• facebook
  • whatsapp
  • telegram

విజ్ఞానశాస్త్రం - విభాగాలు  

విజ్ఞానశాస్త్రం నిర్వచనాలు:

* 'మనం ఎంపిక చేసుకున్న అంశాన్ని ఒక క్రమ పద్ధతిలో పాటిస్తూ ప్రయోగాల ద్వారా నిర్ధారణ చేసుకుంటూ జ్ఞానాన్ని పొందడం'.

* ప్రకృతిలో దాగి ఉన్న రహస్యాలు, నిజాలు, కారణాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే మార్గమే విజ్ఞాన శాస్త్రం.

పర్యావరణ శాస్త్రవేత్తలు (Ecologists): వివిధ ఆవరణ వ్యవస్థల్లో నివసించే జీవజాతుల గురించి అధ్యయనం చేసేవారు.

భూగర్భ శాస్త్రవేత్తలు (Geologists): భూమి పొరల నుంచి బయటపడే శిలాజాలు, ఖనిజాల గురించి అధ్యయనం చేసేవారు.

ఖగోళ శాస్త్రవేత్తలు (Astrophysicists): ఆకాశంలో మిలమిల మెరిసే నక్షత్రాలు, గ్రహాలు, పాలపుంతల గురించి అధ్యయనం చేసేవారు.

వాతావరణ శాస్త్రవేత్తలు (Climatologists): వాతావరణంలోకి బెలూన్లను పంపి వర్షాలు, మేఘాల సమాచారాన్ని అధ్యయనం చేసేవారు.

రసాయన శాస్త్రవేత్తలు (Chemists): వివిధ ఉష్ణోగ్రతల వద్ద రసాయన చర్యా వేగాలను అధ్యయనం చేసేవారు.

అణు భౌతిక శాస్త్రవేత్తలు (Nuclear Physicists): వృత్తాకార మార్గంలో చలించే వస్తువుల వేగాలను కొలిచేవారు.

జీవ శాస్త్రవేత్తలు (Biologists): వివిధ ఉద్దీపనలకు లోనయ్యే కణజాల ప్రతిచర్యలను పరిశీలించేవారు.
               
               
* జ్ఞానాన్ని సముపార్జన చేసే విధానాన్ని తెలిపేదే సైన్స్.

* సైన్స్ ద్వారా ఏర్పడిన జ్ఞానం నిరంతరంగా మార్పు చెందుతుంది.

* 'సరిదిద్దిన తప్పుల చరిత్రను సైన్స్ అంటారు' - కార్ల్ పాపర్

* 'నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తుంటాను' - ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
 

శాస్త్రీయ పద్ధతి - పరిశోధన ప్రణాళిక:

* నూతన విషయాలను బయటపెట్టడంలో శాస్త్రవేత్త అనుసరించే విధానమే శాస్త్రీయ పద్ధతి.

     
 

శాస్త్రీయ ప్రక్రియా నైపుణ్యాలు:

* ప్రయోగాలు నిర్వహించేటప్పుడు లేదా ప్రశ్నలకు జవాబులను కనుక్కునే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు వినియోగించే ఆలోచనా సరళులు ప్రక్రియా నైపుణ్యాలు.
 

ప్రక్రియా నైపుణ్యాలు:

1) పరిశీలించడం (Observation): వస్తువులు, సంఘటనలను గురించి నేర్చుకోవడంలో జ్ఞానేంద్రియాలను వాడటం.

2) పోల్చడం (Compare): వస్తువులు, సంఘటనల లక్షణాలు ఏ విధంగా ఒకేలా, వేరుగా ఉంటాయో కనుక్కోవడం.

3) వర్గీకరించడం (Classification): వస్తువులు, సంఘటనలను కొన్ని లక్షణాల ఆధారంగా చేసుకుని, వాటిని సమూహాలుగా, వర్గాలుగా విభజించడం.

4) కొలవడం (Measure): వస్తువుల లక్షణాలైన ద్రవ్యరాశి (Mass), పొడవు (Length), ఘన పరిమాణాలను (Volume or Capacity) గ్రాము, సెంటీమీటర్, లీటర్ల లాంటి ప్రమాణాలతో కొలుస్తారు. దీన్నే కొలవడం అంటారు.

5) సేకరించడం (Gather): ఫలితాలను ఊహించడానికి, నిర్ధారణకు రావడానికి పరిశీలన ద్వారా సేకరించిన సమాచారం దోహదపడుతుంది.

6) నమోదు చేయడం (Record): గ్రాఫ్‌లు, పట్టికల రూపంలో పరిశీలన జాబితాలను నోటు పుస్తకాల్లో నమోదు చేయడం.

7) ప్రదర్శించడం (Display): చార్ట్‌లు, పట్టికలు, గ్రాఫ్‌ల రూపంలో పరిశీలన పత్రాలను నోటు పుస్తకాల్లో నమోదు చేసి, వాటిని ప్రదర్శించాలి.

8) ఊహించడం (Predict): పరిశీలనలు లేదా అనుభవాల ఆధారంగా రాబోయే ఫలితాలను ఊహించడం.

9) నమూనా వినియోగం (Use a Model): ఏదైనా ఒక ఆలోచన, ఒక వస్తువు, ఒక అంశం ఎలా పనిచేస్తుందో అవగాహన చేసుకోవడానికి అదే లక్షణాలను పోలిన నమూనాను రూపొందించుకోవాలి.

10) ఊహించడం (Interpret): రూపొందించిన జాబితా ఆధారంగా ఫలితాలను ఊహించడం ద్వారా నిర్ధారించడం.

11) నిర్ధారించడం (Inference): పరిశీలనల ఆధారంగా ఫలితాలను నిర్ధారించడానికి, సంఘటనలను వివరించడానికి తార్కిక వివేచనను ఉపయోగించాలి.

12) పరికల్పన చేయడం (Hypothesis): ఊహించిన లేదా రాబోయే ఫలితాల గురించి వివరించడం.

13) ప్రణాళిక - ప్రయోగం నిర్వహించడం (Plan and conduct Experiment): పరికల్పనలను పరీక్షించడానికి అవసరమైన సోపానాలను గుర్తించి సేకరించిన దత్తాంశాల ఆధారంగా ప్రణాళిక ప్రకారం ప్రయోగం చేయాలి. సేకరించిన జాబితాలను నమోదు చేసి విశ్లేషించాలి.

14) చరరాశుల నియంత్రణ (Control Variables): ప్రయోగ ఫలితాలను ప్రభావితం చేసే కారకాలను గుర్తించి వాటిని నియంత్రించాలి. ఒక ప్రయోగంలో ఒక చరరాశిని మాత్రమే పరీక్షించాలి.

Posted Date : 28-09-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌