• facebook
  • whatsapp
  • telegram

లాభ నష్టాలు 

లాభం = అమ్మినవెల - కొన్నవెల
నష్టం = కొన్నవెల - అమ్మినవెల






 

రుసుము = ప్రకటనవెల - అమ్మినవెల


 

1. ఒక వస్తువు కొన్నవెల రూ.250, అమ్మినవెల రూ.300 అయితే లాభశాతం ఎంత?
జ: 20%
వివరణ: లాభం = అమ్మినవెల - కొన్నవెల
                       = 300 - 250
                       = 50

2. ఒక వస్తువు కొన్నవెల రూ.15, అమ్మినవెల రూ.10. అయితే నష్టశాతం ఎంత?
జ: 33  1/3%
వివరణ: నష్టం = కొన్నవెల - అమ్మినవెల
                      = 15 - 10 
                      = 5

3. ఒక రేడియో కొన్నవెల రూ.1250. దీన్ని 10% లాభానికి అమ్మితే అమ్మినవెల ఎంత?
జ: రూ. 1375
వివరణ:

సూక్ష్మపద్ధతి:  కొన్నవెలను 100% గా పరిగణిస్తే అమ్మినవెల అంటే 110% కనుక్కోవాలి.
100% = 1250 అయితే
110%  = ?

4. ఒక స్కూటరు కొన్నవెల రూ.26000. దీన్ని 15% నష్టానికి అమ్మితే అమ్మిన వెల ఎంత?
జ: రూ. 22,100
వివరణ: 

సూక్ష్మపద్ధతి:  కొన్నవెల 100% = 26000
                     అమ్మినవెల 85% = ?

5. ఒక వ్యక్తి పుస్తకాన్ని రూ.40.60 పైసలకు అమ్మితే 16% లాభం పొందాడు. అయితే కొన్నవెల ఎంత?
జ: రూ. 35 
వివరణ: 


సూక్ష్మపద్ధతి: అమ్మినవెల 116% = 40.60
              కొన్నవెల 100% = ?
 
 

6. లాభం 25% అయితే కొన్నవెలను ఏ భిన్నంతో గుణిస్తే, అమ్మినవెల వస్తుంది?
జ:  5/4
వివరణ: 

7. ఒక శీతల యంత్రం ఖరీదు ఏటా కిందటి సంవత్సరం ఖరీదు కంటే 10% పెరుగుతుంది. ప్రస్తుత ఖరీదు రూ.16200 అయితే 2 సంవత్సరాల తర్వాత దాని ఖరీదు ఎంత?
జ: రూ. 19,360
వివరణ:
వస్తువు ఖరీదు =   
ఇక్కడ P = ప్రస్తుత ఖరీదు, r = పెరుగుదల శాతం, n = సంవత్సరాల సంఖ్య 
 ... 2 సంవత్సరాల తర్వాత దాని ఖరీదు


8. P ఒక వస్తువును 25% లాభంతో Q కు అమ్మాడు. Q దాన్ని 15% నష్టంతో Rకు అమ్మాడు. R దాన్ని 20% లాభానికి Sకు అమ్మాడు. S దాన్ని రూ.204 కు కొన్నాడు. అయితే P ఆ వస్తువును ఎంతకు కొన్నాడు?
జ:  రూ. 160 
వివరణ:  P కొన్నవెల = రూ.x అనుకుంటే,,

9. ఒక వ్యక్తి రెండు పుస్తకాలను ఒక్కొక్కటి రూ.40కు అమ్మాడు. మొదటిదానిపై 20% నష్టం, రెండోదానిపై 20% లాభం పొందాడు. మొత్తం మీద అతడికి ఎంత శాతం నష్టం లేదా ఎంతశాతం లాభం వచ్చింది?
జ:  4%
వివరణ: ఒకే సంఖ్యగా లాభశాతం, నష్టశాతం ఉన్నప్పుడు 

10. ఒక వస్తువు ప్రకటన వెల రూ.20, రుసుము రూ.2 అయితే రుసుము శాతం ఎంత?
జ:  10%
వివరణ: 

                          


 

11. ఒక సైకిలు ప్రకటన వెల రూ.1280. 10% రుసుము ఇచ్చి అమ్మితే రూ.72 లాభం వస్తుంది. కొన్నవెల ఎంత?
జ:  రూ. 1080 
వివరణ: అమ్మినవెల అంటే ప్రకటన వెలలో 90%

 
..కొన్నవెల = అమ్మినవెల - లాభం 
          = 1152 - 72 = రూ.1080.
 

12. 10%, 20% రెండు వరుస డిస్కౌంట్‌లకు సమానమైన డిస్కౌంట్ ఎంత?
జ:  28%
వివరణ: కొన్నవెల = 100 అనుకుంటే

రుసుము శాతం = 100 - 72 = 28%
సూక్ష్మపద్ధతి:  x = 10, y = 20 అనుకోండి

Posted Date : 31-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌