• facebook
  • whatsapp
  • telegram

వృక్షరాజ్య వర్గీకరణ

1. తమ జీవితకాలంలో పుష్పాలను ఏర్పరచని మొక్కలేవి?
జ: క్రిప్టోగామ్స్


2. థాలోఫైటా మొక్కలైన శైవలాలు, శిలీంద్రాలలో ఉమ్మడి అంశం ఏది?
1) థాలస్ దేహం   2) నాన్ ఎంబ్రియోఫైట్స్ 3)  అట్రాఖియోఫైట్  4) పైవన్నీ
: 4 (పైవన్నీ)


3. హరితరహిత, పరపోషక థాలోఫైట్స్‌ను గుర్తించండి.
జ: ఫంజి


4. హరిత నాచు, రైజోపస్‌లలో కనిపించే జీవిత చక్రం?
జ: ఏకస్థితిక


5. కిందివాటిలో శిలీంద్రాలకు సంబంధించి సరైన అంశం?
1) హరితసహిత స్వయం పోషకాలు
2) ఉభయచర పుష్పించని మొక్కలు
3) ప్రథమ నిజమైన నేల మొక్కలు
4) నిర్జీవ సేంద్రియ పదార్థాలపై పెరుగుతాయి
జ: 4 (నిర్జీవ సేంద్రియ పదార్థాలపై పెరుగుతాయి)

6. కిందివాటిలో బ్రయోఫైట్స్‌కు సంబంధించి సరైంది?
1) సిద్ధబీజదం, సంయోగ బీజదాలు స్వయంపోషకాలు
2) సంయోగ బీజదం, సిద్ధబీజదంపై భౌతికంగా, పోషణరీత్యా ఆధారపడుతుంది
3) సిద్ధబీజదం భౌతికంగా, పోషణరీత్యా సంయోగ బీజదంపై ఆధారపడుతుంది
4) సిద్ధబీజదం ప్రబలమైన దశ
జ: 3(సిద్ధబీజదం భౌతికంగా, పోషణరీత్యా సంయోగ బీజదంపై ఆధారపడుతుంది)


7. కిందివాటిలో ప్రథమ నిజమైన నేల మొక్కను గుర్తించండి.
1) రైజోపస్     2) ప్యునేరియా    3) ఈక్విజిటం    4) సైకస్
జ: 3(ఈక్విజిటం)


8. టెరిడోఫైట్‌ల జీవిత చక్రంలో ప్రబలమైన దశ?
జ: సిద్ధబీజదం


9. కిందివాటిలో టెరిడోఫైట్‌లకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది?
1) నాళికా కణజాలయుతాలైన పుష్పించని మొక్కలు
2) పిండయుత పుష్పించని మొక్కలు
3) ఫలదీకరణకు నీటి అవసరం ఉండదు
4) వృక్షరాజ్య సరీసృపాలు
జ:   3(ఫలదీకరణకు నీటి అవసరం ఉండదు)

10. కిందివాటిలో దేన్ని స్పెర్మటోఫైట్‌గా పరిగణించరు?
1) సెలాజినెల్లా   2) నీటమ్    3) పైకస్    4) సైకస్
జ:  1 (సెలాజినెల్లా)


11 . కిందివాటిలో వివృత బీజాకు చెందిన సత్య ప్రవచనం ఏది?
1) అండాశయం, ఫలం లేని స్పెర్మటోఫైట్స్
2) వివృత బీజ మొక్కల్లో అంకురచ్ఛదం ఏకస్థితికం
3) సిద్ధబీజాశయ పత్రాల అమరికను శంకువులు అంటారు
4) అన్నీ సరైనవే
జ:  4 (అన్నీ సరైనవే)


12. కిందివాటిలో మైసీలియం దేహ నిర్మాణాన్ని కలిగి ఉండని శిలీంద్రం ఏది?
1) రైజోఫస్   2) అగారికస్    3) మ్యూకస్   4) ఈస్ట్
జ: 4 (ఈస్ట్)

రచయిత: బాబా ఫక్రుద్దీన్

Posted Date : 30-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌