• facebook
  • whatsapp
  • telegram

సైన్స్ బోధనాపద్ధతులు    

1. ఒక శీర్షికకు సంబంధించిన విషయాన్ని అంచెలంచెలుగా పాఠ్యప్రణాళికలో అభివృద్ధి చెందించే పద్ధతి-

జ: ఏకకేంద్ర పద్ధతి
 

2. అమెరికాలో 1962లో ఏర్పరచిన 'విజ్ఞాన శాస్త్రం - శాస్త్రీయ విధానం' రూపకర్త ఎవరు?

జ: జాన్. ఆర్. మేయర్
 

3. పాఠ్యాంశాలను బోధన సామగ్రి లభించే కాలాలకు అనుగుణంగా అమరుస్తూ పాఠ్యప్రణాళికను రూపొందించడం...

జ: రుతుక్రమ అమరిక విధానం
 

4. 'పాఠ్యప్రణాళికలో విద్యార్థులను ఇమడ్చడం కాకుండా, విద్యార్థుల కోసం పాఠ్యప్రణాళిక రూపుదిద్దుకోవాలి' అని పేర్కొన్నది?

జ: బ్రూబేకర్
 

5. యూనిట్ పద్ధతిని బాగా వృద్ధి చేసింది?

జ: మోరిసన్
 

6. పాఠ్యప్రణాళికలో ఉండేది-

1) సిలబస్      2) బోధనా పద్ధతులు   3) బోధన ఉపకరణాలు     4) పైవన్నీ

జ: 4
 

7. ప్రజాస్వామ్య సమాజంలో సమర్థవంతంగా జీవించడానికి కొన్ని ప్రవర్తనా సామర్థ్యాలు అత్యావశ్యకం. ఈ ప్రవర్తనా సామర్థ్యాలను వృద్ధిచేసే అభ్యసనానుభవాల సమూహం

జ: మూల పాఠ్యప్రణాళిక
 

8. విద్యార్థుల వ్యక్తిగత విభేదాలను కూడా దృష్టిలో ఉంచుకుని అబ్బాయిలకు, అమ్మాయిలకు, గ్రామీణ, పట్టణప్రాంత విద్యార్థులకు అనువుగా పాఠ్య ప్రణాళిక ఉండాలని తెలిపే సూత్రం?

జ: నమ్యత, వైవిధ్యతా సూత్రం

9. పరిశోధనల ఆధారంగా పాఠ్యప్రణాళికలో తరచూ మార్పులుండాలని పేర్కొన్నది?

జ: కొఠారీ
 

10. పాఠ్య ప్రణాళిక విస్తృత పరిధిలో ఉండాలని పేర్కొన్నది?

జ: కొఠారీ
 

11. పాఠ్యప్రణాళిక పాఠ్యపుస్తకాలకే పరిమితమై పట్టణప్రాంత వాసులకు తగినట్లుగా పని చేయడానికి వీలులేనిదిగా ఉందని విమర్శించింది ఎవరు?

జ: ఈశ్వరీభాయ్ పటేల్
 

12. పాఠ్యప్రణాళిక విద్యార్థులలో సమస్య పరిష్కార శక్తులను పెంపొందించేదిగా, స్వయంగా నిర్ణయాలను తీసుకోవడంలో నైపుణ్యాన్ని పెంపొందించేదిగా ఉండాలని పేర్కొన్నది-

జ: 1986 జాతీయ విద్యావిధానం
 

13. జాతీయ సమగ్ర పాఠ్యప్రణాళికలో జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించడానికి సైన్స్ పాఠ్యప్రణాళిక నుంచి చేర్చిన అంశం?

జ: చిన్న కుటుంబ భావన

14. సైన్స్ పురోగమనం వల్ల పాఠశాలలకు, విశ్వవిద్యాలయాలకు మధ్య ప్రధానమైన విద్యా విషయాల్లో దూరం బాగా పెరిగిందని పేర్కొన్నది?

జ: కొఠారీ

Posted Date : 10-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌