 

33. హెర్బార్ట్ సోపానాల్లో మొదటిది?
జ: సంసర్గం
 

34. ఉపాధ్యాయుడు ఏ దశలో పాఠ్యాంశంలోని భావాలను ఒక తార్కిక క్రమంలో అమర్చి విద్యార్థులకు అందించడానికి ప్రయత్నిస్తాడు?
జ: సమర్పణ
 

35. పాఠ్య పథకాన్ని రూపొందించాల్సింది?
జ: ఉపాధ్యాయుడు
 

36. సన్నాహ దశను సమర్థంగా నిర్వహించడానికి ఉపాధ్యాయుడు కింది ఏ విధానాన్ని అవలంభించాలి?
    1) ప్రశ్నించడం          2) విద్యార్థుల్లో ఆసక్తి కలిగేలా చేయడం 
    3) కథలు చెప్పడం     4) అన్నీ
జ: 4 (అన్నీ)
 

37. పాఠ్య పథకంలో ఉన్ముఖీకరణం అనే సోపానం కింది ఏ కృత్యానికి చెందుతుంది?
    1) ప్రదర్శన     2) అభివృద్ధి    3) సమ్మిళిత     4) ప్రారంభ
జ: 4 (ప్రారంభ)
 

38. పాఠ్య బోధన సోపానాలను రూపొందించడం దేనిలో భాగం?
జ: సమర్పణ
 

39. పాఠ్యపథకంలో సామాన్యీకరణం అనే సోపానం కింది ఏ కృత్యానికి చెందుతుంది?
    1) ప్రదర్శన      2) అభివృద్ధి    3) ప్రారంభ      4) సమ్మిళిత
జ: 1 (ప్రదర్శన)
 

40. పాఠశాలలో సాధారణంగా ఉపాధ్యాయుడు తాను తరగతి గదిలో అవలంభించాల్సిన విధానాన్ని ఏదో ఒకరీతిలో ముందుగా తయారు చేసుకోవడాన్ని ఏమంటారు?
జ: టీచింగ్ నోట్స్
 

41. హెర్బార్ట్ పాఠ్యపథక రచనలో మూడో సోపానం?
జ: పునర్విమర్శ
 

42. కిందివాటిలో యూనిట్‌లోని భాగం కానిది?
    1) పూర్వజ్ఞాన పరిశీలన     2) ప్రేరణ    3) నేపథ్యాన్ని కనుక్కోవడం  4) సంకీర్ణ దృష్టి
జ: 1 (పూర్వజ్ఞాన పరిశీలన)
 

43. యూనిట్ పథకాన్ని తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన ముఖ్యాంశాల్లో లేనిది?
    1) సబ్‌యూనిట్‌లు              2) యూనిట్‌కు కేటాయించిన పీరియడ్‌ల సంఖ్య
    3) విద్యార్థుల పూర్వజ్ఞానం        4) సెలవులు
జ: 3 (విద్యార్థుల పూర్వజ్ఞానం)
 

44. కిందివాటిలో స్వల్పకాలిక ప్రణాళిక?
    1) వార్షిక పథకం      2) సంస్థాగత పథకం    3) అర్ధ వార్షిక పథకం     4) యూనిట్ పథకం
జ: 4 (యూనిట్ పథకం)
 

45. యూనిట్ పథకం తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన ముఖ్యాంశాలు?
    1) మాల్యాంకన విధానాలు        2) యూనిట్ల లక్ష్యాలు, స్పష్టీకరణలు
    3) యూనిట్‌లోని విషయం      4) అన్నీ
జ: 4 (అన్నీ)
 

46. ఒక సంవత్సర కాలంలో బోధించాల్సిన విషయాన్ని సూచించే పథకం?
జ: వార్షిక పథకం
 

47. 'ఉపాధ్యాయుడు పాఠ్యాంశంలోని భావాలను ఒక తార్కిక క్రమంలో అమర్చి విద్యార్థులకు అందించడానికి ప్రయత్నిస్తాడు'. అనేది హెర్బార్ట్ పాఠ్యపథక రచనలో ఏ సోపానం?
జ: సమర్పణ
 

48. ప్రతి యూనిట్‌ను అర్థవంతమైన ఉప యూనిట్‌గా విభజించిన తర్వాత ఒక్కో ఉప యూనిట్‌ను పూర్తిచేయడానికి పట్టే పీరియడ్ల సంఖ్యను నిర్ణయించడానికి తయారుచేసే పట్టిక?
జ: కాల నిర్ణయ పట్టిక
 

49. 'ఉపాధ్యాయుడు తాను బోధించే పాఠానికి సంబంధించిన పూర్వజ్ఞానాన్ని విద్యార్థుల నుంచి ప్రశ్నల ద్వారా రాబడతాడు' ఇది హెర్బార్ట్ పాఠ్యపథకం రచనలో ఏ సోపానానికి చెందింది?
జ: సన్నాహం
 

గత టెట్, డీఎస్సీలో అడిగిన ప్రశ్నలు


50. వార్షిక పథకం తయారుచేయడంలో ప్రధాన సోపానంలో చేరనివి?
జ: యూనిట్‌ను బోధించడానికి విద్యార్థి పూర్వజ్ఞానం.
 

51. పాఠ్యప్రణాళికలో 'పునర్విమర్శ' అనే సోపానం కింది ఏ కృత్యాలకు చేరుతుంది?
జ: సమ్మిళిత కృత్యాలు
 

52. గణిత పాఠ్యపథకంలో చేరని అంశం?
జ: విషయాన్ని విశ్లేషణ చేసే యూనిట్లుగా విభజించడం
 

53. బోధన - పునఃబోధన వలయం అనే బోధన పద్ధతి?
జ: మైక్రో టీచింగ్
 

54. చతుర్భుజాల గురించి బోధించడానికి వివిధ వస్తువుల ఆకారాలు, కొలతలపై విద్యార్థికి ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించుకునే పాఠ్యపథకంలోని సోపానం?
జ: సాధారణీకరణం
 

55. బోధనోపకరణాల్లో చార్టుల ఉపయోగం?
జ: సూత్రాలు, నిర్వచనాలు నమోదు చేసి, పునశ్చరణ చేయడానికి వీలవుతుంది.
 

56. సెకండరీ పాఠశాలలో గణిత బోధనకు ఉపన్యాస పద్ధతి ఉపయోగించిన పాఠ్యాంశం?
జ: గణిత శాస్త్ర మూలాధారాలు
 

57. విషయ బోధన కోసం పాఠ్యపథక నిర్మాణం చేసిన విద్యావేత్త?
జ: హెర్బార్ట్
 

58. పూర్తిగా నియోజనాలపై ఆధారపడిన గణిత విద్యా ప్రణాళిక పథకం?
జ: డాల్టన్ పథకం
 

59. పాఠ్యపథక రచన ఆవశ్యకత కింది ఏ విద్యావేత్త సూచనల వల్ల గుర్తింపు పొందింది?
జ: హెర్బార్ట్

Posted Date : 28-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌