• facebook
  • whatsapp
  • telegram

జీవుల్లో వైవిధ్యం - వర్గీకరణ

1. మానవుడు కింది ఏ వర్గానికి చెందుతాడు?

జ‌: ప్రైమేట్స్


2. ఏ జీవులు ఆడ, మగ రెండూ పిల్లలకు పాలిచ్చి పెంచుతాయి?

జ‌: ఎకిడ్నా


3. కిందివాటిలో శీతల రక్త జీవులు ఏవి?

ఎ) చేప - నెమలి       బి) కప్ప - ఆవు        సి) చేప - కప్ప        డి) పాము - పావురం

జ‌: సి ( చేప - కప్ప )


4. గుండె గదుల సంఖ్యల్లో కిందివాటిలో సరికానిది.

ఎ) మొసలి-4          బి) చేప-2                సి) పాము-3              డి) పావురం-3

జ‌: డి (పావురం-3)


5. సకశేరుకాల్లో 'జల శ్వాసక్రియ'ను జరుపుకునే జీవులు

జ‌: చేపలు


6. కింది జీవుల్లో సంతానోత్పత్తిని కలిగిన మగజాతి జీవి ఏది?

ఎ) డాల్ఫిన్              బి) తిమింగలం          సి) నీటిగుర్రం                   డి) ఏనుగు

జ‌: సి (నీటిగుర్రం)

7. అకశేరుకాలు, సకశేరుకాల్లో పెద్ద వర్గాలు వరుసగా

జ‌: ఆర్థ్రోపొడా - చేపలు

8. అతి పెద్ద సజీవ అకశేరుక జీవి

జ‌: ఆర్కిట్యూథిస్


9. ఏ జీవుల్లో 'జ్వాలా కణాలు' విసర్జక క్రియలో పాల్గొంటాయి?

జ‌: ప్లాటి హెల్మింథిస్


10. కీటకాలను చేర్చిన విభాగం

జ‌: ఇన్‌సెక్టా


11. ఆర్థ్రోపొడ వర్గానికి చెందిన శిశోత్పాదక జీవి

జ‌: తేలు


12. ముత్యాలను ఉత్పత్తి చేసే అయిస్టర్ జీవుల వర్గం

జ‌: మొలస్కా


13. ఏకదళ బీజదానికి చెందిన మొక్క

జ‌:కొబ్బరి


14. రంధ్రాలు ఉండే జీవులను చేర్చిన వర్గం

జ‌: పొరిఫెరా

15. ఏ మొక్కల్లో విత్తనాలను ఆవరించి ఫలకవచం ఉండదు?

జ‌: సైకస్


16. గబ్బిలం ఒక

జ‌: క్షీరదం


17. కిందివాటిలో ఎర్ర రక్తకణాలు లేని వానపాము వర్గం
ఎ) ఆర్థ్రోపొడా          బి) అనెలిడా           సి) మొలస్కా          డి) సరీసృపాలు

జ‌: బి (అనెలిడా )


18. గాలిని కలిగి ఉండే గదులు ఏ జీవి శరీరంలో ఉంటాయి?

జ‌: పావురం


19. డైనోసార్ ఒక

జ‌: సరీసృపం


20. వృక్షరాజ్య ఉభయచరాలు అనే పేరు గల మొక్కలు

జ‌: బ్రయోఫైటా

21. ఉభయచర జీవులకు సంబంధించి కిందివాటిలో సరైన ప్రవచనం.

1) ఇవి శీతల రక్త జంతువులు

2) గ్రీష్మకాల, శీతకాల సుప్తావస్థలను జరుపుతాయి.

ఎ) 1 మాత్రమే సరైంది               బి) 2 మాత్రమే సరైంది

సి) 1, 2 సరైనవి కావు              డి) 1, 2 సరైనవి

జ: డి (1, 2 సరైనవి)


22. 'ముళ్ల లాంటి చర్మం ఉన్న జీవుల' వర్గానికి చెందిన జీవి

జ‌: సముద్ర నక్షత్రం


23. విట్టేకర్ ప్రకారం 'బ్యాక్టీరియా రాజ్యం 

జ‌: మొనీరా


24. జీవులను రెండు రాజ్యాలుగా వర్గీకరించింది

జ‌: లిన్నేయస్

25. 'పగడాల దీవి' ఏ వర్గానికి చెందిన జీవులకు సంబంధించింది?

జ‌:సీలెంటిరేటా


26. హిప్పోకాంపస్‌ను ఏ దేశీయులు ఔషదాల్లో వినియోగిస్తున్నారు?

జ‌: చైనీయులు

 
రచయిత: కనుముక్కల నాగేంద్ర

Posted Date : 26-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌