• facebook
  • whatsapp
  • telegram

భౌతికశాస్త్ర బోధన ఉద్దేశాలు, విలువలు  

జీవితంలో చాలా సంవత్సరాల తరువాత సాధించగలిగే గమ్యాలను 'ఉద్దేశాలు' అంటారు.
* విజ్ఞానశాస్త్రం ఒక విషయ విభాగంగా అభ్యాసకుడిలో సర్వాంగీణ వికాస అభివృద్ధికి, సమాజంలో ఒక ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది.
* విజ్ఞానశాస్త్రాన్ని అభ్యసించడం ద్వారా విద్యార్థి పొందే ప్రయోజనాలను, యోగ్యతలను తెలియపరిచేవే బోధనా విలువలు

 

ఉద్దేశాలు:
జ్ఞానవిషయాలను సముపార్జించడం: విజ్ఞానశాస్త్ర జ్ఞానం విద్యార్థి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధంగా, దానికి తగిన రీతిలో మలుచుకునే విధంగా, అవసరమైతే దాన్ని మార్చేవిధంగా అందించడం.
అనుకూలమైన అలవాట్లను అభివృద్ధి చేయడం: నిజాయతీ, కష్టపడి పనిచేసే తత్వం, సహనం, నిష్పక్షపాత తీర్పు, పట్టుదల లాంటి ఉత్తమ అలవాట్లను పెంపొందించడం.
విద్యార్థుల్లో అభిరుచి, అభినందనలను అభివృద్ధి చేయడం: పత్రికలను చదవడం, సైన్స్ క్లబ్‌లను నిర్వహించడం, సైన్స్ ప్రదర్శనలను ఏర్పాటుచేయడం లాంటి కృత్యాలను ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో అభిరుచి, అభినందనలను అభివృద్ధిచేయడం.
శాస్త్రీయ వైఖరుల అభివృద్ధి: విశాలభావం, నిర్దిష్ట విజ్ఞానంలో ఆకాంక్ష, సమస్యా పరిష్కారజ్ఞానం లాంటి శాస్త్రీయ వైఖరుల ప్రవర్తనలను, ప్రత్యేక అభ్యసనానుభవాలు ప్రయోగశాలకృత్యాలు, సహపాఠ్యక్రమాల ద్వారా పెంపొందించే ఉద్దేశం.
నైపుణ్యాల, సామర్థ్యాల అభివృద్ధి: పటాలు గీయడం, రీడింగులు తీసుకోవడం, ప్రయోగాలు చేయడం, నమూనాలు తయారుచేయడం లాంటి నైపుణ్యాలను, సమస్యను గుర్తించడం, విశ్లేషించడం, వివరించడం, సాధారణీకరించడం లాంటి సామర్థ్యాలను అభివృద్ధి పరిచేది.
భావి జీవితానికి భూమిక: విద్యార్థులు శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన వృత్తులను లేదా ఉద్యోగాలను ఎన్నుకోవడానికి ఉపయోగపడేది.
విరామ సమయ సద్వినియోగ ఉద్దేశం: చార్టులు గీయడం, నమూనాలు తయారుచేయడం, పరికరాలను తయారుచేయడం లాంటి కృత్యాలను చేపట్టేవిధంగా విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
మానవ కల్యాణానికి భౌతికశాస్త్ర విజ్ఞానాన్ని వినియోగించడం: విద్యార్థులు ప్రతి సమస్యను శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరించుకునేలా భౌతికశాస్త్ర జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి.
మంచి పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దటం: విద్యార్థుల్లో మూఢనమ్మకాలను తొలగించి, శాస్త్రీయ వైఖరులను పెంపొందిస్తూ మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి.

 

విజ్ఞానశాస్త్ర విలువలు
బౌద్ధిక విలువలు: విద్యార్థుల్లో అవగాహన, బుద్ధివికాసం, బుద్ధికుశలత, సత్యాన్వేషణ లాంటి బౌద్ధిక అంశాలను అభివృద్ధి చేస్తుంది.
ఉపయోగిత విలువలు: నిత్యజీవితంలో అవసరాలైన ఆహార, వైద్య, ఆరోగ్య, ఆర్థిక, వ్యాపార మొదలైన రంగాలన్నింటిలో విజ్ఞానశాస్త్రాన్ని ఉపయోగించుకోవడం.
వృత్తి విలువలు: భవిష్యత్తులో అనేక అంశాల్లో, వివిధ రకాలైన వృత్తులను ఎన్నుకునే విధంగా చేసి, స్వయంగా తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఉపయోగపడేది.
సాంస్కృతిక విలువలు: సాంస్కృతిక వికాసానికి, దోహదపడే అంశాలైన ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, ఆహార అవసరాలు, ఆలోచనా విధానంలో మార్పులు తీసుకురావడంతో పాటు, సాంస్కృతిక వారసత్వాన్ని నూతనతరాలకు అందించే విలువలు.
నైతిక విలువలు: నిజాయతీ, నిష్కపటం, నిష్పాక్షికంగా ఉండటం, నిర్భయం, నిస్వార్థం, ఓర్పు లాంటి నైతిక విలువలు పెంపొందించడం.
సౌందర్యాత్మక విలువలు: సృష్టిలోని విషయాలన్నింటిలో సౌష్టవం, సౌందర్యం, మృదుత్వం, రమణీయతలను పరిశీలించి, వాటిలో ఉన్న క్రమాన్ని, అమర్చిన విధానాన్ని చూసి అభినందిస్తూ, విలువలను పెంపొందించుకోవాలి.
క్రమశిక్షణ విలువలు: ప్రయోగశాలల్లో పనిచేయడం, రీడింగులను తీసుకోవడం, నమూనాలు తయారుచేయడం లాంటి పనుల ద్వారా క్రమశిక్షణ విలువలను పెంపొందించడం.
ఉత్తేజాన్ని కలిగించే విలువలు: శాస్త్రజ్ఞుల జీవిత చరిత్రలను చదవడం, వినడం ద్వారా శాస్త్ర పఠనం పట్ల ఆసక్తిని, ఉత్తేజాన్ని కలిగించడం.
విరామసమయ వ్యాపక విలువలు: విజ్ఞానశాస్త్ర పత్రికలు చదవడం, దినపత్రికల్లో, వార్తాపత్రికల్లో వచ్చే శాస్త్ర సంబంధమైన విషయాలను సేకరించడం, వివిధ నమూనాలు తయారుచేయడం లాంటి పనులద్వారా విరామ సమయ వ్యాపక విలువలను పెంపొందించడం.
శాస్త్రీయ వైఖరుల అభివృద్ధి విలువలు: లక్ష్యాత్మకత, హేతుబద్ధత, రుజుప్రవర్తన, నిశిత పరిశీలనలు, వినయం, అణకువ లాంటి శాస్త్రీయ వైఖరులను అభివృద్ధిపరిచే విలువలు.
సృజనాత్మక విలువలు: విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించే విలువలు.
ఉన్నత విద్యకు, జీవితానికి భూమిక: విజ్ఞానశాస్త్రం ద్వారా విద్యార్థుల భావిజీవితానికి కావాల్సిన విద్యను, పరిశోధనలు చేపట్టడానికి ఉపయోగపడుతుంది.

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌