• facebook
  • whatsapp
  • telegram

ఆధునిక భౌతికశాస్త్రం

1. 1 a.m.u.  ఎన్ని 'Mev'  లకు సమానం?
 

2. 92U238    90Th234  +  ........... ?
 

3. ఒక రేడియోధార్మిక మూలకం విఘటన స్థిరాంకం λ , దాని అర్ధ జీవితకాలం T అయితే  'λ' విలువ ఎంత?
 

4. ఒక మూలకపు పరమాణు సంఖ్య, ఆ పరమాణువులో ఉన్న వేటి సంఖ్యకు సమానం?
 

5. a.m.u అంటే ?
 

6. ద్రవ్యరాశి సంఖ్య అంటే  ఏమిటి?
 

7. α - కణంలో  ఉండే  ఆవేశం  ఏది? 
 

8. β - కణం ద్రవ్యరాశి  దేని ద్రవ్యరాశికి  సమానం?
 

9. β - కణం విద్యుత్ క్షేత్రంలో  ఏ ఆవేశ పలక వైపు విక్షేపం చెందుతుంది? 

10. ఒక α - విఘటనం, ద్రవ్యరాశి సంఖ్యను  ఎన్ని ప్రమాణాలు తగ్గిస్తుంది?
 

11. β - విఘటనం జరిగితే, మూలకపు పరమాణు సంఖ్య ఏ విధంగా ఉంటుంది?
 

12. 1H1 , 1H2 లు  వేటికి ఉదాహరణ?


13. 19K40 , 20Ca40 లు  వేటికి ఉదాహరణలు?
 

14. ఒకే న్యూట్రాన్ సంఖ్య ఉన్న రెండు వేర్వేరు మూలకాలను  ఏమంటారు?
 

15. న్యూక్లియర్ రియాక్టర్‌లోని మితకారి, న్యూట్రాన్ లోని దేన్నితగ్గిస్తుంది?
 

16. నక్షత్రాల్లో  జరిగే చర్యలు ఏవి?
 

17. శిలల వయస్సును నిర్ధరించడానికి ఉపయోగించే  'ఐసోటోప్‌' ఏది?
 

18. శిలాజాల వయస్సును నిర్ధరించడానికి ఉపయోగించే  'ఐసోటోప్‌' ఏది? 
 

19.  విద్యుత్ పరంగా పరమాణువు స్వభావం ఏవిధంగా ఉంటుంది?  
 

20. రూథర్ ఫర్డ్ బంగారం రేకు ప్రయోగం  దేన్ని కనుక్కోవడానికి ఉపయోగపడింది?
 

21.  ఎలాంటి కక్ష్యల్లో ఎలక్ట్రాన్లు శక్తిని ఉద్గారించవు? 

జవాబులు:  1. 931.5   2.  2He4   (లేదా)   α - కణం   3. 0.693/ T    4. ప్రోటాన్ల  5. అటామిక్ మాస్ యూనిట్ లేదా పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం   6. పరమాణువులో ఉండే  మొత్తం ప్రోటాన్ల, న్యూట్రాన్ల సంఖ్య   7. ధన   8. ఎలక్ట్రాన్   9. ధన   10. 4    11. పెరుగుతుంది    12. ఐసోటోప్    13. ఐసోబార్   14.  ఐసోటోన్‌లు   15. గతిశక్తి లేదా వేగం   16. కేంద్రక సంలీన  17. U235    18. C14  19. తటస్థం   20. పరమాణు కేంద్రకం   21. స్థిర

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌