1. పుస్తకానికి, కంటికి మధ్య దూరం ఎంత ఉండాలి?
జ: 30 మి.మీ.
2. నేత్రదానంలో కంటి నుంచి దేన్ని సేకరిస్తారు?
జ: రెటీనా
3. వెలుపలి చెవికి, మధ్య చెవికి మధ్యలో ఉండే పలుచని నిర్మాణం
జ: కర్ణభేరి
4. 60 ఏళ్ల వయసున్న రంగయ్య తన తోటలో దూరంగా ఉండే చెట్లను చూడలేకపోతున్నాడు. ఈ లోపాన్ని ఏమంటారు?
జ: హ్రస్వదృష్టి
5. మధ్యచెవిలోని ఎముకల వరుసక్రమం
జ: కూటకం, దాగలి, కర్ణాంతరాస్థి
6. కంటి గుడ్డును కదిపేందుకు కనుగుంతల్లో ఉన్న కండరాల సంఖ్య
జ: 6
7. అతి తక్కువ కాంతి ఉన్న గుహలో ఉన్న కుందేలును వేటగాడు బంధించి పట్టుకున్నాడు. అయితే దీనికి సహాయపడిన కంటిలోని కణాలు-
జ: దండాలు
8. కిందివాటిలో కంటికి సంబంధించని వ్యాధి
(ఎ) గ్లూకోమా (బి) ట్రకోమా (సి) బొల్లి (డి) వర్ణాందత
జ: సి (బొల్లి)
9. కంటి రంగును దేన్ని బట్టి నిర్ణయిస్తారు?
జ: కనుపాప
10. నేత్రపటలంలో శంకువులు అనే కణాలు అధికంగా ఉండే భాగం.
జ: ఎల్లోస్పాట్
11. అంతశ్చర్మంలో 'సెబం' అనే పదార్థాన్ని స్రవించేది
జ: తైలగ్రంథి
12. కంటిలోని మొదటిపొర అయిన ధృడస్తరంలో ఉండే కటకం
జ: కుంభాకార కటకం
13. కిందివాటిలో నాలుక గ్రహించని రుచి ఏది?
(ఎ) కారం (బి) చేదు (సి) ఉప్పు (డి) తీపి
జ: ఎ (కారం)
14. మానవుడి చెవి వినగలిగే ధ్వని గరిష్ఠ పౌనఃపున్యం ఎంత? (హెర్ట్జ్‌లలో)
జ: 20000
15. మానవ శరీరంలో చర్మం ఎక్కడ దళసరిగా ఉంటుంది?
జ: అరికాళ్లు
16. కనురెప్పల్లో చర్మం మందం ......... మి.మీ.
జ: 0.5
17. శరీరంలోనే అతి చిన్న ఎముక అయిన స్టేపిస్ ఏ అవయవంలో ఉంటుంది?
జ: మధ్యచెవి
18. సూర్యకిరణాల నుంచి చర్మాన్ని రక్షించే వర్ణకం
జ: మెలనిన్
19. జిరాఫ్తాల్మియా వ్యాధి ఏ అవయవానికి సంభవిస్తుంది?
జ: కన్ను
20. చర్మంలో పీడనాన్ని గ్రహించే గ్రాహకాలు
జ: పాసినియన్ గ్రాహకాలు
21. కిందివాటిలో చర్మానికి వచ్చే పోషకాహార వ్యాధి ఏది?
(ఎ) తట్టు (బి) కుష్టు (సి) తామర (డి) పెల్లాగ్రా
జ: డి (పెల్లాగ్రా)
22. చెవిలో ఏ భాగం నుంచి సెరుమినస్ గ్రంథులు ఉండి 'మైనం' లాంటి పదార్థాన్ని స్రవిస్తాయి?
జ: పిన్నా
23. శరీర సమతాస్థితిని కాపాడే చెవిలోని భాగం
జ: అంతరచెవి
24. ఆధార్ లాంటి గుర్తింపు కార్డులను ఇచ్చేటప్పుడు కంటిలో ఏ భాగాన్ని ఫోటోగా తీసుకుంటారు?
జ: కనుపాప
25. కిందివాటిలో సరికానిది??
(ఎ) కన్ను - దృక్‌నాడీ (బి) ముక్కు - ఘ్రాణనాడీ
(సి) చెవి - శ్రవణనాడీ (డి) చర్మం - వేగస్‌నాడీ
జ: డి (చర్మం - వేగస్‌నాడీ)
26. చర్మంలోని శీతల గ్రాహకాలు ఎంత ఉష్ణోగ్రత దాటితే ఉష్ణగ్రాహకాలుగా మారతాయి?
జ: 35oC
27. కంటి అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?
జ: ఆప్తామాలజీ
28. కంటిలోని ఏ ప్రాంతంలో ప్రతిబింబం ఏర్పడదు?
జ: దండకణాలు, శంకుకణాలు లేని ప్రాంతం
29. నాలుక పక్కభాగం ఏ రుచులను గ్రహిస్తుంది?
జ: పులుపు
30. కంటిలో జ్ఞాన రంగానికి చెందిన పొర
జ: రెటీనా
31. దగ్గరి వస్తువులను చూడలేకపోతే దాన్ని ఏమంటారు?
జ: దూరదృష్టి
32. మానవుడి కన్ను ఏ దృష్టిని కలిగి ఉంటుంది?
జ: బైనాక్యులర్
33. కృత్రిమంగా తయారు చేసిన ఆహార పదార్థాల రుచికి ఉన్న పేరు
జ: మెటాలిక్ టేస్ట్
34. బాహ్య చెవిలోని కర్ణభేరి ఏ ఎముకతో కలిసి ఉంటుంది?
జ: కూటకం
35. మానవుడి శరీరంలో అతిపెద్ద అవయవం ఏది?
జ: చర్మం
36. రాజు పోటీ పరీక్షల్లో విజయం సాధించే లక్ష్యంతో నిద్రలేకుండా పరీక్షలకు సన్నద్ధం అవుతున్నాడు. అయితే అతడి కంటిలోని ద్రవాలు ఒత్తిడికిలోనై కళ్ల నుంచి నీరు కారింది. ఇది ఏ వ్యాధి లక్షణం?
జ: గ్లూకోమా
37. కింది అంశాలను జతపరచండి.
i) ఫిలిఫామ్ పాపిల్లే ( ) a) పొలుసులు
ii) ఫంగిఫాం పాపిల్లే ( ) b) గుండ్రటి నిర్మాణాలు
iii) సర్కంవల్లేట్ ( ) c) పెద్ద అండాకారం పాపిల్లే
iv) ఫోలియేట్ ( ) d) ఉబ్బెత్తు నిర్మాణాలు పాపిల్లే
జ: i-a, ii-b, iii-c, iv-d
38. దేని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘రైనాలజీ’ అంటారు?
జ: ముక్కు
39. అంతర చెవిలో త్వచగహనాన్ని ఆవరించి ఉండేది కిందివాటిలో ఏది?
1) పేటిక 2) అర్ధవర్తుల కుల్యలు 3) కర్ణావర్తనం 4) అస్థిగహనం
జ: అస్థిగహనం
40. కిందివాటిలో కర్ణభేరికి సంబంధించి సరైన వాక్యం ఏది?
1) ఇది బాహ్య చెవి చివరి భాగం. 2) శబ్ద తరంగాలను లోపలి చెవి వైపు పంపుతుంది.
3) దుమ్ము - ధూళి లాంటి రేణువులను నియంత్రిస్తుంది. 4) 1, 2
జ: 1, 2
41. అతి తక్కువ కాంతిని గ్రహించగల శక్తి దేనికి ఉంది?
జ: దండాలు
42. ఎముకలు వాటి ఆకారాలకు సంబంధించి కిందివాటిలో సరైంది?
1) కంటకం - సుత్తి 2) దాగలి - పట్టెడ
3) కర్ణాంతరాస్థి - అంకవనె 4) పైవన్నీ
జ: పైవన్నీ
43. కన్నులో సాధారణంగా ఉండే పొరలు ఎన్ని?
జ: మూడు
44. ‘శరీర సమతాస్థితిని’ కనుక్కుని కాపాడే గ్రాహకాలు వేటిలో ఉంటాయి?
జ: చెవి
45. నేత్ర పటలంలో ఉండే దండాలు, కోన్‌ల నిష్పత్తి....
జ: 15 : 1
46. నాలుక ముందు భాగంలో ఉండే గ్రాహకాలు వేటిని గ్రహిస్తాయి?
జ: ఉప్పు, తీపి
47. సాధారణంగా దృక్ నాడులు ఎన్ని ఉంటాయి?
జ: రెండు
48. కనుపాప మధ్యలో గుండ్రంగా ఉండే రంధ్రాన్ని ఏమంటారు?
జ: తారక
49. కంటి రంగును నిర్ణయించడానికి కంటిలోని ఏ భాగం ముఖ్య పాత్ర వహిస్తుంది?
జ: కనుపాప