• facebook
  • whatsapp
  • telegram

పోషణ

1. సెల్యులోజ్ ఒక -

జ: కార్బోహైడ్రేట్


2. ఒక గ్రాము గ్లూకోజ్ విడుదల చేసే శక్తి ఎంత?

జ: 4 కి.కా.


3. జీవశాస్త్రీయంగా పరిపూర్ణ ప్రొటీనులుండే పదార్థాలేవి?

జ: మాంసం, పాలు, గుడ్లు.


4. ఐరన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి?

జ: ఎనీమియా


5. గాయిటర్ దేని లోపం వల్ల వస్తుంది?

జ: అయోడిన్


6. ఏది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల్లో లోపాలు వస్తాయి?

జ: ఫ్లోరిన్


7. పాలలోని చక్కెరను ఏమంటారు?

జ: లాక్టోజ్


8. 20 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద కొవ్వు ఏ రూపంలో ఉంటుంది?

జ: ఘన రూపంలో

9. వనస్పతిని దేని నుంచి తయారు చేస్తారు?
జ: అసంతృప్త ఫాటీ ఆమ్లాల నుంచి


10. అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి-
జ: హైపో థైరాయిడిజమ్


11. శరీరంలో అధికంగా ఉండే కొవ్వు ఎక్కడ నిల్వ ఉంటుంది?
జ: ఎడిపోస్ కణజాలంలో


12. క్వాషియోర్కర్ అంటే -
జ: నిర్లక్ష్యానికి గురైన శిశువు


13. మెరాస్మస్ వ్యాధి దేని లోపం వల్ల వస్తుంది?
జ: ప్రొటీన్


14. రికెట్స్ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది?
జ: కాల్సిఫెరాల్


15. పైరిడాక్సిన్ అనేది ఏ విటమిన్ రసాయనిక నామం?
జ: B6


16. విటమిన్ 'C'లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి?
జ: స్కర్వీ

17. జపాన్ దేశ నావికుల్లో బెరి బెరి వ్యాధి రావడానికి కారణమేమిటి?
జ: పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల


18. రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యే విటమిన్ ఏది?
జ: విటమిన్ K


19. నిమ్మ, ఉసిరి, జామ ఫలాల్లో ఎక్కువగా ఉండే విటమిన్ ఏది?
జ: విటమిన్ C


20. కన్నీళ్లను ఉత్పత్తి చేసే గ్రంథులు ఏవి?
జ: లాక్రిమల్ గ్రంథులు


21. ఏ విటమిన్ లోపం వల్ల అలసట వస్తుంది?
జ: బయోటిన్


22. విటమిన్‌లను మొదటిసారిగా ఎవరు కనుక్కున్నారు?
జ: ఫంక్


23. బియ్యాన్ని పాలిష్ చేసినా, బాగా కడిగినా వాటిలోని ఏ విటమిన్‌ను కోల్పోతాం?
జ: విటమిన్ B1


24. పురుషుల్లో వంధ్యత్వాన్ని నివారించే విటమిన్ ఏది?
జ: విటమిన్ E

25. జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడుంది?
జ: హైదరాబాద్


26. వాహకం ద్వారా వ్వాప్తి చెందే వ్యాధులేవి?
జ: ప్లేగు, మలేరియా


27. శోషరస నాళాలు, శోషరస గ్రంథుల వాపు వల్ల వచ్చే వ్యాధి -
జ: బోదవ్యాధి


28. ప్లేగు వ్యాధి బ్యాక్టీరియాను వ్యాప్తి చెందించే వాహకం ఏది?
జ: ఎలుక


29. తట్టు వ్యాధిని మొదిటిసారిగా కనుక్కున్న వైద్యుడు?
జ: అబుబాకర్


30. బోదకాలు దేని వల్ల వస్తుంది?
జ: వుకరేరియా


31. చలి, తలనొప్పి, చెమట పట్టడం... ఏ వ్యాధి లక్షణాలు?
జ: మలేరియా


32. ఏ వ్యాధిలో కండరాలు బిగుసుకుపోతాయి?
జ: టెటనస్

33. ప్రథమ చికిత్సకు ఆద్యుడు -
జ: ఇస్‌మార్క్


34. సెయింట్ జాన్స్ అంబులెన్స్ సర్వీస్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
జ: 1879లో


35. ఏ రకం ఎముకల విరుపులో ఎముక చాలాచోట్ల విరుగుతుంది?
జ: విఖండిత ఎముకల విరుపు


36. ఎముక ఒంగుతుంది కానీ విరగదు. ఈ విరుపు పేరేంటి?
జ: లేత ఎముక విరుపు


37. పెద్దవారిలో అంధత్వానికి కారణాలు-
జ: డయాబెటిస్, నీటికాసులు, కంటి పొరలు.

Posted Date : 31-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌