• facebook
  • whatsapp
  • telegram

జీవరాశుల వర్గీకరణ

1. "కొన్ని నియమాల ఆధారంగా జీవులను వేర్వేరు వర్గాలుగా వేరు చేసి అమర్చే విధానం" ఏ శాస్త్ర పరిధిలోకి వస్తుంది?

జ: వర్గీకరణశాస్త్రం


2. జీవరాశులను గుర్తించి వర్గీకరించడానికి ప్రయత్నించిన తొలి వ్యక్తి?

జ: అరిస్టాటిల్


3. వర్గీకరణలో ప్రాథమిక ప్రమాణం (మూల ప్రమాణం)-

: జాతి


4. 'జాతులు' అనే పదాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవరు?

: జాన్ రే


5. జాతిని రెండు పేర్లతో పిలిచే ద్వినామీకరణ విధానాన్ని మొదటగా ప్రవేశపెట్టింది-

జ: గాస్పర్డ్ బాహీన్


6. లిన్నెయస్ వర్గీకరణలో భాగంగా జంతువుల మీద రాసిన గ్రంథం పేరేంటి?

జ: సిస్టమా నాచురె

7. 'వర్గీకరణ' అనే పదాన్ని మొదట ప్రతిపాదించింది

జ: ఎ.పి.డి. కండోల్


8. "దగ్గర పోలికలు కలిగి, ఒకదాంతో ఒకటి స్వేచ్ఛగా సంపర్కం జరుపుకునే జీవరాశుల సమూహమే"-

: జాతి


9. వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఎవరు?

: లిన్నెయస్


10. చింతచెట్టు శాస్త్రీయ నామం - 'టామరిండస్ ఇండికా L' - ఇందులో 'L' అనే అక్షరం దేన్ని సూచిస్తుంది?

జ: ఆ చెట్టుకు శాస్త్రీయ నామం పెట్టింది లిన్నెయస్


11. భారతదేశంలో అనుసరిస్తున్న మొక్కల వర్గీకరణ విధానం-

జ: బెంథామ్, హుకర్ విధానం


12. 'అతిపురాతనమైన జీవులు' ఉన్న రాజ్యమేది?

జ: మొనీరా


13. 'నాస్టాక్, అనబీనా' లాంటి జీవులున్న రాజ్యం?

జ: మొనీరా


14. 'సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్లు' అని వేటినంటారు?

జ: డయాటమ్స్

15. 'భూమిని శుభ్రపరిచే తోటీలని' వేటినంటారు?

జ: శిలీంద్రాలు


16. 'ట్రాఖియోఫైటా' వర్గంలో అతి ప్రాథమికాలు

జ: ఫెర్న్‌లు


17. 'మూన్ జెల్లీ'లు కింది ఏ వర్గానికి చెందిన జీవులు?

ఎ) ఫొరిఫెరా               బి) టీనోఫోరా                సి) సీలెంటిరేటా            డి) అనెలిడా

జ: టీనోఫోరా


18. ఒక శాస్త్రవేత్త తన పరిశోధనల కోసం HCl లాంటి ఆమ్లమాధ్యమంలో కూడా నివసించగలిగే ఏకకణ జీవులను ఎన్నుకున్నాడు. అవి ఏ రాజ్యానికి చెందినవి?

జ: మొనీరా


19. కిందివాటిలో నిర్దిష్ట కేంద్రకం ఉన్న ఏకకణ జీవులను గుర్తించండి.

ఎ) మొనీరా               బి) మెటాఫైటా              సి) మెటాజోవా             డి) ప్రొటిస్టా

జ: ప్రొటిస్టా


20. 'అత్యధిక వైవిధ్యం' చూపే జీవులు కింది ఏ రాజ్యానికి చెందుతాయి?

ఎ) మొనీరా                బి) ప్రొటిస్టా                  సి) ప్లాంటే                    డి) అనిమేలియా

జ: అనిమేలియా


21. వర్గీకరణ శాస్త్రం ఏ విషయంలో ఉపయోగపడదు?

జ: జీవులలో వ్యాధుల వల్ల కలిగే మార్పులను అధ్యయనం చేయడానికి

Posted Date : 04-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌